AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukrainian Couple : వీరిద్దరు చేతులకు సంకెళ్లు వేసుకొని ప్రేమించుకుంటున్నారు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Ukrainian Couple : ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తులు ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏం చేస్తారు.. ఈ కాలంలో

Ukrainian Couple : వీరిద్దరు చేతులకు సంకెళ్లు వేసుకొని ప్రేమించుకుంటున్నారు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Ukrainian Couple
uppula Raju
|

Updated on: Mar 13, 2021 | 5:48 PM

Share

Ukrainian Couple : ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తులు ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏం చేస్తారు.. ఈ కాలంలో అయితే నిత్యం ఒకరికొకరు సెల్‌ఫోన్‌లో టచ్‌లో ఉంటారు. మెసేజ్‌లు చేసుకుంటు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రేమను ఒలకపోస్తూ యాక్టివ్‌గా ఉంటారు. ఇంకా చెప్పాలంటే నిత్యం వాట్స్‌ప్ స్టేటస్‌లతో, సినిమాలు, షాపింగ్స్‌ చేస్తూ ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకుంటూ, సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు ఇచ్చుకుంటు ఉంటారు. కానీ ఉక్రెయిన్‌లో ఓ జంట ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..

ఉక్రెయిన్‌కు చెందిన ఓ జంట చేతులకు బేడీలు వేసుకొని మరీ ప్రేమించుకుంటున్నారు. ఇలా ఎందుకంటే వాళ్లు ఏం చెప్పారో తెలుసకోండి. ఉక్రెనియాకు చెందిన అలెగ్జాండర్ కుడ్లే, విక్టోరియా పుస్తోవిటోవ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలెగ్జాండర్.. ఆటోమొబైల్ సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తుండగా, విక్టోరియా బ్యూటీషియన్. పెళ్లి చేసుకున్నాక తొలినాళ్లలో బాగానే ఉన్న ఈ జంటకు, ఆ తర్వాత కాలంలో మనస్పర్థలు ఎదురయ్యాయి. దీంతో వారంలో రెండుసార్లు ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకుంటూ, విడిపోయి కలుస్తూ జీవితంలో కొనసాగుతున్నారు. కాగా గత నెల 14న వాలంటైన్స్ డే నుంచి సందర్భంగా వీళ్లు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

3 నెలల పాటు చేతులకు బేడీలసుకోవాలని నిర్ణయించుకొని.. అలెగ్జాండర్ కుడి చేయి, విక్టోరియా ఎడమ చేయిని కలిపి చైన్‌తో లాక్ చేసుకున్నారు. ఇలా మూడు నెలలపాటు ఒకరి పనుల్లో మరొకరు సాయపడుతూ, ఆ ఎక్స్‌ప్రెషన్స్ అన్నిటినీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయాలనుకున్నారు. అందులో భాగంగా ఫొటోలు షేర్ చేయడంతో వీరికి ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతోంది. తాము గొడవపడుతుంటే తమలోని ప్రేమ మరింత పెరుగుతుందని ఈ జంట పేర్కొంటుండటం విశేషం. కాగా వీరి ఫొటోలను చూస్తున్న నెటిజన్లు.. మీ ప్రేమ గెలుస్తుందని, ‘ప్రెట్టీ కపుల్’ అని కామెంట్లు పెడుతున్నారు.

KTR Gift: టీఆర్‌ఎస్‌ కార్యకర్త కూతురుకు సర్‌ప్రైజ్‌ కాల్‌ చేసిన కేటీఆర్‌..చిన్నారి అడిగిన గిఫ్ట్‌కు ఫిదా అయిన మంత్రి

Cylinder Booking: గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తున్నారా.? అయితే ఇలా చేయండి.. రూ.50 క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చు..

Telangana: ఓ పురాతన గడీ నుంచి పట్టపగలు పెద్ద, పెద్ద శబ్ధాలు.. స్థానికులు వెళ్లి చూడగా షాక్…