Two Children Mom: ఇంట్లో కూర్చునే కోట్లు సంపాదిస్తున్న ఇద్దరు పిల్లల తల్లి.. సక్సెస్ కోసం చెప్పిన 5 సూత్రాలు మీకోసం

|

Jun 07, 2023 | 12:01 PM

వినడానికి మీకు కాస్త వింతగా అనిపించవచ్చు.. కానీ ఇది నూటికి నూరుపాళ్లు నిజం. ఆ గృహిణి పేరు క్రిస్సెల్ లిమ్. సోషల్ మీడియా ప్రపంచంలో క్రిస్లి 'rich mom' అనే పేరుతో పరిచయం. ఇటీవల ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో ఒక వీడియో షేర్ చేసింది. కోట్లలో సంపాదించడానికి తాను ఏమి చేస్తుందో చెప్పింది.

Two Children Mom: ఇంట్లో కూర్చునే కోట్లు సంపాదిస్తున్న ఇద్దరు పిల్లల తల్లి.. సక్సెస్ కోసం చెప్పిన 5 సూత్రాలు మీకోసం
Rich Mom
Follow us on

మంచి మంచి చదువులు చదుకుని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరూ కల కంటారు.  తద్వారా డబ్బు సంపాదించి ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారు. వాస్తవంలో మాత్రం ప్రతి ఒక్కరూ తమ జీవితం, చదువు, భవిష్యత్ గురించి కలలు కంటారు కానీ కొంతమంది మాత్రమే తాము కన్న కలలను నెరవేర్చగలుగుతారు. ముఖ్యంగా గృహిణులుగా ఉన్న మహిళల గురించి చెప్పాలంటే, ఇంట్లో కూర్చొని తాము చేయగలిగిన ఏదైనా పని తమకు లభిస్తే బాగుండును.. తమ చేతిలో డబ్బులు ఉంటె బాగుటుంది అని కల కంటారు. తాము ఇంట్లో ఉండి సంపాదించుకుంటే.. తద్వారా తన అవసరాల కోసం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదని.. డబ్బులు అడగాల్సిన అవసరం ఉండదని ఆశపడతారు.  అయితే ఇలా ఇంట్లో ఉండి దంపదించుకునే మహిళలు తక్కువ మంది ఉన్నారు. అలాంటి తక్కువ సక్సెస్ అందుకున్న హౌస్ వైఫ్ లో ఒకరి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఓ మహిళ ఇంట్లోనే కూర్చుని కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.

వినడానికి మీకు కాస్త వింతగా అనిపించవచ్చు.. కానీ ఇది నూటికి నూరుపాళ్లు నిజం. ఆ గృహిణి పేరు క్రిస్సెల్ లిమ్. సోషల్ మీడియా ప్రపంచంలో క్రిస్లి ‘rich mom’ అనే పేరుతో పరిచయం. ఇటీవల ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో ఒక వీడియో షేర్ చేసింది. కోట్లలో సంపాదించడానికి తాను ఏమి చేస్తుందో చెప్పింది. క్రిస్లీ విజయ రహస్యాన్ని పాటిస్తే ఎవరైనా సరే.. సక్సెస్ బాట పట్టవచ్చు. ఆమె ఐదు చిట్కాలు పాటిస్తే మహిళలు కూడా డబ్బులను ఆర్జించవచ్చు.

  1. ఐదు చిట్కాలు: ఆమె చెప్పిన మొదటి చిట్కా ఏమిటంటే.. మొదట మీ లక్ష్యాన్ని మీరు గుర్తించాలి.
  2. రెండవది నిర్దేశించుకున్న లక్ష్యానికి కట్టుబడి ఉండాలి.
  3. జీవితంలో విజయం కోసం మూడవ చిట్కా ఏమిటంటే మీరు చేస్తున్న పనిని ఇతరులు కూడా చేస్తుంటే.. వారితో పరిచయం పెంచుకుని మీతో టచ్ లో ఉండేలా చేసుకోవాలి.
  4. విజయవంతం కావాలంటే నాలుగవ చిట్కా.. కొన్ని సార్లు అవసరం అయితే కొన్ని పనులను ఉచితంగా చేయాలని కూడా క్రిస్లీ చెప్పింది. తద్వారా మనం కొత్త నైపుణ్యాన్ని నేర్చుకుంటాము.
  5. ఐదవ అతి ముఖ్యమైన చిట్కా.. సహనం.. మీపై నమ్మకం పెంపొందించుకోవడం.

తాను ఈ చిట్కాల వల్లనే ఈ రోజు మంచి స్టేజ్ లో ఉన్నానని చెప్పింది క్రిస్లీ. ఈమెను సోషల్ మీడియాలో ‘రిచ్ మదర్’ అని కూడా పిలుస్తారు. గత 12 ఏళ్లుగా కష్టపడుతున్న ఆమె ఇప్పుడు ఫ్యాషన్ రంగంలో పెద్ద పేరు తెచ్చుకుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..