AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Woderful Love Story: ఇది కథకాదు..1911 నాటి అద్భుతమైన ప్రేమ గాథ..! మరణం వరకు ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ..! (వీడియో)

Woderful Love Story: ఇది కథకాదు..1911 నాటి అద్భుతమైన ప్రేమ గాథ..! మరణం వరకు ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ..! (వీడియో)

Anil kumar poka
|

Updated on: Nov 01, 2021 | 9:02 AM

Share

సృష్టిలో మరణం లేనిది ప్రేమ ఒక్కటే అనడం అతిశయోక్తి కాదు. ఒక్కసారి ఎవరిపైన అయినా ప్రేమ పుట్టింది అంటే.. ఆ మనిషి చనిపోయినా వారి ప్రేమ గురుతులు మిగిలే ఉంటాయి. అలాంటి అద్భుతమైన ప్రేమ కథ.. కాదు.. కాదు. ప్రేమ గాధ గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇది 1911 నాటి ప్రణయగాథ..


సృష్టిలో మరణం లేనిది ప్రేమ ఒక్కటే అనడం అతిశయోక్తి కాదు. ఒక్కసారి ఎవరిపైన అయినా ప్రేమ పుట్టింది అంటే.. ఆ మనిషి చనిపోయినా వారి ప్రేమ గురుతులు మిగిలే ఉంటాయి. అలాంటి అద్భుతమైన ప్రేమ కథ.. కాదు.. కాదు. ప్రేమ గాధ గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇది 1911 నాటి ప్రణయగాథ.. పెర్లె స్క్వార్జ్‌, మాక్స్‌ వెల్‌ అనుకోకుండా ఒక కంట్రీ క్లబ్‌లో కలిశారు. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అంటారే.. వీళ్లది కూడా అటువంటి ప్రేమే. తొలిచూపులోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్లకే తెలీకుండా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇరు కుటుంబాల్లో విషయం చెప్పారు. ఇరువురి మతాలు వారి పెళ్లికి అడ్డుపడ్డాయి. తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. కుటుంబ పరువు కోసం ఆజన్మాంతం ప్రేమికులుగానే మిగిలిపోయారు.

తర్వాత మ్యాక్స్‌వెల్‌ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో అమెరికన్ వలసరాజ్య చరిత్ర ప్రొఫెసర్‌గా పనిచేశాడు. అనేక పరిశోధన పత్రాలను ప్రచురించాడు. కొన్ని పుస్తకాలు కూడా రాశాడు. 83 సంవత్సరాల వయస్సులో 1979 లో మరణించాడు. పెర్లె మాత్రం చనిపోయేవరకు ప్రియుడికోసం ఎదురుచూస్తూనే ఉంది. పేరెంట్స్‌ ఆమెను అతని దగ్గరికి పోనివ్వలేదు. 65 యేళ్ల వరకు పెర్లీ అలా నిశ్శబ్ద జీవితాన్ని గడిపింది. మ్యాక్స్‌ మరణం గురించి తెలిసిన 3 నెలల తర్వాత ఆమె 1980లో కన్నుమూసింది. ఆనాటి ప్రేమతాలూకు ఆనవాళ్లు తాజాగా ఒక ఇంట్లో ఉత్తరాల రూపంలో బయటపడ్డాయి. పెర్లె ఇంట్లో అటకపై ఒక పెట్టెలో మాక్స్ నుంచి వచ్చిన వందల కొద్దీ ప్రేమలేఖలు వెలుగుచూశాయి. దాదాపు 1913-1978 వరకు మాక్స్,పెర్లేకి రాసిన ఉ‍త్తరాలవి. అతని లేఖలన్నీ “మై స్వీట్ పెర్ల్” తో ప్రారంభమై.. “ఫరెవర్ యువర్స్.. మాక్స్” తో ముగిశాయి.

విధి వాళ్లని కలపనప్పటికీ.. జీవితాంతం వారి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా, స్పెయిన్, చిలీ, కెనడా, వాషింగ్టన్, రోడ్ ఐలాండ్, ఫ్రాన్స్‌ల నుండి పెర్లెకి ఉత్తరాలు వచ్చాయి. మాక్స్‌వెల్‌ ఎక్కడికి వెళ్లినా, ఎక్కడున్నా … ఉత్తరాలు రాస్తూనే ఉండేవాడు. ఇలా 65 సంవత్సరాలకు పైగా ఉత్తర ప్రత్యుత్తరాలను కొనసాగించినట్లు తెలుస్తోంది. చివరికి మాక్స్‌ వివాహం చేసుకున్నాడని, అతనికి మిచెల్ అనే ఒక కూతురు కూడా ఉన్నట్లు ఆ లేఖలను బట్టి తెలుస్తోంది. 1980లో పెర్లే మరణించినప్పుడు ఆమె దాచుకున్నఉత్తరాల్లో కొన్ని కాలిపోయాయట. మిగిలిన వాటిని ఆమె కుటుంబం అటకపై ఒక బాక్స్‌లో భద్రపరిచింది. గొప్ప ప్రేమ కథలలో ఒకటి ఇలా ఉత్తరాల రూపంలో ఇప్పుడు బయటపడింది. ‘ఐ లవ్‌యూ.. ఇంకేం చెప్పలేను- మాక్స్’మతం మారితేనే పెళ్లి చేసుకోవచ్చని పెర్లే చెప్పిన తర్వాత మాక్స్‌ ఆమెకు రాసిన మొదటి ఉత్తరం ఇది. ‘సోమవారం సాయంత్రం నాకు అర్థమైంది. నేను మొదటి నుండి అర్థం చేసుకున్నాను. నువ్వేం అనుకుంటున్నావనేదే అర్థం కావడంలేదు. ఇకపై క్లబ్‌కి రాలేను. నిన్ను ప్రేమిస్తున్నందుకు నాకు కలిగే హింసను నేను అనుభవించలేను. ప్రతిచోటా నీవే కనిపించడం, నీవే అనిపించడం నేను తట్టుకోలేకపోతున్నాను… ఇది పెర్లె, మాక్స్‌కు రాసిన ఉ‍త్తరం. మనం కలిసి ఉండలేమని చెప్పిన తర్వాత నాకు వచ్చిన మొదటి లేఖ’ అనిపెర్లే రాసిన లేఖ గురించి మాక్స్‌ రాసుకున్న అక్షరాలవి. ఎంత అందమైన ప్రేమ కథ ఇది. అందుకే ప్రేమకు చావులేదు అంటారు.

మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Vijay Sethupathi Bike Photos: BMW బైక్ కొన్న ‘మక్కల్ సెల్వన్’.. స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ‘విజయ్ సేతుపతి’.. వైరల్ అవుతున్న ఫొటోస్..
MLA Roja on Tax: చెత్త మీద పన్ను..అందుకే..! స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా..(వీడియో)