Personality Test: మీరు చేతులు వెనుకకు కట్టుకునే విధానమే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది
మన వ్యక్తిత్వాన్ని మనమే తెలుసుకోవడం అనేది ఒక రకమైన సరదా కదా. సాధారణంగా ఒక వ్యక్తి ఎలాంటి వాడని తెలుసుకోవాలి అంటే.. వాళ్లతో ఉంటేనో లేదా జోతిష్యం శాస్త్రం ద్వారా తెలుసుకుంటారు. కానీ మన అలవాట్లు, మన శరీరభాగాల ఆకారం కూడా మనం ఎలాంటి వాళ్లమో తెలియజేస్తుందని అనే విషయం మీకు తెలుసా.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

న్యూమరాలజీ, జ్యోతిషశాస్త్రం ద్వారా మన స్వభావాన్ని ఎలాగైతే తెలుసుకుంటామో.. మన ప్రవర్తన, ఇష్టమైన రంగు, నడిచే శైలి, పాదాల ఆకారం, జుట్టు ఆకారం, ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాల ద్వారా కూడా మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. అంతేకాదు మన నిలబడే స్టైల్, నడిచే విధానం, మనం కూర్చునే విధానాన్ని బట్టి కూడా వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు.అవును ఇవాళ్టి వ్యక్తిత్వ పరీక్షలో చేతులు వెనక్కి కట్టుకునే విధానాన్ని బట్టి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూద్దాం.
కొందరు ఒక చేత్తో మరో చేతి మణికట్టును పట్టుకుని నిలబడితే, మరికొందరు మోచేతిని పట్టుకుని నిలబడతారు. ఇందులో మీ స్టైల్ ఏంటో చూసి, మీ స్వభావం ఎలాంటిదో పరీక్షించుకోండి.
మీరు మీ చేతులను వెనుకకు మడిచి నిలబడే విధానం మీ వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది:
మీ మణికట్టులను వెనుకకు మడిచి నిలబడటం: మీరు మీ ఒక చేత్తో మరో చేతి మణికట్టును పట్టుకుని వెనుకకు చేతులు కట్టుకుంటే మీరు సహజంగానే అపారమైన ఆత్మవిశ్వాసం కలిగిన వారని అర్థం. అంటే మీరు ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పినా తీసుకోవడానికి వెనుకాడరు. ఒక బృందాన్ని ముందుండి నడిపించే నాయకత్వ లక్షణాలు మీలో పుష్కలంగా ఉన్నాయి. ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించడంలో మీరు దిట్ట.
చేతి వేళ్లను పట్టుకుని నిలబడటం : మీరు వెనుక వైపు రెండు చేతుల వేళ్లను ఒకదానికొకటి లాక్ చేసుకుని లేదా పట్టుకుని నిలబడితే.. మీరు అందరితో సులభంగా కలిసిపోయే సౌమ్యుడైన, ముక్కుసూటి వ్యక్తి అని అర్థం. ఇలాంటి వ్యక్తులు ఎలాంటి బెరుకు లేకుండా స్వేచ్ఛగా మాట్లాడతారు అలాగే ఇలాంటి వారికి ఓపిక చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఎలాంటి కపటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా చెప్పేస్తారు. మీ ఈ ప్రవర్తనతోనే మీరు అందరిని ఆకట్టుకుంటారు.
మోచేతిని పట్టుకుని నిలబడటం: మీరు ఒక చేత్తో మరో చేతి మోచేతిని గట్టిగా పట్టుకుని నిలబడే అలవాటు కలిగి ఉంటే.. మీరు ప్రశాంత స్వభావం, శక్తివంతమైన ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారని అర్థం. మీలోని నిజాయితీ వల్లే మీరు అందరినీ సులభంగా ఆకర్షిస్తారు. మీలో ఉండే ఈ నిజాయితీ, ఆత్మవిశ్వాసం కారణంగానే ప్రజలు మీతో సమయాన్ని గడపడానికి, స్నేహం చేయడానికి ఎంతగానో ఇష్టపడతారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




