ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు.. ఆరోగ్యవంతుడిని మించిన ఐశ్వర్యవంతుడు మరొకరు ఉండరంటే నమ్మి తీరాలి ఈ రోజుల్లో.. కరోనా ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టించిన వేళ మహా మహా కుబేరులను సైతం డబ్బు కాపాడలేకపోయింది. ఐశ్వర్యం అక్కరకు రాలేకపోయింది. మనిషి ధర్మబద్ధంగా, ప్రకృతి నియమానుసారం నడుచుకున్నప్పడు ఆరోగ్యం, ఆయుష్షు అన్నీ ధర్మబద్ధంగా నడుచుకుంటాయి. అలా కరోనా కల్లోల సమయంలోనూ ఎంతో ఆరోగ్యంగా ఉండి 106 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా జీవిస్తున్న ఈ బామ్మ అందరికీ స్పూర్తిదాయకం. అలాంటి ఈ బామ్మకు తన కుటుంబ సభ్యులంతా కలిసి సన్మానం జరిపించారు. ఇంతకీ ఆమె ఎవరో.. ఎక్కడో తెలుసుకుందాం.
నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిర్సవాడ కాలనీకి చెందిన వెంకటరమణమ్మ వయసు 106 ఏళ్లు. ఇప్పటికీ ఈమె ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు, ఈ బామ్మ తన పనులన్నీ తానే స్వయంగా చేసుకోవడమే కాదు.. ఇప్పటికీ పొలం పనులు సైతం చేస్తున్నారు. 1914 లో జన్మించిన వెంకటరమణమ్మకు ఏడుగురు కుమారులు, ఒక కుమార్తె. వారి కుమారులు, కుమార్తెలు , కోడళ్లు, అల్లుళ్లు , మనవలు , మునిమనవలు అంతా కలిపి కుటుంబ సభ్యుల మొత్తం సంఖ్య 186 మంది. నియమబద్దమైన ఆమె జీవన విధానమే ఇంకా ఆమె తన కుటుంబ వృక్షానికి మూలంగా నిలబడి ఉన్నారనిపిస్తోంది. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులంతా నూరేళ్లు పైబడిన వెంకటరమణమ్మకు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలనుకున్నారు. అందరూ వెంకటరమణమ్మ దగ్గరకు వచ్చారు..ఘనంగా సన్మానించి , రోజంతా ఆమెతో ఆనందంగా గడిపారు. కుటుంబ సభ్యులందరి మధ్య ఇలా వేడుక చేసుకోవటం పట్ల వెంకటరమణమ్మ సంతోషం వ్యక్తం చేశారు. కరోనా కాలంలోనూ ఈ బామ్మ ఆరోగ్యంగా ఉండడం పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు.
Also Read: పవన్ డెడ్‌లైన్‌పై వైసీపీ కౌంటర్.. రివర్స్ పంచ్ వేసిన అంబటి..
Unstoppable with NBK.. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ అతిథుల లిస్ట్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే.. తారక్ కూడా !