Snakes: పాములు కాటేసేముందు హెచ్చరిస్తాయని మీకు తెల్సా..? అంతే కాదు

మనం పాములను చూసి భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే పాములకే మనం అంటే భయం అని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు. అంతేకాదు పాములు శీతాకాలం మొత్తం నిద్రాణస్థితిలోనే ఉంటాయట. వేసవి కాలంలో గుడ్లు పెడతాయట. పాముల గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు...

Snakes: పాములు కాటేసేముందు హెచ్చరిస్తాయని మీకు తెల్సా..? అంతే కాదు
Snake'

Edited By: Ram Naramaneni

Updated on: Mar 11, 2024 | 4:42 PM

మనకు ఎక్కడ పాము కనిపించినా పరిగెడతాం..  ఎందుకంటే భయం కాబట్టి.. మనం పాములను చూసి భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే పాములకు మనుషులు అంటే భయం అని అంటున్నారు స్నేక్ క్యాచర్స్. అయితే పాములు ప్రవర్తన గురించి తెలుసుకుంటే పాము కాటేసే ప్రమాదం నుంచి మనం బయటపడొచ్చు అని చెబుతున్నారు.. ఇంతకీ పాము ప్రవర్తన ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది..? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మనదేశంలోని దాదాపు అన్ని పాములు కాటు వేసే ముందు హెచ్చరిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఒకటి, రెండు జాతుల పాములు మినహా మిగిలిన పాములు అన్ని కాటు వేసే ముందు గట్టిగా శ్వాస పీల్చుకుంటాయి అని… స్.. స్..అని శబ్దం చేస్తాయని..శరీరాన్ని భూమిపై బలంగా కదిలిస్తూ శబ్దం చేయడం లాంటివి చేస్తాయని అంటున్నారు. ఇలాంటి బిహేవియర్  పాములలో గమనిస్తే పాము కాటు నుండి తప్పించుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు.

విషం పాములకు ఒక ఆయుధం. దాని ద్వారానే అవి ఆహారాన్ని సంపాదించుకుంటాయి అట. అందుకని పాములు చాలా జాగ్రత్తగా విషాన్ని ఉపయోగిస్తాయని అంటున్నారు. పాము తప్పించుకోవడానికి వీలు లేని సమయంలో మాత్రమే కాటు వేస్తుందని.. సాధారణ సమయాల్లో పాము ఎదురు పడితే కదలకుండా ఉంటే… పాము తనదారిన తాను వెళ్ళిపోతుంది అని నిపుణులు అంటున్నారు.

పాము గురించి మరి కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు తెలిపారు నిపుణులు. ఎండాకాలంలో చెట్లు, గడ్డి ఎండిపోవడం, వేసవి తాపం కారణాలతో పాములు ఎక్కువగా బయటకు వస్తాయని.. ఆ టైంలోనే పాము గుడ్లు పెడుతుంది అని.. వర్షాకాలంలో గుడ్ల నుండి పాము పిల్లలు బయటకి వస్తాయని.. చలికాలంలో కూడా తినేందుకు సరిపడా ఆహారాన్ని వర్షాకాలంలోనే వేటడుతాయని అంటున్నారు. చలికాలం మొత్తం పాములు నిద్రాణ స్థితిలో ఉంటాయని అంటున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..