Ownership: మీకు ఏదైనా వాహనం ఉందా? అయితే, దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన ఈ కొత్త రూల్ తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
మీకు ఏదైనా వాహనం ఉందా? అయితే, మీకోసం ఒక శుభవార్త. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటారు వాహన నిబంధనలలో 1989 లో కొన్ని మార్పులు చేసింది.
Ownership: మీకు ఏదైనా వాహనం ఉందా? అయితే, మీకోసం ఒక శుభవార్త. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటారు వాహన నిబంధనలలో 1989 లో కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పులతో, వాహన యజమాని వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు తన వాహనానికి వారసుడిని నియమించుకోవచ్చు. ఎలాగైతే మనం బ్యాంక్ ఖాతా, ఇన్సూరెన్స్ వంటి వాటికి నామినీని పెట్టుకున్తామో అలాగే అన్నమాట. ఇది వాహన యజమాని మరణించిన తరువాత నామినీ పేరిట వాహనాన్ని బదిలీ చేయడాన్ని సులభతరం చేస్తుంది. కొత్త నిబంధనలకు సంబంధించి మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
నామినీని తరువాత కూడా నియమించవచ్చా?
అవును కొత్త నిబంధనల ప్రకారం, వాహన యజమాని రిజిస్ట్రేషన్ తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా నామినీని నియమించవచ్చు. ఇప్పటివరకు నామినీని నియమించడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇందుకోసం దేశమంతా భిన్నమైన ప్రక్రియ జరిగింది. ఇప్పుడు అలాకాదు. దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులోకి వస్తోంది.
నామినీకి సంబంధించిన గుర్తింపు కార్డు తప్పనిసరా?
కొత్త నిబంధనల ప్రకారం, వాహన యజమాని నామినీని నియమించేటప్పుడు నామినీ యొక్క గుర్తింపు కార్డును కూడా తప్పకుండా సమర్పించాలి. ఇది వాహనాన్ని బదిలీ చేసేటప్పుడు సులువుగా నామినీని గుర్తించడానికి దోహదపడుతుంది.
వాహనాన్ని నామినీకి ఎప్పుడు బదిలీ చేయగలుగుతారు?
నోటిఫికేషన్ ప్రకారం, వాహన యజమాని మరణించిన 30 రోజుల్లోపు మరణాన్ని రిజిస్ట్రేషన్ అథారిటీకి నివేదించాల్సి ఉంటుంది. వాహన యజమాని మరణించిన 3 నెలల్లో నామినీ వాహన బదిలీ కోసం ఫారం -31 ను సమర్పించాలి. ఈ కాలంలో, నామినీ వాహనాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.
నామినీని మార్చవచ్చా?
అవును కొత్త నిబంధనల ప్రకారం, వాహన యజమాని ఎప్పుడైనా నామినీని మార్చవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం, విడాకులు లేదా విడిపోయిన సందర్భంలో, వాహన యజమాని తన నామినీని మార్చవచ్చు. ఇది అంగీకరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) కింద వర్తించాలి. ఈ మార్పు తరువాత, దేశవ్యాప్తంగా వాహనాల బదిలీలో ఒకే రకమైన ఏర్పాటు ఉంటుంది.
పాత ప్రక్రియలో సమస్య ఏమిటి?
ప్రస్తుతం, మోటారు వాహన యాజమాన్యాన్ని బదిలీ చేసే విధానం చాలా గజిబిజిగా ఉంది. రాష్ట్రం రాష్ట్రానికీ ఈ విధానం మారుతూ ఉంటుంది. యాజమాన్యం బదిలీ కోసం, కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదనంగా, యజమాని మరణించిన సందర్భంలో, వాహన బదిలీకి చట్టపరమైన వారసుడిగా గుర్తింపు యొక్క రుజువు చూపించాల్సి ఉంటుంది.
ముసాయిదా మార్పు ఎప్పుడు విడుదల చేశారు?
27 నవంబర్ 2020 న, వాహన బదిలీకి నామినీని నియమించడానికి సంబంధించిన మార్పులపై ముసాయిదాను రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీనిపై మంత్రిత్వ శాఖ అన్ని శాఖల నుంచి అలాగే, సాధారణ ప్రజల నుండి సలహాలు కోరింది. సూచనలను పరిశీలించిన తరువాత, మంత్రిత్వ శాఖ తుది నోటిఫికేషన్ విడుదల చేసింది.
మీ ఏటీఎం కార్డు పోయిందా..? అయితే వెంటనే ఇలా చేయండి..! లేదంటే చాలా నష్టపోతారు..