AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే.. నెట్టింట అందాల అరాచకం..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఎన్నో సినిమాలు అడియన్స్ మనసులకు దగ్గరయ్యాయి. అందులో శ్రీమంతుడు ఒకటి. ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2015లో విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Mahesh Babu: మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే.. నెట్టింట అందాల అరాచకం..
Sanam Shetty
Rajitha Chanti
|

Updated on: Dec 23, 2024 | 11:30 AM

Share

డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం శ్రీమంతుడు. 2015లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఊరిని దత్తత తీసుకునే అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా విజయం తర్వాత స్వయంగా రెండు గ్రామాలను దత్త తీుకున్నారు మహష్. అంతకు ముందు మహేష్ నటించిన వన్ నేనొక్కడినే, ఆగడు వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. వరుసగా ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్న సమయంలో మహేష్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా ఇది. అప్పట్లో ఈ మూవీ మహేష్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఇందులో మహేష్ సరసన శ్రుతి హాసన్ నటించగా.. రాజేంద్రప్రసాద్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. ఇక ఇదే సినిమాలో ఓ అమ్మడు స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. సినిమాలో కనిపించింది తక్కువ సమయమే అయినా అప్పట్లో యూత్ ఫేవరేట్ బ్యూటీగా మారిపోయింది.

ఈ సినిమాలో మహేష్ బాబుతో కలిసి కాఫీ తాగే సన్నివేశంలో కనిపించింది ఓ అందాల భామ. అప్పట్లో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ కోసం నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వయ్యారి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు నెట్టింట ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్. శ్రీమంతుడు సినిమాలో కనిపించిన ఈ అమ్మడు పేరు సనమ్ శెట్టి.

అంబులి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సనమ్ శెట్టి.. ఆ తర్వాత తమిళంలో అనేక చిత్రాల్లో నటించింది. శ్రీమంతుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సనమ్.. సంపూర్ణేష్ బాబు నటించిన సింగం 123, ప్రేమికుడు సినిమాల్లో నటించింది. తమిళ్, కన్నడ భాషల్లో ఎక్కువగా సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.