AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Red Wine: రెడ్ వైన్‌లో కూల్‌డ్రింక్స్, సోడా మిక్స్ చేసి తాగుతున్నారా? షాకింగ్ నిజాలు మీకోసం..

ఈ ప్రపంచంలో అనేక రకాల మద్యం బ్రాండ్స్ ఉన్నాయి. వీటిలో ఒకటి రెడ్ వైన్. మందు తాగలేని, తాగని వారు.. ఈ రెడ్ వైన్ తాగుతుంటారు. ఇది హెల్తీ అని కూడా వైద్యులు చెబుతుంటారు. అయితే, రెడ్ వైన్‌ను మిగతా వాటిలా తాగలేరు. దీన్ని తాగే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

Red Wine: రెడ్ వైన్‌లో కూల్‌డ్రింక్స్, సోడా మిక్స్ చేసి తాగుతున్నారా? షాకింగ్ నిజాలు మీకోసం..
Red Wine
Shiva Prajapati
|

Updated on: Jul 02, 2023 | 7:30 AM

Share

ఈ ప్రపంచంలో అనేక రకాల మద్యం బ్రాండ్స్ ఉన్నాయి. వీటిలో ఒకటి రెడ్ వైన్. మందు తాగలేని, తాగని వారు.. ఈ రెడ్ వైన్ తాగుతుంటారు. ఇది హెల్తీ అని కూడా వైద్యులు చెబుతుంటారు. అయితే, రెడ్ వైన్‌ను మిగతా వాటిలా తాగలేరు. దీన్ని తాగే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అయితే, రెడ్ వైన్ తాగేటప్పుడు అందులో నీళ్లు, సోడా, కూల్‌డ్రింక్స్ కలుపుకుని తాగా? అనేది చాలామందిలో ఉండే సందేహం. రెడ్ వైన్‌లో ఏది మిక్స్ చేసి తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రెడ్ వైన్ ఎలా తాగాలి?

భారతదేశంలో మద్యం సేవించే వారి సంఖ్య చాలా ఎక్కువ. చాలా మంది మద్యం తాగేందుకు నీరు, సోడా, కూల్ డ్రింక్స్ వాడుతుంటారు. కానీ రెడ్ వైన్ విషయానికి వస్తే.. అంతా డిఫరెంట్ ఉంటుంది. రెడ్ వైన్‌ను హై క్లాస్ వైన్ అంటారు. ఇది సాధారణ మద్యం కంటే ఖరీదైనది. అందుకే.. దీనిని చాలా తక్కువమంది మాత్రమే తాగుతారు. రెడ్ వైన్ ఎంత పాతదయితే.. అంత ఖర్చవుతుంది. ఇక దీనిని తాగే విధానం విషయానికొస్తే.. చాలామంది రెడ్‌వైన్‌లో నీళ్లు, సోడా, కూల్‌డ్రింక్స్ కలిపి తాగుతారు. కానీ, అలా చేయకూడదని అంటున్నారు. కారణం ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంది.

రెడ్ వైన్‌లో సోడా, కూల్ డ్రింక్స్ హానీకరం..

ఆల్కాహాల్ ఆరోగ్యానికి హానీకరం. ఇక అందులో సోడా, కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగడం మరింత హానీ తలపెడుతుంది. వాస్తవానికి సోడాలో కార్బన్ డయాక్సైడ్, ఫాస్పోరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని కాల్షియంను నెమ్మదిగా ధ్వంసం చేస్తుంది. ఈ కాల్షియం మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు వస్తుంది. దీని కారణంగా ఎముకలు బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఇక సోడాతో పోలిస్తే కూల్‌డ్రింక్స్‌లలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ కూల్‌డ్రింక్స్‌లో కెఫిన్ పరిమాణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని తాగడం వలన డీహైడ్రేషన్, హ్యాంగోవర్ వంటి సమస్యలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..