Tea Stains Cleaning: చొక్కాపై టీ మరకలను ఇలా వదిలించుకోండి..ఈ సింపుల్ చిట్కాలు మీ కోసం..

|

Sep 15, 2022 | 6:27 AM

తెల్లని చొక్కపై వేడి టీ పడితే ఆ మరక అలానే ఉండిపోతుంది. ఆ మరకను తొలిగించుకోవడం చాలా కష్టం. అయితే ఈ చిట్కాలను ఉపయోగించి ఎలా తొలిగించుకోవచ్చో తెలుసుకుందాం..

Tea Stains Cleaning: చొక్కాపై టీ మరకలను ఇలా వదిలించుకోండి..ఈ సింపుల్ చిట్కాలు మీ కోసం..
Tea Spilled
Follow us on

తేనీటి ఘుమఘుమలకు టీ ప్రియులు ఫిదా అవుతున్నారు. నిత్య జీవనంలో టీ ప్రముఖ పాత్రే పోషిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు టీ తాగకుండా ఉండలేరు. ఇద్దరు స్నేహితులు కలిసారంటే, తెలిసిన వారు దారిలో పలకరించినపుడు, మర్యాదపూర్వక సిట్టింగ్ అంటే చాలు ముందుగా టీ ఉండాల్సిందే. సమయంలో తప్పకుండా ఒక  స్ట్రాంగ్‌ టీ గుటకేయాల్సిందే.. లేదంటే చాలా మందికి ప్రాణం ఉసూరుమంటుంది. ఆఫీసుకు వెళ్లాల్సిన సమయంలో వేగంగా టీ తాగితే కాని పనులు చక్కబడవు.. ఆ సమయంలో మనం వేసుకున్న వైట్ షెర్ట్‌పై టీ ఒలికిందంటే ఇక అంతే..  తెల్లటి చొక్కా ఉంటే, దాని మరక మరింతగా కనిపించడం మొదలవుతుంది. ఇలాంటి మరకలను త్వరగా తొలిగించుకునేందుకు చాలా ప్రయోగాలు చేస్తుంటాం. అయితే ఇలాంటి టీ మరకలను ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకుందాం.

బట్టలు నుంచి టీ మరకలు వదిలించుకోవటం ఎలా?

కాటన్ షిఫాన్, పాలిస్టర్ బట్టలు..

మీరు కాటన్ షిఫాన్, పాలిస్టర్ బట్టలపై పడిన టీ మరకలను వదిలించుకోవాలనుకుంటే గోరువెచ్చని నీటితో ముందుగా తుడవండి. టీ పడిపోయిన వెంటనే ఇలా చేస్తేనే ఫలితం త్వరగా పని చేస్తుంది. దీని తర్వాత, బేకింగ్ సోడాను మరకపై పూయండి. ఇప్పుడు దానిని నీటిలో ముంచు కొంచెం సేపు అలానే ఉంచండి. ఆతర్వాత ఆపై వాషింగ్ పౌడర్ వేయండి. టబ్, మరక చుట్టూ నానబెట్టి కాసేపు అలానే వదిలివేయండి. చేతులతో స్క్రబ్ చేసి, ఆపై నీటితో శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టండి.

ఉన్ని, సిల్క్ బట్టలు..

అటువంటి బట్టలపై టీ మరకలను కూడా మీరు సులభంగా వదిలించుకోవచ్చు. దీని కోసం, స్ప్రే బాటిల్‌లో వెనిగర్ పోసి నింపండి. ఇప్పుడు టీ స్టెయిన్‌పై స్ప్రే చేసి చేతులతో రుద్దండి. ఇప్పుడు కొద్దిసేపు నీటిలో నానబెట్టండి. ఇప్పుడు
బ్రష్ సహాయంతో తేలికగా రుద్దండి. ఇప్పుడు నీటితో శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టండి.

తెల్ల చొక్క

చొక్కా తెల్ల చొక్కా మీద టీ స్టెయిన్ చాలా మొండి పట్టుదలగలది. కానీ నిమ్మకాయ, బేకింగ్ సోడా సహాయంతో మీరు దానిని సులభంగా వదిలించుకోవచ్చు. ఈ రెండు వస్తువులను ఒక గిన్నెలో వేసి కలపాలి. తర్వాత బ్రష్ సహాయంతో లేదా నిమ్మకాయ కట్ చేసి మరకపై రుద్ది కాసేపు అలాగే ఉంచాలి. మీరు దానిని శుభ్రమైన నీరు.. వాషింగ్ పౌడర్ సహాయంతో కడగాలి. చివరకు ఎండలో ఆరబెట్టండి. ఇంకా కొంచెం మరక కనిపిస్తే.. ఈ విధానాన్ని మళ్లీ మళ్లీ చేయండి. ఇలా చేయడం వల్ల మరక కనిపించకుండా పోతుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం