Mysterious temple: ఈ ఆలయంలో శివలింగంపై సమర్పించిన నీరు, పాలు కనిపించవు.. నాసా కనిపెట్టలేని మిస్టరీ ఇది.. వివరాలు ఇవిగో..

|

Dec 13, 2022 | 7:34 PM

మహాభారత యుద్ధంలో మరణించిన అసంఖ్యాక యోధుల ఆత్మశాంతి కోసం, కార్తీక మాస చతుర్దశి నాడు, కల్యాణేశ్వరాలయం దగ్గర, గంగానదిలో దీపదానం చేసి, పాండవులు చాలా రోజులు పూజించారు. యజ్ఞం పూర్తయిన తరువాత, పాండవులు ఇక్కడి నుండి సొరంగం ద్వారా తిరిగి తమ స్థానానికి చేరుకున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ ఆలయ ప్రాంగణంలో కనిపిస్తాయి.

Mysterious temple: ఈ ఆలయంలో శివలింగంపై సమర్పించిన నీరు, పాలు కనిపించవు.. నాసా కనిపెట్టలేని మిస్టరీ ఇది.. వివరాలు ఇవిగో..
Kalyaneshwar Mahadev]
Follow us on

భారత దేశంలో అనేక రహస్యాలను దాచుకున్న ఆలయాలు ఉన్నాయి. అంబరాన్ని తాకిన మనిషి.. చంద్రుడిలో అడుగు పెట్టిన శాస్త్ర విజ్ఞానం కూడా ఈ రహస్యాల చిక్కు ముడిని విప్పలేక చేతులెత్తేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. అలాంటి ఆలయంలో ఒకటి గ్రహముక్తేశ్వర్ ఆలయం. ఈ ప్రసిద్ధి చెందిన ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఉంది . ఈ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అడవిలో కల్యాణేశ్వర మహాదేవ్ ఆలయం ఉంది. ఈ ఆలయం పురాణాలు, అద్భుతాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ శక్తి ఛత్రపతి శివాజీ జీవితంపై కూడా ప్రభావం చూపింది. శివాజీ ఇక్కడ రుద్ర యాగాన్ని నిర్వహించినట్లు చారిత్రక కథనం. గంగా నది ఒడ్డున ఉన్న ఈ శివలింగం ప్రపంచ వ్యాప్తంగా మరో అద్భుతానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగానికి సమర్పించిన నీరు, పాలు అదృశ్యమవుతాయని చెబుతారు. ఈ నీరు, పాలు ఎక్కడికి వెళ్తాయో నేటికీ ఎవరికి తెలియదు. ఈ ఆలయ రహస్యం తెలుసుకోవడానికి ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా నేటికీ ఆ మిస్టరీ హిస్టరీలో మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ శివాలయం భక్తుల విశ్వాసానికి  కేంద్రంగా ప్రసిద్ధిగాంచింది.

మూడు నెలల పాటు రుద్ర యాగాన్ని నిర్వహించిన ఛత్రపతి శివాజీ
ఛత్రపతి శివాజీ మహారాజ్ 3 నెలల పాటు ఆలయంలో యాగం నిర్వహించారు. ఒకప్పుడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మరాఠా సర్దార్ ఛత్రపతి శివాజీని వంచనతో బంధించాడని.. అయితే శివుని దయతో అలుపెరగని పోరాటం చేసి.. ధైర్యం, తెలివితేటలతో శివాజీ జైలు నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత ఈ ఆలయంలో శివుడిని స్తుతిస్తూ శివాజీ 3 నెలల పాటు రుద్ర యజ్ఞం నిర్వహించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

ఆ రహస్యం తెలుసుకునేందుకు నల మహారాజు జలాభిషేకం 
కల్యాణేశ్వర మహాదేవ ఆలయం గురించి అనేక పౌరాణిక సంఘటనలు ప్రబలంగా వార్తల్లో ఉన్నాయి. ఒక పురాణం ప్రకారం, ప్రసిద్ధ చెందిన నలమహారాజు ఇక్కడ శివలింగానికి జలాభిషేకం చేసాడు. అతని కళ్ళ ముందు శివలింగంపై సమర్పించిన నీరు అకస్మాత్తుగా భూమిలో కలిసిపోయింది. ఈ అద్భుతాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. దీని తరువాత..  అతను శివలింగంపై వేలకొద్దీ కుండలతో  గంగాజలాలను సమర్పించాడు.. ఎంత నీరు సమర్పించినా ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోలేక పోయాడు. అలా అభిషేకం చేసి చేసి అలసిపోయిన రాజు అది శివుని మహిమ అని అర్థం చేసుకుని క్షమాపణ చెప్పి తిరిగి తన దేశానికి చేరుకున్నాడట.

ఇవి కూడా చదవండి

ఆలయంలో యజ్ఞాన్ని నిర్వహించిన పాండవులు 
గ్రహముక్తేశ్వర్‌లోని ప్రసిద్ధ కల్యాణేశ్వర మహాదేవ ఆలయంలో.. శాపగ్రస్తులైన శివగణాలు పిశాచ  రూపం నుంచి విముక్తి పొందారు. అందుకే ఈ యాత్రకు గ్రహముక్తేశ్వర్ అని పేరు పెట్టారు. మరోవైపు, పురాణ ప్రాముఖ్యత ప్రకారం.. ఈ ప్రాంతం కౌరవుల రాజధాని, హస్తినాపూరం. ద్వాపర యుగంలో.. మహాభారత యుద్ధంలో మరణించిన అసంఖ్యాక యోధుల ఆత్మశాంతి కోసం, కార్తీక మాస చతుర్దశి నాడు, కల్యాణేశ్వరాలయం దగ్గర, గంగానదిలో దీపదానం చేసి, పాండవులు చాలా రోజులు పూజించారు. ఈ ఆలయంలో యజ్ఞం పూర్తయిన తరువాత, పాండవులు ఇక్కడి నుండి సొరంగం ద్వారా తిరిగి తమ స్థానానికి చేరుకున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ ఆలయ ప్రాంగణంలో కనిపిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)