Women’s Day: ఆ జిల్లాలో అంతా అతివల పాలనే.. మహిళా దినోత్సవం సందర్భంగా అక్కడి మహిళే స్ఫూర్తి

అక్కడ నారీశకం మొదలైంది.. యాదృశ్చికమో..? లేక పాలకుల ప్రయోగమో..? ఏమో కానీ.. ఆ జిల్లా సారధులంతా అతివలే..! మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులలో 80 శాతం మహిళలే సారథులు. రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న ఆ నారీ మణులు పరిపాలనలో వారి ప్రత్యేకతను చాటుతున్నారు. ఇది పాలకుల ప్రయోగమా..? అని సందేహం కలుగుతున్న ఆ జిల్లాలో అతివల పాలన కొనసాగుతుంది.

Women's Day: ఆ జిల్లాలో అంతా అతివల పాలనే.. మహిళా దినోత్సవం సందర్భంగా అక్కడి మహిళే స్ఫూర్తి
Warangal Women Power
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Mar 08, 2024 | 12:52 PM

అక్కడ నారీశకం మొదలైంది.. యాదృశ్చికమో..? లేక పాలకుల ప్రయోగమో..? ఏమో కానీ.. ఆ జిల్లా సారధులంతా అతివలే..! మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులలో 80 శాతం మహిళలే సారథులు. రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న ఆ నారీ మణులు పరిపాలనలో వారి ప్రత్యేకతను చాటుతున్నారు. ఇది పాలకుల ప్రయోగమా..? అని సందేహం కలుగుతున్న ఆ జిల్లాలో అతివల పాలన కొనసాగుతుంది. నారీ మణుల సారద్యంలో ఆ జిల్లా ప్రగతిపదం వైపు అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ.

పోరాటాల పురిటిగడ్డ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇప్పుడు మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది. రాణీ రుద్రమదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జిల్లా ఇక్కడి నారీ మణులు పరిపాలనలో స్త్రీ శక్తిని చాటుతున్నారు. బహుశా దేశంలో ఏ జిల్లాకు లేని ఓ అపురూప చరిత్ర ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా స్వంతం చేసుకుంది. ఇక్కడ అంతా అతివలే సారథులు. అధికారులు, ప్రజాప్రతినిధులలో 80 శాతం మహిళలే.

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో తొలిసారిగా ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు దక్కగా.. ఆ ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క, సురేఖ వరంగల్ జిల్లా వాసులే కావడం విశేషం. ఈ ఇద్దరు మహిళా ఫైర్ బ్రాండ్‌లు ఇప్పుడు రాష్ట్రంలోనే స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. పరిపాలనలో వారి ప్రత్యేకతను చాటుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ జిల్లా నుండి సీతక్క, సురేఖ, యశస్వినిరెడ్డి ముగ్గురు మహిళలు గెలుపొందగా ఇద్దరు మహిళలు మంత్రులయ్యారు. 26 ఏళ్ల అతిచిన్న వయస్సులో MLA అయిన యశస్వినిరెడ్డి అసెoబ్లీలో స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. ఇక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా గుండు సుధారాణి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మొత్తం ఆరు జిల్లాలు ఉన్నాయి. వాటిలో మూడు జిల్లాల కలెక్టర్లు మహిళలే. వరంగల్ జిల్లా కలెక్టర్ గా ప్రావీణ్య రెడ్డి, హనుమకొండ కలెక్టర్ గా స్నిక్తా పట్నాయక్, ములుగు కలెక్టర్ ఇళా త్రిపాఠి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదనపు కలెక్టర్లు ఐదుగురు మహిళా IAS అధికారులే కావడం విశేషం. మరోవైపు జిల్లా జడ్జి కూడా స్త్రీ మూర్తే కావడం మరో విశేషం. జస్టిస్ రాధాదేవి ప్రస్తుతం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అటు వరంగల్ TSRTC రీజనల్ మేనేజర్ కూడా మహిళే. ప్రస్తుతం RTC RM గా శ్రీలత బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని నాలుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్లుగా మహిళలే సారథ్యం వహిస్తున్నారు. వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా గండ్ర జ్యోతి, మహబూబాబాద్ zp చైర్ పర్సన్ గా హిమ బిందు, భూపాలపల్లి zp చైర్ పర్సన్ గా శ్రీహర్షిని , ములుగు zp చైర్ పర్సన్ గా బడే నాగజ్యోతి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీళ్ళేకాదు మూడు జిల్లాల జిల్లా పరిషత్ CEOలు, ఐదు మున్సిపాలిటీ చైర్ పర్సన్‌లు కూడా మహిళలే కావడం విశేషం. మామునూర్ పోలిస్ ట్రైనింగ్ క్యాంప్ ప్రిన్సిపాల్‌గా పూజా అనే IPS అధికారిని బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇలాంటి ప్రముఖులే కాదు.. స్థానిక సంస్థల్లోనూ మహిళలు వారి సత్తా చాటుతున్నారు. గ్రామాలను చక్కదిద్దడంలో వారి మార్క్ ప్రదర్శిస్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉద్యోగులలోనూ మహిళలదేపై చేయి. వరంగల్ జిల్లాలో 2,306 మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అటు హనుమకొండ జిల్లా పరిధిలో 3,213 మంది, ములుగు జిల్లాలో 1,124 మంది, జనగామ జిల్లాలో 1,185 మంది, మహబూబాబాద్ జిల్లాలో 2,040 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో1,075 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.

ఇందుగలరు అందు లేరను సందేహం వలదు అన్నట్లు.. అన్ని విభాగాలలో మహిళలే సారధులుగా వరంగల్ ఉమ్మడి జిల్లా పరిపాలనా పగ్గాలు వారి చెక్కు చేతుల్లో పెట్టుకుని నడిపిస్తున్నారు. రాణీ రుద్రమదేవి వారసత్వాన్ని అందిపుచ్చుకుని స్త్రీ శక్తిని చాటుతున్న ఈ నారీ మణులు అన్ని రంగాల్లో సక్సెస్ సాధిస్తూ నారీ భేరి ముగిస్తున్నారు. నేడు అంతర్జతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఈ మహిలమనులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు..

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!