Pan Card: పాన్‌కార్డులో అడ్రస్ ఛేంజ్ చేయాలనుకుంటున్నారా? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి? స్టెప్‌ టు స్టెప్ వివరాలివే..

|

Nov 13, 2022 | 5:43 PM

భారతదేశంలో ప్రతీ పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో.. పాన్ కార్డు కూడా అంతే ముఖ్యం. ప్రతీ పనికి పాన్ కార్డ్ తప్పనిసరి. ఆదాయపు పన్ను ప్రయోజనాలు,

Pan Card: పాన్‌కార్డులో అడ్రస్ ఛేంజ్ చేయాలనుకుంటున్నారా? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి? స్టెప్‌ టు స్టెప్ వివరాలివే..
Pan Card
Follow us on

భారతదేశంలో ప్రతీ పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో.. పాన్ కార్డు కూడా అంతే ముఖ్యం. ప్రతీ పనికి పాన్ కార్డ్ తప్పనిసరి. ఆదాయపు పన్ను ప్రయోజనాలు, ఆర్థిక లావాదేవీలకు మాత్రమే కాకుండా, గుర్తింపు కార్డుగా కూడా దీనికి ప్రాముఖ్యత ఉంది. పాన్ కార్డులోని వివరాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే, కొందరు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు. ఆ సమయంలో పాన్ కార్డులో వివరాలను మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే, అదెలాగో చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలోనే.. పాన్ కార్డులో వివరాలను ఎలా చేంజ్ చేసుకోవాలో ఇవాళ మనం తెలుసుకుందాం. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో మీ మీ వివరాలను ఎలా చేంజ్/అప్‌డేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పాన్ కార్డ్ అంటే ఏంటి?

పర్మనెంట్ అకౌంట్ నెంబర్(PAN). ఎలాంటి ఆర్థిక లావాదేవీలను జరపాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరి. పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి పాన్ కార్డ్ ఉండాల్సిందే. ఈ 10 అంకెల ప్రత్యేక గుర్తింపు ఆల్ఫాన్యూమరిక్ నంబర్ ప్రతీ ఒక్కరికి చాలా అవసరం.

పాన్ కార్డ్ ప్రయోజనాలు..

1. పాన్ కార్డు పొందేందుకు అత్యంత ముఖ్యమైన సమయం ఐటీ రిటర్న్ దాఖలు చేయడం.

ఇవి కూడా చదవండి

2. ఆర్థిక సంస్థలు మీ పాన్ కోట్ చేయనట్లయితే రూ. 10 వేలకు పైగా ఆర్జించిన వడ్డీపై 20 శాతం ఎక్కుడ టీడీఎస్ తీసివేస్తాయి. అదే పాన్ కార్డ్ ఉన్నట్లయితే టీడీఎస్ ఆదా అవుతుంది.

3. బ్యాంక్ అకౌంట్‌కు పాన్ లింక్ చేసి ఉంటే.. తీసివేయబడిన టీడీఎస్ అసలు పన్ను కంటే ఎక్కువ ఉంటే, ఐటీ రిటర్న్ క్లెయిమ్ చేసుకోవచ్చు.

4. కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్ తప్పనిసరిగా అవసరం ఉంటుంది.

5. రూ. 10 లక్షల కంటే ఎక్కువ విలువైన స్థిరాస్తులు, ఆటోమొబైల్స్ వంటి స్థిరాస్తులను కొనుగోలు చేయడం, విక్రయించడానికి పాన్ కార్డ్ తప్పనిసరి.

6. రూ.50000 మించిన ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ అవసరం.

7. మ్యూచువల్ ఫండ్‌లు, బాండ్‌లు, స్టాక్‌లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, పాన్ కార్డ్ అవసరం.

ఆన్‌లైన్‌లో పాన్ కార్డ్‌ డీటెయిల్స్ ఎలా అప్‌డేట్ చేయాలి..

1. పాన్ కార్డులో డీటెయిల్స్ మార్చాలంటే ముందుగా https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html కి వెళ్లాలి.

2. అప్లికేషన్ టైప్ ఆప్షన్ కింద పాన్‌కార్డులో మార్పులు, అప్‌డేట్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

3. సంబంధిత వివరాలను ఎంటర్ చేయాలి.

4. చెక్ బాక్స్‌పై క్లిక్ చేయాలి.

5. క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసి, పూర్తి చేయడానికి సబ్‌మిట్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.

6. ఆ తరువాత ఆధార్ కార్డులోని సమాచారం ఆధారంగా చిరునామా అప్‌డేట్ అవుతుంది. ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా మీకు నోటిఫికేషన్‌లు వస్తాయి.

ఆఫ్‌లైన్‌లో పాన్‌కార్డ్‌లో వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలి?..

1. కొత్త పాన్ కార్డ్ కోసం అప్లికేషన్/మార్పులు, చేర్పుల కోసం ఫామ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. ఇందుకోసం //www.protean tinpan.com/downloads/pan/download/Request for New PAN Card or and Changes or PAN Data Form.pdf ఈ లింక్ క్లిక్ చేయండి.

3. ఫామ్‌లో అన్ని వివరాలను ఫిల్ చేయాలి.

4. గుర్తింపు ధృవీకరణ పత్రం, చిరునామా ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్‌లు, అవసరమైన అన్ని పత్రాలను అటాచ్ చేయాలి.

5. ఆ తరువాత ఈ ఫామ్‌ని సమీపంలోని NSDL సేకరణ కేంద్రంలో ఇవ్వాలి.

6. ఆఫ్‌లైన్ పార్డ్‌ కార్డ్ అప్‌డేట్/కరెక్షన్ కోసం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత 15 అంకెల నెంబర్ కలిగిన రసీదును ఇస్తారు. ఆ నెంబర్ ఆధారంగా పాన్‌కార్డ్ అప్లికేషన్ అప్‌డేట్‌ను ట్రాక్ చేయొచ్చు.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..