Police Punishment: సముంద్రంలోకి దూకి సరదాగా ఈత కొడదాం అనుకున్నారు.. కానీ పోలీసులుకు దొరికిపోయారు.. చివరకు ఏంచేశారంటే..

ఇటీవలి కాలంలో పోలీసుల తీరులోనూ మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఎక్కువగా లాఠీలకు పనిచెప్పే రక్షకభటులు ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా వేసే శిక్షల్లోనూ కొత్తదనం

Police Punishment: సముంద్రంలోకి దూకి సరదాగా ఈత కొడదాం అనుకున్నారు.. కానీ పోలీసులుకు దొరికిపోయారు.. చివరకు ఏంచేశారంటే..
Police

Updated on: Apr 02, 2021 | 9:42 PM

Police Punishment: ఇటీవలి కాలంలో పోలీసుల తీరులోనూ మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఎక్కువగా లాఠీలకు పనిచెప్పే రక్షకభటులు ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా వేసే శిక్షల్లోనూ కొత్తదనం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబయిలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. దక్షిణ ముంబైలో కొందరు యువకులు సముద్రంలోకి దూకడానికి ప్రయత్నించారు. సముంద్రంలోకి దూకి సరదాగా ఈత కొడుదామని భావించారు ఆ కుర్రాళ్లు. అయితే అది నిషేధిత ప్రాంతం అక్కడ సముద్రంలోకి వెళ్లడానికి అనుమతులు లేవు. దీంతో అటుగా వెళ్తోన్న పోలీస్ ఆఫీసర్లు వారిని గమనించి.. యువకులను సముద్రంలోకి ఈతకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

అనంతరం నిబంధనలను ఉల్లంఘించిన ఆ యువకులకు విచిత్ర శిక్షను విధించారు. ఆ యువకులను కోడిలాగా నడవమని ఆదేశించారు. దీంతో యువకులంతా తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుల ఆదేశాలను పాటించారు. స్థానికంగా ఉన్న కొందరు ఈ తతంగాన్ని మొత్తం తమ సెల్ ఫోన్లలో వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ యువకులు కేవలం సముద్రంలోకి వెళ్లడానికి ప్రయత్నించడమే కాకుండా మాస్కులు కూడా ధరించలేదన్న కారణంతో ఈ పనిష్మెంట్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shekhar Kammula Coments : సారంగ దరియా సక్సెస్ ఆయనదే.. స్పందించిన చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల..

Raashi Khanna: మరోసారి అక్కినేని యంగ్ హీరోతో అందాల రాశిఖన్నా.. ఏ సినిమాలో అంటే

Not A Common Man Movie : విశాల్‌ -31 నాట్ ఏ కామన్ మ్యాన్.. అదరగొడుతున్న కొత్త సినిమా ప్రీ లుక్‌.. ఫిదా అవుతున్న అభిమానులు..

Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఉన్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..