Russian Mother: ప్రపంచంలోని ప్రతి తల్లి తన పిల్లలను ప్రేమిస్తుంది. కానీ కొంతమంది హృదయం లేని తల్లుల కథ వింటే అందరు ఆశ్చర్యపోతారు. తాజాగా రష్యాకి చెందిన ఓ తల్లి వార్తల్లో నిలిచింది. ఈమె నమ్మడానికి కష్టంగా ఉండే ఓ పని చేసింది. తన 6 ఏళ్ల కుమార్తెను 19 పిల్లులతో కలిసి గదిలో బంధించింది. విషయం తెలిసిన తర్వాత అందరు ఈమెను తిట్టిపోశారు. అసలు స్టోరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తన బిడ్డపై ఇంత క్రూరత్వం చూపించిన తల్లి పేరు ఎల్ప్రికా రెనే. ఈమె తన 6 ఏళ్ల కుమార్తె డాట్సేని 19 పిల్లులతో కలిసి ఓ రహస్య గదిలో బంధించింది. ఈ గదికి కిటికీ కూడా లేదు. దీంతో ఆ అమ్మాయి చాలా కాలం పిల్లులతో కలిసి జీవించింది. అంతేకాదు ఆకలిని తీర్చుకోవడానికి ఆమె పిల్లులు తినే ఆహారం తినవలసి వచ్చింది. ఎల్ప్రికా రెనే తన కూతురును చూడటానికి ఇక్కడకి రాకపోయేది.
కొన్ని రోజుల తర్వాత విషయం బయటికి రావడంతో పోలీసులు ఆ బాలికను రక్షించారు. పిల్లులతో జీవించడం వల్ల ఆ అమ్మాయి అనారోగ్యానికి గురైంది. చిన్నారికి మానవ భాష అర్థం కావడం లేదు. అంతేకాదు ఆమె పిల్లుల వలె నడవడానికి ప్రయత్నిస్తుంది. చాలా రోజులకి ఒకసారి ఆ గదిలో ఉండే చెత్తను శుభ్రం చేయడానికి ఎల్పిక అక్కడికి వెళ్లేది. 35 ఏళ్ల తల్లి తన పెద్ద కుమార్తెతో మరొక స్మార్ట్ హోమ్‌లో నివసించేది.
ఇలా ఎందుకు చేశావని ఆల్ప్రికోని అడిగినప్పుడు ఆమె ఇలా సమాధానమిచ్చింది. 3 సంవత్సరాల వయస్సులో తన కుమార్తె ప్రవర్తనలో వింత మార్పును గమనించానని ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ వృద్ధుడు పిల్లులకు ఆహారం ఇవ్వడాన్ని చూసిన కొంతమంది స్థానికులు పోలీసలకు సమాచారం అందించారు. అప్పుడు ఈ రహస్యం బయటపడింది. అయితే ఆ వృద్ధుడు ఎల్ప్రికా రెనే తండ్రిగా నిర్ధారించారు. ఇప్పటికి వీరిద్దరు కలిసి ఆ అమ్మాయిని ఎందుకు బంధించారో సరైన కారణాలు మాత్రం చెప్పడం లేదు.