SBI Account Open Steps: ఇంట్లో కూర్చునే ఎస్‌బిఐ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ వివరాలివే..

|

Feb 23, 2023 | 7:58 AM

దేశంలోని అతిపెద్ద బ్యాంకులలో SBI ఒకటి. ఈ బ్యాంకులో ఖాతా తెరవాలనుకునే వారికి ఇది శుభవార్త. ఇందుకోసం మీరు బ్యాంక్‌కి వెళ్లాల్సిన పని లేదు. ఇప్పుడు ఇంట్లో కూర్చొనే మీరు ఎస్‌బిఐ అకౌంట్‌ని ఓపెన్ చేయొచ్చు.

SBI Account Open Steps: ఇంట్లో కూర్చునే ఎస్‌బిఐ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ వివరాలివే..
Sbi
Follow us on

దేశంలోని అతిపెద్ద బ్యాంకులలో SBI ఒకటి. ఈ బ్యాంకులో ఖాతా తెరవాలనుకునే వారికి ఇది శుభవార్త. ఇందుకోసం మీరు బ్యాంక్‌కి వెళ్లాల్సిన పని లేదు. ఇప్పుడు ఇంట్లో కూర్చొనే మీరు ఎస్‌బిఐ అకౌంట్‌ని ఓపెన్ చేయొచ్చు. ఇన్‌స్టా ప్లస్ సేవింగ్స్ ఎకంటౌన్‌ను ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయొచ్చు. జస్ట్ మన చేతిలో ఫోన్, కంప్యూటర్ ఉంటే చాలలు. ఈ సదుపాయంతో బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరమే లేకుండా.. ఎలాంటి క్యూ లైన్‌లో నిల్చోకుండా, సమయం ఆదా చేయొచ్చు. ఆన్‌లైన్‌లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అకౌంట్‌ను ఇలా తెరవండి..

♦ ముందుగా మీ మొబైల్‌లో YONO యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

♦ ఆ తరువాత వీడియో KYC కంప్లీట్ చేసి సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయొచ్చు.

ఇవి కూడా చదవండి

♦ అకౌంట్‌ తెరవడానికి యాప్‌లో ఎస్‌బిఐ న్యూ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

♦ ఆ తరువాత ఆపై సేవింగ్ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. బ్రాంచ్ విజిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

♦ ఆధార్, పాన్ వివరాలను ఫిల్ చేయాలి.

♦ అభ్యర్థించిన అన్ని వివరాలను ఫిల్ చేసిన తరువాత వీడియో కాల్ ద్వారా KYC పూర్తి చేయాల్సి ఉంటుంది.

♦ ఇందుకోసం షెడ్యూల్ చేసిన సమయంలో YONO యాప్‌కి లాగిన్ చేయాలి. ఆ తరువాత వీడియో కేవైసీ పూర్తి చేయాలి.

♦ ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తరువాత ఎస్‌బిఐ అధికారులు ధృవీకరిస్తారు. అనంతరం ట్రాన్సాక్షన్స్ కోసం ఇన్‌స్టా ప్లబ్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.

♦ అకౌంట్ ఓపెన్ అయిన తరువాత YONO యాప్, ఆన్‌లైన్ ఎస్‌బిఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా NEFT, IMPS, UPI ఇతర మార్గాల్లో ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు.

నోట్..

♦ 18 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది.

♦ ఎస్‌బిఐ కొత్త కస్టమర్, CIF లేని వారి అకౌంట్ ఓపెన్ చేయడానికి వీలుంటుంది.

♦ బ్యాంక్ యాక్టీవ్‌గా ఉన్న, CIF ఉన్న కస్టమర్స్ అకౌంట్ ఓపెన్ చేయలేరు.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..