ఆ చిట్టి తల్లికి సరిగ్గా మాటలు కూడా రావు. మహా అయితే రెండున్నరేళ్ల వయసు ఉంటుంది. అయితేనేం.. తన తల్లిని, తమ్ముడిని కాపాడుకుంది. ఆ చిన్నారుల తల్లి ఓ రైల్వే వంతెనపై స్పృహతప్పి పడిపోయింది. పాలు తాగే వయసున్న బాబు అమ్మ లేవకపోవపోయేసరికి.. గుక్కబట్టి ఏడుస్తున్నాడు. ఈ పరిస్థితిలో రెండున్నర వయస్సు పిల్లలు ఎవరైనా సరే.. ఏం చెయ్యాలో తోచక ఏడుపు లఖించుకుంటారు. కానీ ఆ చిన్నారి అలా చేయలేదు. పరిస్థితిని అర్థం చేసుకుని.. రైల్వే పోలీసులకు సమాచారం అందించి.. తనవారి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ మురాదాబాద్‌లోని ఓ రైల్వే స్టేషన్లో జరిగింది.
తల్లి అకస్మాత్తుగా పడిపోయింది. ఎంతలేపినా స్పృహ రావడం లేదు. తమ్ముడేమో ఏడుస్తున్నాడు. దీంతో ఆ చిన్నారి.. తన చిట్టి పాదాలతో అడుగుల వేసుకొని నెమ్మదిగా వంతెన దిగింది. కానీ అక్కడి ఎవరికి ఈ విషయం చెప్పాలో తెలియక అయామయంగా చుట్టూ చూడటం మొదలుపెట్టింది. రైల్వే మహిళ పోలీసు వైపు కనిపించడంతో ఆమె వైపు దీనంగా చూసింది. ఏదో చెప్పాలని చూస్తున్న ఆ చిన్నారి మనసును ఆ విమెన్ కానిస్టేబుల్ అర్థం చేసుకుంది. దగ్గరకు వెళ్లి, ఏం జరిగిందని పోలీసుల అడితే.. వచ్చీరాని మాటలతో విషయం చెప్పలేకపోయినప్పటికీ… వారిని తన తల్లి వద్దకు తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లి.. చిన్నారి తల్లిని చూసిన వెంటనే అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. తల్లి, తమ్ముడి వద్దకు పోలీసులను తీసుకెళ్లిన తర్వాత.. ఇక తన తల్లికి ఏం కాదని ఆనందం ఆ చిన్నారి ముఖంలో కనిపించింది. ప్రస్తుతం ఆ పాప తల్లి, తమ్ముడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. అయితే ఆమె స్పృహలో లేకపోవడం వల్ల వారు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్తున్నారో అధికారులు గుర్తించలేకపోయారు.
Also Read: జైలులో మగ ఖైదీలకు చుక్కలు చూపించిన మహిళా అధికారిణి.. మరీ ఇంత దారుణమా..?