ఫోటోగ్రాఫర్‌ను కొట్టిన వరుడు.. కడుపుబ్బా నవ్విన వధువు.. వీడియో వెనుక అసలు రహస్యమిదే.!

Viral Video: ఓ పెళ్లిలో వరుడు, వధువు స్టేజ్‌పై నిల్చుని ఉన్నారు. ఫోటోగ్రాఫర్ వారిని ఫోటోలు తీస్తూ ఉన్నాడు. అయితే అతడు వరుడ్ని సైడ్ చేసి..

ఫోటోగ్రాఫర్‌ను కొట్టిన వరుడు.. కడుపుబ్బా నవ్విన వధువు.. వీడియో వెనుక అసలు రహస్యమిదే.!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 11, 2021 | 9:21 AM

Viral Video: ఓ పెళ్లిలో వరుడు, వధువు స్టేజ్‌పై నిల్చుని ఉన్నారు. ఫోటోగ్రాఫర్ వారిని ఫోటోలు తీస్తూ ఉన్నాడు. అయితే అతడు వరుడ్ని సైడ్ చేసి.. వధువుపై ఫోకస్ పెట్టాడు. మరీ ఓవర్ చేస్తూ .. పెళ్లి కూతురు ముఖాన్ని టచ్ చేస్తూ.. అటూ.. ఇటూ తిప్పుతున్నాడు. ఇంకేముంది పక్కనే ఉన్న వరుడికి కోపం వచ్చింది. లాగి పెట్టి ఫోటోగ్రాఫర్‌ను ఒక్కటి ఇచ్చాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో అప్పటివరకు సిగ్గుతో తలదించుకున్న వధువు.. పగలబడి నవ్వేసింది. ఇక దీనికి సంబంధించిన వీడియో గత వారం ఓ నెటిజన్ షేర్ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రేణుకా మోహన్ అనే నెటిజన్ ఈ వీడియోను షేర్ చేయగా.. కొంత వ్యవధిలోనే దాదాపు 9 లక్షలకు పైగా వ్యూస్, 16 వేల రీ-ట్వీట్లను రాబట్టింది. ఆమె అసలు ఈ వీడియో నిజమో, కాదో.. లేక ప్రాంక్ వీడియోనా అనే సందేహం వ్యక్తం చేసింది.

ఇక వీడియోకి సంబంధించిన అసలు రహస్యాన్ని వధువు బయటపెట్టింది. అది నిజమైన పెళ్లి వీడియో కాదని.. సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ సీన్ అని తేల్చి చెప్పింది. ‘డార్లింగ్ ప్యార్ ఝుక్తా న‌హీ’ అనే సినిమా షూటింగ్ చేసిన సన్నివేశానికి సంబంధించిన విజువల్స్ అని పేర్కొంది. అంతేకాకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన అందరికీ కృతజ్ఞతలు కూడా తెలిపింది. ఇంతకీ ఆ వధువు ఎవరో కాదు.. ఛత్తీస్‌గడ్‌కు చెందినా హీరోయిన్ అనికృతి చౌహాన్.

మరిన్ని చదవండి:

12 ఏళ్ల బుడతడు.. స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!

ఫస్ట్ నైట్ రోజు భార్యను పట్టించుకోకుండా.. కంప్యూటర్‌తో.. నెట్టింట్లో రచ్చ.. రచ్చ..

టీవీ ప్రోగ్రామ్‌ స్టంట్‌లు కాపీ కొట్టాడు.. ఏకంగా నదిలోకే దూకేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!