Freedom Fighter Gets Married: 103 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న స్వాంత్ర్య సమరయోధుడు..!
ప్రేమకు వయసుతో పని లేదని మరోసారి నిరూపితమైంది. భోపాల్‌కు చెందిన 103 ఏళ్ల వృద్ధుడిని చూసిన తర్వాత ఇది చెప్పవచ్చు. 103 ఏళ్ల వృద్ధుడు 54 ఏళ్ల మహిళతో ప్రేమలో పడ్డాడు. అంతేకాదు ఆమెతో పెళ్లి ప్రతిపాదన సైతం తీసుకువచ్చాడు. చివరికి వారిద్దరి అంగీకారంతో వివాహం జరిగింది. వృద్ధుల పెళ్లి ఇప్పడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ప్రేమకు వయసుతో పని లేదని మరోసారి నిరూపితమైంది. భోపాల్‌కు చెందిన 103 ఏళ్ల వృద్ధుడిని చూసిన తర్వాత ఇది చెప్పవచ్చు. 103 ఏళ్ల వృద్ధుడు 49 ఏళ్ల మహిళతో ప్రేమలో పడ్డాడు. అంతేకాదు ఆమెతో పెళ్లి ప్రతిపాదన సైతం తీసుకువచ్చాడు. చివరికి వారిద్దరి అంగీకారంతో వివాహం జరిగింది. వృద్ధుల పెళ్లి ఇప్పడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఇత్వారా నివాసి హబీబ్ నాజర్ కూడా స్వాతంత్ర్య సమరయోధుడు. 103 సంవత్సరాల వయస్సులో, అతను మూడవసారి వివాహం చేసుకున్నాడు. వృద్ధుడు హబీబ్ నాజర్ ఫిరోజ్ జహాన్ అనే 49 ఏళ్ల మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత హబీబ్ నాజర్ తన మూడో భార్యను ఇంటికి తీసుకెళ్లాడు.
ఒంటరితనాన్ని భరించలేక మూడవ వివాహం చేసుకున్నట్లు హబీబ్ నాజర్ తెలిపారు. మొదటి వివాహం నాసిక్‌లో జరగగా, రెండో వివాహం లక్నోలో జరిగింది. ఇద్దరు భార్యలు మరణించారు. ఆ తర్వాత హబీబ్ ఈ ఒంటరితనాన్ని భరించలేకపోయాడు. ఫలితంగా మూడవసారి వివాహం చేసుకున్నాడు. 103 ఏళ్ల హబీబ్‌ను మొదట వివాహం చేసుకోవడానికి కొత్త భార్య ఫిరోజ్ నిరాకరించింది. అయితే తన భర్తకు సేవ చేయడానికి అతన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ జంట గత సంవత్సరం వివాహం చేసుకున్నప్పటికీ, నాజర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో ఈ వివాహం విషయం వెలుగులోకి వచ్చింది.
54 ఏళ్ల మహిళ ఫిరోజ్ జహాన్ గతంలో పెళ్లికి నిరాకరించింది. కానీ తరువాత, వృద్ధుడికి సేవ చేసిన తర్వాత, ఫిరోజ్ జహాన్ అతని భార్య కావడానికి అంగీకరించారు. హబీబ్‌ను చూసుకునే వారు ఎవరూ లేకపోవడంతో ఆమె ఈ వివాహానికి అంగీకరించిందని బంధవులు తెలిపార. ఫిరోజ్ జహాన్ తాను ఆలోచించిన తర్వాత తన ఇష్టానుసారం వివాహం చేసుకున్నానని, దానితో తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఈ వయస్సులో కూడా తన భర్త పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని, అతనికి ఎటువంటి వ్యాధి లేదని ఆమె వెల్లడించారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…