Rose Flower Farming: గులాబీల సాగుతో రైతుల ఆదాయం మెరుగు.. చిన్న పట్టణాల్లో కూడా మంచి లభాలు..

|

Jan 24, 2022 | 7:38 AM

Rose Flower Farming: గులాబీల సాగు మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. ప్రతి ఒక్కరూ తీసుకునే సువాసనగల గులాబీలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది.

Rose Flower Farming: గులాబీల సాగుతో రైతుల ఆదాయం మెరుగు.. చిన్న పట్టణాల్లో కూడా మంచి లభాలు..
Rose Flower Farming
Follow us on

Rose Flower Farming: గులాబీల సాగు మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. ప్రతి ఒక్కరూ తీసుకునే సువాసనగల గులాబీలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. తక్కువ ఖర్చు, తక్కువ భూమి, ఎక్కువ ఆదాయం. సాధారణంగా గులాబీ మొక్కలు భూమి నుంచి 6 అడుగుల ఎత్తులో ఉంటాయి. గులాబీ సాగు నుంచి గరిష్ట ప్రయోజనం పొందాలంటే రకరకాల గులాబీలను నాటడం మంచిది. నేడు గులాబీ సాగు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చిన్న పట్టణాల్లో కూడా రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు. రైతులు వివిధ రంగుల గులాబీలను నాటితే వారి లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

గులాబీల పెంపకానికి అనేక పద్ధతులు ఉన్నప్పటికీ గ్రీన్‌హౌస్‌లో గులాబీల పెంపకం ఉత్తమమైనదిగా చెబుతారు. గులాబీల పెంపకం కోసం మితమైన వాతావరణం తయారు చేయాలి. సూర్యకాంతి పుష్కలంగా, తక్కువ వర్షం బలమైన గాలులు లేని ప్రదేశం అనువుగా ఉంటుంది. దీంతోపాటు మంచి నీటి వనరు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా ఉండాలని గుర్తుంచుకోండి. గులాబీల సాగు కోసం మీ ప్రాంతంలో డిమాండ్‌, అంతేకాకుండా మెరుగైన రకాలను ఎంచుకోవాలి. ఎందుకంటే వివిధ ప్రదేశాలలో వివిధ రకాల గులాబీలు ప్రత్యేకం. మీకు వీలుంటే అనేక రకాల గులాబీలను నాటవచ్చు.

కొన్ని ప్రత్యేక రకాల గులాబీలలో పూసా అరుణ్ ప్రధానమైనది. ఇది ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. దీనిని ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు. పూసా అరుణ్ ప్రతి మొక్క శీతాకాలంలో 20 నుంచి 25 పువ్వులు వేసవికాలంలో 35 నుంచి 40 పుష్పాలను ఇస్తుంది. ఈ రకం మరొక లక్షణం ఏంటంటే ఇది ఏ వ్యాధినైనా తట్టుకుంటుంది. పూసా శతాబ్ది అనేది మరో గులాబి రకం. ఇది లేత గులాబీ రంగులో ఉంటుంది. దీనిని ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాలలో సాగు చేస్తారు. పూసా శతాబ్దిలోని ప్రతి మొక్క చలికాలంలో 20 నుంచి 30 పువ్వులు వేసవికాలంలో 35 నుంచి 40 పుష్పాలను ఉత్పత్తి చేస్తుంది.

Carrot Soup: చలికాలంలో వేడి వేడి క్యారెట్‌ సూప్.. ఆరోగ్యంతో పాటు అదిరే రుచి..

Deepak Chahar: కంటతడి పెట్టిన దీపక్ చాహర్.. మ్యాచ్‌ని గెలిపించలేకపోయానే.. విరోచిత పోరాటం వృథా..

IND vs SA: ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి.. 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం..