Pressure Cooker: ప్రెషర్ కుక్కర్‌లో ఈ వంటకాలు అస్సలు చేయొద్దు!.. ఎందుకో తెలిస్తే..

అయితే కొన్ని రకాల వంటలకు ప్రెజర్‌ కుక్కర్‌ ఉపయోగించటం అస్సలు సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రెజర్ కుక్కర్‌ లో కొన్ని రకాల వంటలు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. ఇలాంటి వంటకాలను కడాయిలో వండటమే ఉత్తమం అంటున్నారు నిపుణులు. అలాంటి ఆ వంట‌కాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

Pressure Cooker: ప్రెషర్ కుక్కర్‌లో ఈ వంటకాలు అస్సలు చేయొద్దు!.. ఎందుకో తెలిస్తే..
Pressure Cooker

Updated on: May 25, 2025 | 4:19 PM

ప్ర‌తి వంటింట్లో కచ్చితంగా ప్రెజ‌ర్ కుక్క‌ర్ ఉంటుంది. కుక్కర్ ఉపయోగించి చాలా మంది చాలా రకాల వంటకాలను చేస్తుంటారు. అయితే కొన్ని రకాల వంటలకు ప్రెజర్‌ కుక్కర్‌ ఉపయోగించటం అస్సలు సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రెజర్ కుక్కర్‌ లో కొన్ని రకాల వంటలు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. అలాంటి ఆ వంట‌కాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

పాలు, పెరుగుతో త‌యారు చేసే వంట‌కాల‌ను ప్రెజ‌ర్ కుక్క‌ర్‌లో ట్రై చేయ‌కూడ‌దని నిపుణులు చెబుతున్నారు. ప్రెజర్‌ కుక్కర్‌లో పాలు, పెరుగు కలిపిన వంటలు వండితే రుచి మారిపోతుందని చెబుతున్నారు. బటర్, చీజ్ వంటి వంటకాలు ఎక్కువ వేడి తట్టుకోలేవు. అందుకే ఈ రెండింటిని ఉపయోగించి తయారు చేసే వంట‌కాల‌ను ప్రెజ‌ర్ కుక్క‌ర్‌లో ట్రై చేయ‌కూడ‌దు. అలాగే, త‌క్కువ నీటితో త‌యారు చేసే పాస్తా లేదా న్యూడిల్స్ వంటి వాటిని కూడా ప్రెజర్ కుక్కర్‌లో ఉడికిస్తే అవి ఓవర్‌ కుక్ అవుతాయి.

అలాగే, డీప్ ఫ్రై చేయాల్సిన వంట‌కాలైన ప‌కోడి, వ‌డ వంటివి వాటిని కూడా ప్రెజర్ కుక్కర్‌లో చేయ‌డం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. వేడి గాలి ఎక్కువ అవ్వడం వల్ల కుక్క‌ర్ బ్లాస్ట్‌ అయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, బిర్యానీ వంటివి కూడా ప్రెజ‌ర్ కుక్క‌ర్‌లో వండ‌కూడ‌దని నిపుణులు చెబుతున్నారు.. ప్రెజర్‌ కుక్కర్‌లో బిర్యాని వంటివి వండితే వాటి రుచి మారిపోతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

కుక్కర్‌ బెండకాయ, దొండ‌కాయ వంటి కూరలను ఉడికించ‌డం కూడా కరెక్ట్‌ కాదు. ఈ కూరలను వండితే అవి రుచిని కోల్పోతాయి. వేయించి వండాల్సిన వంటకాలైన ఎగ్ ఫ్రై లేదా ఎగ్‌ బుర్జీ వంటి వంటకాలను కూడా కుక్కర్‌లో చేయడం మంచిది కాదు. కుక్కర్‌లో ఇలాంటివి వండటం వల్ల ఆయా వంట‌కాలు వాస‌న కోల్పోతాయి. మసాలా పేస్ట్‌లను ఉపయోగించి తయారు చేసే వంటలను ప్రెజర్‌ కుక్కర్‌లో వండకూడదు. సాధారణంగా వంటల కోసం మ‌సాలా పేస్టుల‌ను నూనెలో బాగా వేగించాలి. కాబట్టి వీటిని కడాయిలో వండటమే ఉత్తమం అంటున్నారు నిపుణులు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..