14 రోజులు పనిచేస్తే చాలు 9 లక్షల జీతం..! వింత ఉద్యోగం.. ఎక్కడో తెలుసా..?

|

Nov 16, 2021 | 6:02 AM

Strange Job: నేటి కాలంలో రోజుకు 8 గంటలు పనిచేయాలంటేనే ఒక్కొక్కరు నానాతంటాలు పడుతున్నారు. పని తక్కువ జీతం ఎక్కువ ఉండాలని కోరుకుంటారు. అలాంటిది

14 రోజులు పనిచేస్తే చాలు 9 లక్షల జీతం..! వింత ఉద్యోగం.. ఎక్కడో తెలుసా..?
Strange Job
Follow us on

Strange Job: నేటి కాలంలో రోజుకు 8 గంటలు పనిచేయాలంటేనే ఒక్కొక్కరు నానాతంటాలు పడుతున్నారు. పని తక్కువ జీతం ఎక్కువ ఉండాలని కోరుకుంటారు. అలాంటిది 14 రోజులు పనిచేస్తే చాలు 9 లక్షల జీతం ఇస్తానంటే ఏం చేస్తారు..! ఎగిరి గంతేస్తారు. తాజాగా ఒక వింత ఉద్యోగం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఆ ఉద్యోగం ఏంటి.. 9 లక్షల జీతం ఏంటి తెలుసుకుందాం. నిజానికి ఈ ఉద్యోగం స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌లో చేయాలి. ఒక ప్రకటన ప్రకారం ఒక వ్యక్తి ఈ ఉద్యోగంలో డిసెంబర్ 22 నుంచి జనవరి 5 వరకు పనిచేయాలి. దీనికి ప్రతిఫలంగా £ 9000 అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు 9 లక్షల రూపాయల మొత్తం లభిస్తుంది. అయితే ఈ ఉద్యోగానికి ఒక షరతు ఉంది. అదేంటంటే ఈ 14 రోజులు ఆ వ్యక్తి తన ఇంటికి వెళ్లకూడదు. ఇంతకీ జాబ్‌ ఏంటో తెలుసా..

రోజుకు 59 వేల రూపాయలు
మీడియా నివేదికల ప్రకారం.. ఇక్కడ నివసిస్తున్న ఒక ధనిక కుటుంబం వ్యాపార నిమిత్తం బయటి దేశాలకు వెళ్లారు. పిల్లలను మాత్రం ఇంట్లోనే వదిలేసారు. అయితే డిసెంబర్‌లో క్రిస్‌మస్‌ ఫెస్టివల్‌ ఉంది. ఈ సమయంలో పిల్లలను చూసుకోవడానికి ఒక కేర్‌టేకర్ అవసరం. ఇలా చూసుకునే వ్యక్తికి రోజుకు £ 600 అంటే 59 వేల రూపాయల జీతం చెల్లిస్తామని ప్రకటించారు. అయితే ఈ ఉద్యోగంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి క్రిస్మస్ వేడుకలను కూడా ధనిక కుంటుంబ పిల్లలతోనే జరుపుకోవాలి.

తన ఇంటికి వెళ్లకూడదు. 14 రోజులు ప్రతిరోజు 24 గంటలు పిల్లలతో ఉండాలి. వారి బాగోగులు చూడాలి. స్నానం నుంచి మొదలుపెడితే తినడం వరకు అన్ని బాధ్యతలను నిర్వర్తించాలి. ఇదే ఉద్యోగం. ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి పూర్తిగా టీకాలు వేసుకొని ఉండాలి. దీనితో పాటు అతను పిల్లలను నిర్వహించడంలో కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. అయితే ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి ప్రయాణ ఖర్చులన్నీ కూడా యజమానియే భరిస్తాడు.

IGNOU UG, PG కోర్సులలో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది.. చివరితేదీ ఎప్పుడంటే..?

Sabarimala: తెరుచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు అనుమతి.. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి..

weight loss diets 2021: 2021లో బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగించిన డైట్‌ ట్రెండ్స్‌ ఇవే..!