AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే ప్రయాణికులు అలర్ట్.. ఇకనుంచి రైళ్లలో మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ కుదరదు..! ఎందుకో తెలుసా..?

Mobile Laptop Charging in Train : భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రత కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. రాత్రి సమయంలో ప్రయాణికులు తమ మొబైల్, ల్యాప్‌టాప్‌లను

రైల్వే ప్రయాణికులు అలర్ట్..  ఇకనుంచి రైళ్లలో మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ కుదరదు..!  ఎందుకో తెలుసా..?
Mobile Laptop Charging In T
uppula Raju
|

Updated on: Mar 30, 2021 | 8:07 PM

Share

Mobile Laptop Charging in Train : భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రత కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. రాత్రి సమయంలో ప్రయాణికులు తమ మొబైల్, ల్యాప్‌టాప్‌లను ఛార్జింగ్ చేసుకోవడానికి కుదరకపోవచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడానికి ఉపయోగించే స్విచ్ బోర్డ్‌లు రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ఆపి వేయబడుతాయని రైల్వే సీనియర్ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇటీవలే డెహ్రాడూన్‌కు చెందిన శతాబ్దిఎక్స్‌ప్రెస్‌లో మార్చి 13 న షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. అంతేకాకుండా రాంచీ స్టేషన్‌లోని స్టాటిక్ గూడ్స్ రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి వివరించారు. భద్రతా చర్యల పై రైల్వే అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. రైళ్ల పరుగులో అన్ని భద్రతా చర్యలను క్షుణ్ణంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని రైల్వే మంత్రి పీయూష్ చావ్ల ఒక ప్రకటనలో తెలిపారు. రైళ్లలో అగ్ని ప్రమాదాలను తగ్గించడానికి ఇటీవల రైల్వే ధూమాపానంపై అనేక కార్యక్రమాలను నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ కారణం వల్లే ఆన్‌బోర్డ్ రైళ్ళలో కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి, తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి రైల్వే ఉన్నత అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంతేకాకుండా వినియోగదారులు, సిబ్బందికి అవగాహన కల్పించడానికి ఏడు రోజుల ఇంటెన్సివ్ అవేర్‌నెస్ డ్రైవ్‌ను నిర్వహించాలని ఆదేశించారు.

మరిన్ని చదవండి : Electric Bikes: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ సర్కారు బంపరాఫర్‌.. లక్షకుపైగా ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌ కొనుగోలు..

Covid Warning: కరోనా సెకెండ్ వేవ్ మరింత తీవ్రం.. రాష్ట్రాలకు కేంద్రం తాజా హెచ్చరికలు

These Cars Prices Raising: కారు కొనేందుకు ప్లాన్‌ చేస్తున్నారా.? అయితే రేపే కొనేయండి.. ఎందుకంటే ఈ కార్ల ధరలు..