AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Animal: సింహం ఎందుకు జాతీయ జంతువు కాలేకపోయింది..! పులికే ఆ గుర్తింపు ఎందుకు..? ఎప్పుడైనా ఆలోచించారా..? అసలు సంగతి ఇదే..

భారత జాతీయ జంతువు సింహం. 1969లో వన్యప్రాణి బోర్డు సింహాన్ని జాతీయ జంతువుగా ప్రకటించింది. అయితే 1973లో..

National Animal: సింహం ఎందుకు జాతీయ జంతువు కాలేకపోయింది..! పులికే  ఆ గుర్తింపు ఎందుకు..? ఎప్పుడైనా ఆలోచించారా..? అసలు సంగతి ఇదే..
Bengal Tiger
Sanjay Kasula
|

Updated on: Aug 09, 2022 | 9:32 PM

Share

అడవికి రాజు సింహం(Lion).. కానీ భారత జాతీయ జంతువు(National Animal) మాత్రం పులి(Tiger). ఎందుకు ఇలా జరిగింది..? పౌరుషానికి ప్రతీక సింహం.. అయినా అతి పెద్ద స్థానాన్ని మాత్రం పులి దక్కించుకుంది. పులిశాస్త్రీయ నామం ‘పాంథెర టైగ్రిస్’. ఫెలిడే కుటుంబంలో కెల్లా అతిపెద్ద జాతి. ఇది పాంథెరా ప్రజాతిలో భాగం. ఆరెంజి-బ్రౌన్ చర్మంపై చిక్కటి నిలువు చారలు దీని ప్రత్యేకత. ఈ నిలువుచారలు కిందికి వెళ్ళే కొద్దీ పలచబడతాయి. ఇది, ఆహారపు గొలుసులో శీర్షభాగాన ఉండే వేటాడే జంతువు. ప్రధానంగా జింక, అడవి పంది వంటి ఖురిత జంతువులను (గిట్టలు గల జంతువులు) వేటాడుతుంది. ఇది ఒక ప్రదేశానికి పరిమితమై ఉంటుంది. సాధారణంగా ఒంటరిగా జీవించే వేట జంతువు.

జాతీయ చిహ్నాలు భారతదేశం గుర్తింపు, ఆధారం. ప్రతి గుర్తుకు దాని స్వంత ప్రాముఖ్యత కూడా ఉంది. జాతీయ పుష్పాలు, పాటలు, పక్షులు దేశ గౌరవాన్ని చూపించడానికి చిహ్నాలుగా వస్తాయి. అదే విధంగా, జాతీయ జంతువు ‘పులి’ కూడా ఈ జాతీయ చిహ్నంలో వస్తుంది.

1973లో పులిని జాతీయ జంతువుగా ఎంపిక చేశారు. ప్రతి జాతీయ చిహ్నాన్ని ఎంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అదేవిధంగా పులిని జాతీయ జంతువుగా ఎంపిక చేయడానికి కూడా ఓ కారణంఉంది. దీనికి ప్రధాన కారణం పులి చురుకుదనం, బలం, దృఢత్వం.. ఈ కారణాల వల్ల పులిని జాతీయ జంతువుగా ఎంపిక చేశారు.

పులి కంటే ముందు సింహం జాతీయ జంతువు

మీరు వింటే ఆశ్చర్యపోతారు కానీ పులి కంటే ముందు భారత జాతీయ జంతువు సింహం. 1969లో వన్యప్రాణి బోర్డు సింహాన్ని జాతీయ జంతువుగా ప్రకటించింది. అయితే 1973లో సింహానికి జాతీయ జంతు హోదాను తొలగించి.. పులిని జాతీయ జంతువుగా ప్రకటించారు.

అయితే సింహం స్థానంలో పులిని జాతీయ జంతువుగా ఎందుకు ఎంచుకున్నారన్నదే పెద్ద ప్రశ్న. నిజానికి ఒకప్పుడు జార్ఖండ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో పులులు పెద్ద సంఖ్యలో ఉండేవి. కానీ క్రమంగా వాటి సంఖ్య భారీగా తగ్గింది. ఇలా అంతరించిపోకుండా కాపాడేందుకు పులిని జాతీయ జంతువుగా కూడా ఎంపిక చేశారు.

2018 నివేదిక ప్రకారం, భారతదేశంలో పులుల సంఖ్య 2967కి పెరిగింది. ఈ సంఖ్య 2014లో 2226, దాదాపు 33 శాతం పెరిగింది. పులిని జాతీయ జంతువుగా ప్రకటించిన ఏడాదిలో పులుల సంఖ్య 9 మాత్రమే. తగ్గుతున్న పులుల సంఖ్యను అరికట్టేందుకు 1973లో ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం భారతదేశంలో 53 టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి.

మరిన్ని ఇలాంటి ఆసక్తికర వార్తల కోసం..

వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?