Security Guard Photo Goes Viral: జీవితంలో పైకి రావాలంటే ఎంతో కష్టపడాలి. కానీ మనలో చాలా మంది అదృష్టం లేదనో.. పరిస్థితులు అనుకూలించలేవనో సాకులు చెబుతూ సమయాన్ని వృథా చేసుకుంటారు. కానీ నిజంగా ఏదైనా సాధించాలనే కసి ఉండాలే కానీ ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా సరే మనకు అనుకూలంగా మారుతాయి. జీవితంలో ఎదురయ్యే కష్టాలను కూడా మన విజయానికి వారధిగా వాడుకోవచ్చు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోన్న ఓ సెక్యూరిటీ గార్డుకు సంబంధించిన ఫొటో ఈ మాటలు అక్షరాల నిజమని చెబుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన చదువుకు, అర్హతకు సరిపోని ఉద్యోగమైనా ఏటీఎమ్ సెంటర్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే మంచి ఉద్యోగం సాధించాలనే కసితో ఉన్న సదరు వ్యక్తి.. తాను చేస్తోన్న ఉద్యోగాన్ని తన కలను సాధించుకునేందుకు ఉపయోగించుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ వైపు సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం నిర్వర్తిస్తూనే మరోవైపు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఏటీఎమ్ సెంటర్‌లో పెన్ను, పుస్తకం పట్టుకొని సెక్యూరిటీ యూనీఫామ్‌లో ఉన్న ఆ వ్యక్తి ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను ఛత్తీస్‌ఘడ్ క్యాడర్‌కు చెందిన అవనిష్ శరణ్ అనే ఐఎఎస్ ఆఫీసర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోతో పాటు ‘ఎక్కడైనా జ్వాల ఉంటుంది. కానీ దానిని వెలిగించడానికి మాత్రమే ఉపయోగించాలి’ అని ఆలోచన రేకెత్తించే క్యాప్షన్‌ను జోడించాడు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా ప్రతికూల పరిస్థితుల్లోనూ తన కలను నిజం చేసుకునేందుకు కృషి చేస్తోన్న ఈ సెక్యూరిటీ గార్డ్‌కు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए.
(साभार) pic.twitter.com/auLrv7GIso
— Awanish Sharan (@AwanishSharan) April 6, 2021
Also Read: హడలెత్తిస్తున్న మిడతల దండు.. క్షణాల్లో చేతికొచ్చిన పంటలు మాయం.. గాలి ఎటు వీస్తే అటు ప్రయాణం
తల్లి ప్రేమ’…మొక్కయింది..! బిడ్డ పిండాన్ని కుండీలో పాతిపెట్టిన తల్లి… చివరకు… ( వీడియో )
AP volunteers: వాలంటీర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అందుకోసం రూ.260 కోట్లు విడుదల