MLA Roja on Tax: చెత్త మీద పన్ను..అందుకే..! స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా..(వీడియో)
పారిశుధ్యం పట్ల ప్రజల్లో బాధ్యత పెంపొందించడం కోసమే చెత్త మీద పన్ను విధించారని చెప్పారు నగరి ఎమ్మెల్యే రోజా. పుత్తూరు మున్సిపాలిటీ 15వ వార్డులో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ఉచితం అయితే...
పారిశుధ్యం పట్ల ప్రజల్లో బాధ్యత పెంపొందించడం కోసమే చెత్త మీద పన్ను విధించారని చెప్పారు నగరి ఎమ్మెల్యే రోజా. పుత్తూరు మున్సిపాలిటీ 15వ వార్డులో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ఉచితం అయితే బాధ్యతగా ఉండరనే ఉద్దేశంతోనే రోజుకో రూపాయి వంతున చెత్త పన్ను విధించామని తెలిపారు. ఇందులో ప్రభుత్వం సంపాదించేదేమీ లేదన్నారు. అందరి ఇళ్లు, వీధి, ఊరు శుభ్రంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం గురించి వాలంటీర్లు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మహిళలు తడి, పొడి, హానికరమైన చెత్తను వేరుచేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. ఇంటికి చొప్పున మూడు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. పుత్తూరు మున్సిపాలిటీని పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో 2కోట్ల 36లక్షల రూపాయల బడ్జెట్‌తో క్లీన్ పుత్తూరుకు శ్రీకారం చుట్టారని అన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..
Vijay Sethupathi Bike Photos: BMW బైక్ కొన్న ‘మక్కల్ సెల్వన్’.. స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ‘విజయ్ సేతుపతి’.. వైరల్ అవుతున్న ఫొటోస్..
Battery thiefs arrest: వీళ్లు మామూలు దొంగలు కాదు..జగత్ జంత్రీలు..! బ్యాటరీలు చోరీ ఏంటో మరీ.. (వీడియో)
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

