AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unhappy Indians: సంతోషమా నీ జాడేది? వెతుక్కుంటున్న భారతీయులు.. గ్లోబల్ ఇండెక్స్‌లో లోయెస్ట్

ఎవడైతే తాను సంతోషంగా వుంటూ తన చుట్టూ వుండే వాళ్ళను సంతోష పెట్టగలుగుతున్నాడో అతడే ధన్యుడంటారు. అదే సమయంలో ఎవనికైతే సంతోషమనునది లేదో.. అతన్ని జీవన్మృతునిగా పరిగణస్తారు. సగటు భారతీయుల విషయంలో...

Unhappy Indians: సంతోషమా నీ జాడేది? వెతుక్కుంటున్న భారతీయులు.. గ్లోబల్ ఇండెక్స్‌లో లోయెస్ట్
India
Rajesh Sharma
|

Updated on: Mar 20, 2021 | 4:45 PM

Share

Unhappy Indian people number increasing year by year: ఎవడైతే తాను సంతోషంగా వుంటూ తన చుట్టూ వుండే వాళ్ళను సంతోష పెట్టగలుగుతున్నాడో అతడే ధన్యుడంటారు. అదే సమయంలో ఎవనికైతే సంతోషమనునది లేదో.. అతన్ని జీవన్మృతునిగా పరిగణస్తారు. సగటు భారతీయుల విషయంలో ఇపుడు సంతోషమనేదే లేని జీవితాలుగా పరిగణించాల్సిన గణాంకాలు తాజాగా వెల్లడయ్యాయి. దేశంలో తాము సంతోషంగా వుంటే చాలు పక్కోడు ఏమైతే నాకెంటిలే అనే నైజం పెరుగుతోంది. అందుకే దేశంలో సంతోషకరమైన జీవితం గడుపుతున్న వారి శాతం చాలా కనిష్ట స్థాయికి చేరుకుంటోంది. దీని నిదర్శనంగా ప్రపంచంలోని దేశాల్లోకెళ్ళా భారతీయుల్లోనే సంతోషం పాలు తక్కువగా వుందని తాజా గ్లోబల్ ఇండెక్స్ వెల్లడించింది.

ప్రపంచ సంతోషకర దేశాలలో భారత్‌ దిగువన కనిపిస్తోంది. ప్రపంచంలోని 149 దేశాలలో నిర్వహించిన సర్వేలో భారత్‌కు సంతోషకరమైన దేశాలలో ఏకంగా 139వ స్థానం దక్కిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దిగువ నుంచి 139 స్థానంలో భారత దేశం నిలిచింది. 2020లో అత్యంత సంతోషకరమైన దేశాలలో అగ్రస్థానాన్ని ఫిన్‌లాండ్ పొందింది. ‘సస్టెయినబుల్ డెవలప్​మెంట్ సొల్యూషన్స్ నెట్​వర్క్​ ‘ అనే సంస్థ వివిధ దేశాలలో సంతోషకరంగా జీవిస్తున్న వారి శాతాన్ని తెలుసుకునేందుక గ్లోబల్ ఇండెక్స్ సర్వేను నిర్వహించింది. ఇలాంటి నివేదికలను గత ఎనిమిదేళ్ళుగా అంటే 2012 నుంచి ‘సస్టెయినబుల్ డెవలప్​మెంట్ సొల్యూషన్స్ నెట్​వర్క్​’ విడుదల చేస్తోంది.

మార్చి 20వ తేదీన అంతర్జాతీయ ఆనంద దినోత్సవంగా పాటిస్తారు. ఈ సందర్భంగానే ‘సస్టెయినబుల్ డెవలప్​మెంట్ సొల్యూషన్స్ నెట్​వర్క్​’ తాజా సర్వే వివరాలను వెల్లడించింది. “ప్రపంచ ఆనంద నివేదిక-2021” విడుదల చేశారు. ఇందులో భారత దేశం 139వ స్థానంలో నిలిచింది. ఈ నివేదిక భారతీయులు యాంత్రిక జీవనానికి అలవాటు పడుతున్న కఠోర సత్యాన్ని వెల్లడించింది. 2020లో వివిధ దేశాల ప్రజల జీవన స్థాయిపై అధ్యయనం చేసి నివేదిక తయారు చేశారు. దేశ జీడీపీ, ప్రజల ఆరోగ్యం, స్వేచ్ఛా సమాజం, అవినీతి వంటి వాటిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు.

ప్రపంచ ఆనంద నివేదిక-2021 జాబితాలో మొదటి స్థానంలో ఫిన్‌లాండ్ వుండగా.. ఆ తర్వాత స్థానాలలో ఐస్‌లాండ్‌, డెన్మార్క్‌, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌ వంటి దేశాలున్నాయి. గతేడాది 18వ స్థానంలో వున్న అగ్రరాజ్యం అమెరికా ఓ మెట్టు తగ్గింది. ప్రపంచ ఆనంద నివేదిక-2021లో అమెరికా 19వ స్థానాన్ని పొందింది. గతేడాది 94వ స్థానంలో ఉన్న చైనా ఈసారి 84వ స్థానానికి చేరుకుంది. అంటే ప్రపంచానికి కరోనాను పరిచయం చేసినప్పటికీ చైనా దేశీయులు ఏ మాత్రం ఆందోళన చెందలేదనేది ప్రపంచ ఆనంద నివేదిక-2021 ద్వారా వెల్లడైంది. గతేడాది 144వ స్థానంలో (156 దేశాలలో) ఉన్న భారత్‌ ఈ సంవత్సరం 139 (149 దేశాలలో)కి చేరింది. గతేడాది 66వ స్ధానంలో ఉన్న పాకిస్థాన్‌ ఈసారి 105వ స్థానంలో నిలిచి మన దేశం కంటే చాలా మెరుగ్గా వుండడం విశేషం. ఆనంద జీవన ఇండెక్సులో అట్టడుగున ఉన్న దేశంగా ఆఫ్గనిస్థాన్‌ నిలిచింది. చివరి నుంచి రెండవ స్థానంలో జింబాబ్వే.. ఆ తరువాతి స్థానాలలో… టాంజానియా, జోర్డాన్‌ వున్నాయి.

కాగా గత మూడేళ్ళ నుంచి అత్యంత ఆనందకరమైన దేశంగా ఫిన్‌లాండ్ కొనసాగుతోంది. 2020 సంవత్సరమంతా కోవిడ్‌ భయాందోళనలు కనిపించాయి. కరోనా పాండమిక్ పీరియడ్‌లోను ఫిన్‌లాండ్ దేశస్థులు సంతోషంగానే గడపడం విశేషం. ఎన్ని సమస్యలున్నా ఆనందంగానే స్వీకరించే నైజం ఫిన్‌లాండ్‌ ప్రజల్లో వుందని తాజా నివేదిక తేల్చింది. కాగా ఫిన్‌లాండ్‌ దేశ జనాభా కేవలం 55.2 లక్షలు మాత్రమే కాగా.. హైదరాబాద్ నగరం కంటే ఆ దేశం చాలా తక్కువ జనాభాను కలిగి వుంది.

ALSO READ: తమిళనాడు ఎన్నికల్లో అంతా గోల్డు మయమే.. ఎవరిదగ్గరెంతంటే?