Dangerous Dogs: పట్టు పట్టాయంటే అంతే.. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన కుక్కల జాబితా ఇదే!..
ప్రపంచంలో చాలా భయంకరమైన, ప్రమాదకరమైన కొన్ని కుక్కల జాతులు కొన్ని ఉన్నాయి. అవి దాడి చేస్తే తప్పించుకోవడం అసాధ్యం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇలాంటి జాతుల గ్రామ సింహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Most Dangerous Dog Breeds
అవి గ్రామ సింహాలు కాదు. సింహాలే అంటారు. ఇది మా మాట కాదు. ఎక్కడైనా గ్రామసింహాలంటే విశ్వాసానికి ప్రతిరూపం. కానీ ఈ జాతి కుక్కలు మాత్రం పౌరుషానికి ప్రతిరూపం. చూట్టానికి కుక్కలే. కానీ వాటి దూకుడు మాత్రం సింహానికి తక్కువ పులికి ఎక్కువ అన్నట్టుంటుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి జాతులు చాలా ఉన్నాయి.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కుక్కలు
- పిట్‌బుల్: ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కుక్క. దాని బలం, దాని ఆకృతి అన్నింటికంటే చాలా భిన్నంగా ఉంటుంది. పిట్‌బుల్ ఎలుగుబంట్లు, ఎద్దుల వంటి జీవులను మెడ పట్టుకుని చంపగలదు. ఫామ్ హౌస్ రక్షణ కోసం దీనిని ఎక్కువగా పెంచుతారు. చాలా కోపంగా ఉంటాయి. వాటిని సరిపడేంత ఆహారం ఇవ్వంటే యజమానిపై కూడా దాడి చేయవచ్చు. అత్యంత వేగంగా ఇవి పరిగెత్తగలవు. పిట్‌బుల్‌కి ఈత అంటే చాలా ఇష్టం. దీన్ని పిల్లలకు దూరంగా ఉంచాలి. ఈ జాతి కుక్కలను నమ్మడం మంచిది కాదు. అయినప్పటికీ.. ఈ కుక్కలు యజమానులతో విశ్వసనీయంగా, స్నేహపూర్వకంగా ఉంటాయని భావిస్తారు.
- బుల్‌మాస్టిఫ్: ఇవి సాధారణంగా ప్రశాంతంగా ఉంటాయి. బయట ఎవరినైనా అనుమానాస్పదంగా కనిపిస్తే చాలు పట్టేస్తాయి. బుల్‌మాస్టిఫ్‌లు ఇతరుల కంటే తమ స్వంత భద్రత గురించి చాలా జాగ్రత్తగా ఉంటారు. అపరిచితుల పట్ల ఇవి ప్రవర్తన, కోపంగా ఉంటాయి.
- రోట్‌వీలర్: ప్రపంచంలోని ఇతర కుక్కల కంటే ఇది చాలా అప్రమత్తంగా ఉంటుంది. ఇది సైన్యంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి చాలా త్వరగా విషయాలు నేర్చుకోగలవు. రోట్‌వీలర్‌లు ప్రతిరోజూ రెండు గంటల పాటు వ్యాయామం చేయించాలి. అధిక వేడి ప్రదేశాల్లో ఇవి ఉండలేవు.
- అమెరికన్ బుల్డాగ్: అథ్లెటిక్ బాడీతో ఉన్న ఈ కుక్క.. బలం, శక్తి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీని దవడ చాలా బలంగా ఉంటుంది. అమెరికన్ బుల్డాగ్స్ అస్సలు అందరితో కలిసి ఉండవు.
ఇది ఏ దేశంలో ఏ కుక్కల జాతిని నిషేధించబడిందో చూద్దాం..
అమెరికా: పిట్‌బుల్,వైల్డ్ డాగ్,రోట్‌వీలర్, ప్రెసా అనేక రాష్ట్రాల్లో నిషేధించబడ్డాయి
జర్మనీ: అమెరికన్ స్టాఫోర్డ్,షైర్ టెర్రియర్, బుల్ టెర్రియర్, పిట్ బుల్ టెర్రియర్, స్టాఫోర్డ్‌షైర్ బుల్ టెర్రియర్
UK: పిట్ బుల్ టెర్రియర్, జపనీస్ టోసా
