Skin Care: చలికాలంలో చాలామందికి దురద సమస్య ఉంటుంది. దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. సరైన జీవనశైలి, ఆహారం, దినచర్య సరిగ్గా లేకపోవడంలాంటివి ఉంటాయి. దురద ఒక్కసారి సంభవిస్తే చింతించాల్సిన పని లేదు కానీ ప్రతిరోజూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే చికిత్స చాలా ముఖ్యం. చాలా మంది చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో లభించే ఖరీదైన ఉత్పత్తులు ఉపయోగిస్తారు. కానీ ఇంట్లో ఉండే పదార్థాలతో దురదని తగ్గించవచ్చు. అంతేగాక సహజసిద్దంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ష్ కూడా ఉండవు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.
1. తులసి
చర్మంపై ఏర్పడే దురదను తొలగించడంలో తులసి ఉత్తమంగా పనిచేస్తుంది. దీని కోసం తులసి ఆకులను పేస్ట్‌గా చేసి చర్మంపై ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేయాలి. ఇలా కాసేపు ఉంచి సాధారణ నీళ్లతో కడిగేయాలి. మీకు కావాలంటే మీరు తులసి ఆకుల పేస్ట్‌తో మసాజ్ కూడా చేసుకోవచ్చు. ఈ పద్ధతి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. తులసిలో అనేక యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అవి చర్మ సమస్యలను తొలగిస్తాయి.
2. కొబ్బరి నూనె
కొబ్బరి నూనె చర్మానికి మాయిశ్చర్ లాంటిది. ఇది చాలా కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. కొబ్బరినూనె చర్మం నుంచి దురదను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేసిన తర్వాత చర్మంపై కొబ్బరి నూనెను రాయాలి. అంతే కాదు ఆ నూనెను శరీరం మొత్తం కూడా రాసుకోవచ్చు.
3. వోట్మీల్
ఓట్ మీల్ చర్మంలోని దురదను తొలగించడమే కాకుండా మురికిని కూడా తొలగిస్తుంది. దీన్ని ఉపయోగించాలంటే స్నానం చేసే నీటిలో కొద్దిగా ఓట్ మీల్ వేసి అదే నీటిలో 15 నుంచి 20 నిమిషాల పాటు కూర్చోవాలి. అలా చేయడం సాధ్యం కాకపోతే దురద ఉన్న ప్రదేశంలో ఓట్ మీల్ ను స్క్రబ్ చేయండి.
4. ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మం నుంచి దురదను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. స్నానపు నీటిలో 2 నుంచి 3 కప్పుల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి 15 నుంచి 20 నిమిషాలు అందులో కూర్చోండి. ఇది సాధ్యం కాకపోతే స్నానం చేసేటప్పుడు వెనిగర్ నీటితో మృదువుగా మసాజ్ చేసుకుంటే చర్మంపై దురద తగ్గుతుంది.