Success Story: విదేశాల్లో మంచి ఉద్యోగాన్ని వదిలి.. పొలం బాట పట్టాడు.. అరటి సాగుతో రూ. 100 కోట్లు సంపాదించాడు..

|

Aug 31, 2023 | 10:12 AM

దాదాపు భారతదేశం అంతటా అరటిని సాగు చేస్తారు. అరటి సాగు ద్వారా లక్షాధికారులుగా మారిన రైతులు దేశంలో ఎందరో ఉన్నారు. అయితే విదేశాల్లో మంచి ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగాన్ని వదిలేసి భారతదేశానికి వచ్చి అరటి వ్యవసాయం చేసి అనతి కాలంలోనే కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు విదేశాలకు కూడా అరటిపండ్లను సరఫరా చేస్తున్నాడు. 

Success Story: విదేశాల్లో మంచి ఉద్యోగాన్ని వదిలి.. పొలం బాట పట్టాడు.. అరటి సాగుతో రూ. 100 కోట్లు సంపాదించాడు..
Success Story
Follow us on

అతి తక్కువ ధరతో పేదవారికి సైతం అరటిపండు అందరికి అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరూ అరటిపండుని తినడానికి ఇష్టపడతారు. అరటిపండులో విటమిన్ సి, డైటరీ ఫైబర్, విటమిన్ బి6, మాంగనీస్ వంటి అనేక రకాల పోషకాలు ఉన్నాయి. దాదాపు భారతదేశం అంతటా అరటిని సాగు చేస్తారు. అరటి సాగు ద్వారా లక్షాధికారులుగా మారిన రైతులు దేశంలో ఎందరో ఉన్నారు. అయితే విదేశాల్లో మంచి ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగాన్ని వదిలేసి భారతదేశానికి వచ్చి అరటి వ్యవసాయం చేసి అనతి కాలంలోనే కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు విదేశాలకు కూడా అరటిపండ్లను సరఫరా చేస్తున్నాడు.

ముంబై కి చెందిన అలోక్ అగర్వాల్ గతంలో  అలోక్ స్విట్జర్లాండ్‌లోని బనానా ఎక్స్‌పోర్ట్‌లో లాజిస్టిక్స్ పని చేసేవాడు. అరటిపండ్ల ఎగుమతి-దిగుమతుల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న అలోక్ ఉద్యోగానికి రిజైన్ చేసి.. స్వదేశం వచ్చాడు. భారతదేశం వచ్చి అరటిపండు వ్యాపారం మొదలుపెట్టాడు. 2015లో ట్రైడెంట్ ఆగ్రో పేరుతో కంపెనీని ప్రారంభించాడు. ఆ తర్వాత ఈ కంపెనీ ద్వారా అరటిపండ్లను ఎగుమతి చేయడం ప్రారంభించాడు.

కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా అరటిని పండిస్తోన్న కంపెనీ

విశేషమేమిటంటే ఈ కంపెనీ కూడా కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా అరటి సాగు చేస్తోంది. అలోక్ అగర్వాల్ ఓ వైపు అరటి సాగుని చేస్తూనే వాటిని విదేశాలకు ఎగుమతి చేయడమే కాదు చిప్స్, స్నాక్స్‌లు కూడా తయారు చేస్తున్నాడు. ఇతర అరటి ఉత్పత్తులను కూడా తయారు చేస్తారు. ప్రస్తుతం అతని కంపెనీ ఏటా రూ. 100 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

100 కోట్ల రూపాయలతో కంపెనీ ఏర్పాటు

విశేషమేమిటంటే.. కంపెనీని ప్రారంభించిన తర్వాత అలోక్ అగర్వాల్ పూణె జిల్లా రైతులకు అరటి పండించేలా శిక్షణ ఇవ్వడంతో అరటిపంటల ఉత్పత్తి పెరిగింది. అంతేకాదు అరటి పండ్లను నాణ్యంగా పండించడంతో పాటు..అరటి పండ్లను ఎక్కువ కాలం సురక్షితంగా ఉండేలా వాటిని నిల్వ చేసుకోవాలో రైతులకు శిక్షణ ఇచ్చారు. తొలిసారిగా పండ్ల సంరక్షణ ప్రాధాన్యతను రైతులకు వివరించారు. రైతుల  కష్టార్జితం, సంకల్ప బలంతో అలోక్ అరటికి సంబంధించిన కంపెనీని రూ.100 కోట్లతో ఏర్పాటు చేశాడు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..