World’s Tallest Woman: ఆరేళ్లకే 5.8 అంగుళాల ఎత్తు.. ప్రపంచంలోనే పొడవైన మహిళ.. కష్టాలు వేధిస్తున్నా తగ్గేదేలే..

|

Apr 16, 2023 | 10:06 PM

ఇంత పెద్ద ప్రపంచంలో వింతలకు కొదవే లేదు. ఏదో ఒక దేశంలో ఏదో ఒక వింతకు సంబంధించిన వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఇక పొట్టి, పొడవుకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వార్తల్లో ప్రధానంగా వస్తాయి. తాజాగా అలాంటి ప్రపంచ రికార్డ్‌కు సంబంధించిన వార్త గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Worlds Tallest Woman: ఆరేళ్లకే 5.8 అంగుళాల ఎత్తు.. ప్రపంచంలోనే పొడవైన మహిళ.. కష్టాలు వేధిస్తున్నా తగ్గేదేలే..
World's Tallest Woman
Follow us on

ఇంత పెద్ద ప్రపంచంలో వింతలకు కొదవే లేదు. ఏదో ఒక దేశంలో ఏదో ఒక వింతకు సంబంధించిన వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఇక పొట్టి, పొడవుకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వార్తల్లో ప్రధానంగా వస్తాయి. తాజాగా అలాంటి ప్రపంచ రికార్డ్‌కు సంబంధించిన వార్త గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రుమేసా గెల్గీ ఈమె పేరు ఎప్పుడైనా విన్నారా? అత్యంత పొడవైన మహిళగా ప్రపంచ రికార్డుని సాధించింది రుమేసా. తుర్కియేలోని సఫ్రన్‌బోల్‌ కి చెందిన రుమేసా గెల్గీ వయస్సు 26 ఏళ్ళు. ఆమె ఏడడగుల ఏడు అంగుళాల పొడవుండడంతో ఆమె ప్రపంచంలోనే అత్యధిక పొడవైన మహిళగా గిన్నిస్‌ రికార్డులో చోటు సంపాదించింది. అయితే రుమేసా పొడవు సహజసిద్ధమైంది కాదు.. ఆమె వీవర్స్‌ సిండ్రోమ్‌ అనే ఓ వ్యాధి కారణంగా ఇలా సాధారణ స్థాయికి మించి పొడవు పెరిగారు.

నాలుగు నెలల చిన్నారిగా ఉన్నప్పుడే రుమేసా వీవర్స్‌ సిండ్రోమ్‌ బారినపడింది. ఎముకల్లో అసాధారణ పెరుగుదల, ముఖం పాదాలు సాగిపోవడం, గొంతు సాగడంతో బొంగురు గొంతు, కండరాలు వదులవడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. వీవర్స్‌ సిండ్రోమ్‌ కారణంగా రుమేసాకు 6 ఏళ్లు వచ్చేసరికే 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు పెరిగింది. దీంతో పెద్దల శరీరంలో ఓ చిన్నారిని అమర్చినట్లుగా రుమేసా రూపం ఉండేది. ప్రపంచం మొత్తం మీద ఈ వ్యాధిబారినపడిన వారు కేవలం 50 మందే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వ్యాధికారణంగా రేమేసా బతుకు పోరాటం చేస్తోంది. ఆమె ప్రయాణం అంటే కష్టతరమే. ప్రత్యేక వ్యాన్‌ కావాలి. ఇక విమానం సంగతి సరేసరి. అయినా ఆమె కోసం 6 సీట్లను ఓ స్ట్రెచర్‌లా మార్చి రుమేసా ప్రయాణాన్ని సులభతరం చేసింది టర్కిష్‌ ఎయిర్‌ అనే విమానయాన సంస్థ. ప్రస్తుతం కాలిఫోర్నియాలో వెబ్‌ డెవలపర్‌గా ఉద్యోగం చేస్తోన్న రుమేసా ఆకారాన్ని బట్టి మనిషిని అంచనావేయకూడదని పిలుపునిస్తోంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..