Relationship Tips: మీది ప్రేమా? ఆకర్షణా? ఈ విధంగా తెలుసుకోండి..

Relationship Tips: ప్రస్తుత కాలంలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే పదం బాగా వింటుంటాం. అంటే మొదటి చూపులోనే ప్రేమ పుడుతుందన్నమాట.

Relationship Tips: మీది ప్రేమా? ఆకర్షణా? ఈ విధంగా తెలుసుకోండి..
Love Propose

Updated on: Jul 17, 2022 | 10:05 AM

Relationship Tips: ప్రస్తుత కాలంలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే పదం బాగా వింటుంటాం. అంటే మొదటి చూపులోనే ప్రేమ పుడుతుందన్నమాట. మరి అది నిజంగా సాధ్యమేనా? లవ్‌ ఏంటి? ఆకర్షణ ఏంటి? అనేది గుర్తించే స్థితిలో నేటి యువత ఉందా? అది నిజంగా సాధ్యమేనా? అంటే.. చాలా మంది వందకు వంద శాతం కాదు అనే అంటున్నారు. నేటి యువతకు ప్రేమ అర్థం తెలియదని, ప్రేమంటే ఏంటో తెలియదని అంటున్నారు. నేటి యువత ప్రేమకు, ఆకర్షణకు మధ్య తేడాను అర్థం చేసుకోవడం లేదు. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని ఒకరు చెబితే.. అది నమ్మేసి వెంటనే ప్రేమించడం మొదలు పెడుతున్నారు నేటి యువత. అయితే, ఎవరైనా కాస్త ఆకర్షణగా కనిపిస్తే ప్రేమలో పడ్డామని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అయితే, ప్రేమకు, మోహానికి చాలా తేడా ఉంటుంది. ఈ ఆకర్షణ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఎదుటి వ్యక్తి గురించి సరిగా తెలియకపోతే వారితో ప్రేమ ఎలా సాధ్యమవుతుంది. ఇది కేవలం ఒక ఆకర్షణ మాత్రమే అవుతుంది. ప్రారంభంలో ప్రేమ వంటి భావన కలుగుతుంది. అయితే, మీరు నిజంగానే ప్రేమలో ఉన్నారా? లేదా కేవలం ఆకర్షణలో ఉన్నారా? అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ప్రేమ, ఆకర్షణ ఎలా పుడుతుంది..?
మీరు ఒక వ్యక్తిపై మోహం పెంచుకోవడానికి మెదడు విడుదల చేసే హార్మోన్సే కారణం. ఎవరైనా మీకు నచ్చినప్పుడు ఆ హార్మోన్స్ చాలా వేగంగా విడుదల అవుతుంది. డోపమైన్, నోర్‌పైన్‌ఫ్రైన్, ఆక్సిటోసిన్ కలిసి ఆనందాన్ని కలిగిస్తాయి. డోపమైన్ విడుదలైనప్పుడు మంచి అనుభూతిని కలిగిస్తుంది. అదే సమయంలో, నోర్‌పైన్‌ఫ్రైన్ మీ అనుభూతిని పెంచడానికి పనిచేస్తుంది.

ఆకర్షణ అంటే ఏమిటి?
కొన్నిసార్లు ప్రేమ, ఆకర్షణను అర్థం చేసుకోవడం కష్టం. అవును, మీరు ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు, ప్రారంభంలో ప్రతిదీ గొప్పగా అనిపిస్తుంది. జీవితంలో ఉత్సాహం ఉంటుంది. గొప్ప అనుభూతి చెందుతారు. అయితే సంబంధం ఇంకా ఏర్పడనప్పుడు, ఎదుటివారి గురించి సరిగా తెలియకపోవచ్చు. అయినా వారి ఆలోచనల్లో చాలా ఆనందం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆకర్షణ సంకేతాలు..
1. ప్రేమ కంటే ఆకర్షణ చాలా రెట్లు వేగంగా జరుగుతుంది. ఏమీ చేయలేకపోవడం, పని చేసే సామర్థ్యం విలువలు కూడా ప్రభావితమవుతాయి.
2. ఆకర్షణ పరమైన సంబంధాలలో ఆనందం చాలా త్వరగా ముగుస్తుంది. ఆ తరువాత దుఃఖం మిగులుతుంది.
3. చాలామంది ఇలాంటి ఆకర్షణలతో తమను తాము మోసం చేసుకుంటుంటారు.

ప్రేమ అంటే ఏంటి?
ప్రేమను మాటల్లో వ్యక్తపరచడం అంత సులభం కాదు. ప్రేమలో ఉన్నటువంటి లోతైన అనుభూతిని ప్రేమికులు మాత్రమే అనుభవించగలరు. ప్రేమను అనేక రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ప్రేమ అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చేది. షరతులు లేని, అత్యాశతో ఎప్పటికీ అంతం లేని ప్రేమ. స్నేహ బంధమైన ప్రేమ. ఇది స్వార్థం లేని ప్రేమ. భార్యాభర్తల ప్రేమ. మీరు మీ జీవిత భాగస్వామిని నిజంగా ప్రేమిస్తారు. జీవిత ప్రయాణం బాగుండాలంటే ప్రేమతో జీవించాలి. ఒకరికొకరు ఎంతో ప్రేమను పంచుకోవాలి. ఈ ప్రేమ ఒక్క క్షణంలోనో, ఏడాది రెండేళ్లలోనో ముగిసిపోదు.

ప్రేమ, ఆకర్షణ మధ్య వ్యత్యాసం..
ప్రేమ, ఆకర్షణ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మొదటి చూపులోనే ఒకరి పట్ల ఆకర్షితులవుతారు, ప్రేమతో కాదు. ఆకర్షణ చాలా వేగంగా జరుగుతుంది. తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. అయితే ప్రేమలో పడటానికి చాలా సమయం పడుతుంది. ఇది మొత్తం జీవితాంతం ఆ అనుభూతి ఉంటుంది. ఆ ప్రేమ పోవడం కాలా కష్టం.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..