Corona Effect: ఏడాది కాలంలో తొలి హగ్.. వృద్ధ దంపతుల భావోద్వేగం.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..

|

Mar 18, 2021 | 2:05 PM

Corona Effect: ఎలా పుట్టుకొచ్చిందో గానీ.. మాయదారి కరోనా వైరస్ ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. సాటి మనిషిని చూసి మరో మనిషి..

Corona Effect: ఏడాది కాలంలో తొలి హగ్.. వృద్ధ దంపతుల భావోద్వేగం.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..
Viral Photo
Follow us on

Corona Effect: ఎలా పుట్టుకొచ్చిందో గానీ.. మాయదారి కరోనా వైరస్ ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. సాటి మనిషిని చూసి మరో మనిషి భయపడే దారుణమైన స్థితిని కల్పించింది కరోనా మహమ్మారి. చివరికి కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను సైతం తాకలేని దుస్థితిని కల్పించింది. ఎవరిని ముట్టుకుందామన్నా కరోనా భయం.. ఎవరితో మాట్లాడుదామన్నా కరోనా భయం.. దాంతో చుట్టూ ఎంతమంది జనాలు ఉన్నా ఏకాకిగా జీవితాలను గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక కరోనా బారిన పడిన వారి పరిస్థితి అయితే మరీ దారుణం అని చెప్పాలి. ఎందుకురా ఈ జీవితం అనేంత నరకాన్ని బాధితులకు చూపించింది కరోనా రక్కసి. ఒకరిని ముట్టుకునేది లేదు.. ఒకరితో మాట్లాడేది లేదు.. ఒకరు మన దగ్గరకు వచ్చేది లేదు.. ఒకరి దగ్గరకు మనం పోయేది లేదు. దాంతో కరోనా బాధితులు మానసికంగా ఎంతో క్షోభను అనుభవించారు. కరోనా బాధితుల అనుభవించిన క్షోభను వారి మాటల్లో వింటే భరించడం కూడా కష్టంగానే ఉంటుంది.

ఇంతటి క్షోభకు నిదర్శనమైన ఘటనే తాజాగా అమెరికాలో వెలుగు చూసింది. దాదాపు ఏడాది పాటు కరోనా కారణంగా దూరంగా ఉన్న వృద్ధ దంపతులు.. ఎట్టకేలకు కలుసుకున్నారు. ఆ క్షణం వారిలో కలిగిన ఆనందం.. సంతోషం.. వర్ణణాతీతం. ఏడాది తరువాత వారిద్దరూ కలుసుకోవడంతో విపరీతమైన భావోద్వేగానికి గురయ్యారు. అసలేం జరిగిందంటే.. అమెరికాలో భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. దాంతో అక్కడి ప్రభుత్వం వృద్ధుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కొన్ని కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి వృద్ధులకు సకల సౌకర్యాలు కల్పించింది. అయితే అమెరికాకు చెందిన వృద్ధ దంపతులు రాబర్ట్ కౌచ్, మార్లెన్ కరోనా లను కూడా సంరక్షణ కేంద్రంలో ఉన్నారు. కిట్టనింగ్ కేర్ సెంటర్‌లో వీరిద్దరినీ చేర్చారు. అయితే కరోనా కారణంగా ఒకరిని ఒకరు కలుసుకోవడానికి వీల్లేదు. నిబంధలు అంతలా కఠినతరం చేశారు అక్కడి అధికారులు.

దాదాపు ఏడాది పాటుగా ఉన్న ఈ ఆంక్షలను తాజాగా కిట్టనింగ్ కరోనా కేర్ సెంటర్ నిర్వాహకులు సడలించారు. విజిటింగ్‌కు అవకాశం కల్పించారు. దాంతో ఈ వృద్ధ దంపతులు ఎట్టకేలకు ఒకరిని ఒకరు కలుసుకున్నారు. ఆ సందర్భంగా వారి కళ్లో కనిపించిన ఆనందం గురించి వర్ణించలేమనే చెప్పాలి. దాదాపు సంవత్సరానికి పైగా రోజుల తరువాత వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ సందర్భంగా ‘హగ్’ చేసుకున్నారు. ఒకరినొకరు తనివితీరా చూసుకున్నారు. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సమయంలో వారిలో కలిగిన ఆనందం అంతా వారి కళ్లలో, మొహంతో ప్రతిబింబించింది. కాగా, వీరిద్దరి హగ్, డ్యాన్స్‌కు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూస్తే మనకూ కన్నీళ్లు ఆగవంటే అతిశయోక్తి కాదు.

Viral Video:

Also read:

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కరోనా ఎఫెక్ట్.. అయినా భారీ బడ్జెట్‌.. ఏయే శాఖకు ఎంతెంత కేటాయించారంటే..

Indian Army Jobs 2021: ఇంటర్‌తో ఆర్మీలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఎప్పటి వరకు అంటే..