ప్రత్యేక బలూచిస్థాన్ కోరుతూ దాయాది దేశం పాకిస్థాన్‌లో చాలా ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పోరాటాల నేపథ్యంలో ఇటీవల కాలంలో బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పురుషులు బలవంతంగా అదృశ్యమయ్యారు. దీనికి నిరసనగా ఏకంగా పాకిస్తాన్ రాజధానిలోకి ప్రవేశించిన దాదాపు 200 మంది మహిళా నిరసనకారులను అరెస్టు చేశారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆరోపణలకు వ్యతిరేకంగా నిరసనకారులు వారాల తరబడి దేశవ్యాప్తంగా కవాతు చేస్తున్నారు. అరెస్టయిన వారిలో నిరసనకారుల నాయకుడు మహరంగ్ బలోచ్ కూడా ఉంది. మహరంగ్ బలోచ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ‘ఇస్లామాబాద్ పోలీసుల దాడిలో ఉంది’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీను గడగడలాడించిన మహరంగ్ బలోచ్ గురించి మరన్ని వివరాలను తెలుసుకుందాం.
మహరంగ్ బలోచ్ పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌కు చెందిన బలూచ్ మానవ హక్కుల కార్యకర్త. ఆమె బలూచిస్తాన్‌లో చట్టవిరుద్ధంగా అమలు చేసినఅదృశ్యాలు, అధికారులు చట్టవిరుద్ధంగా చంపడం వంటి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతోంది. మన్రాంగ్ బలూచ్ ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమెకు 5 మంది సోదరీమణులు,ఒక సోదరుడు ఉన్నారు. ఆమె కుటుంబం బలూచిస్థాన్‌లోని కలాత్‌కు చెందినది. మహరంగ్ వృత్తిరీత్యా వైద్యురాలు. అలాగే ఆమె తండ్రి అబ్దుల్ గఫార్ బలోచ్ కార్మికుడు, వామపక్ష రాజకీయ కార్యకర్త.
ఆమె తండ్రిని 2009లో కరాచీలోని ఆసుపత్రికి వెళుతుండగా పాకిస్థాన్ అధికారులు బలవంతంగా అపహరించారు. ఆ సమయంలో మహరాంగ్ వయస్సు కేవలం 16 సంవత్సరాలు. దీంతో ఆమె నిరసనకు దిగింది. ఆ సమయంలో విద్యార్థి ప్రతిఘటన ఉద్యమంలో ప్రజాదరణ పొందింది. మహ్రాంగ్ తండ్రి 2011లో చిత్రహింసల ఆనవాళ్లతో చనిపోయాడు. మహ్రాంగ్ సోదరుడు 2017లో అపహరణకు గురయ్యాడు. మూడు నెలల పాటు నిర్బంధంలో ఉన్నాడు. అప్పటి నుంచి ఆమె బలూచ్ ప్రతిఘటన ఉద్యమంలో ప్రముఖంగా ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..