AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Studies: చదువుకుంటే ఉన్న మతి పోయిందంటారు?.. అసలుకే ముసలం తెస్తున్న ఆన్ లైన్ చదువులు!

కరోనా కారణంగా విద్యార్థుల జీవితాలే మారిపోయాయి. ఆన్ లైన్ క్లాసులు అసలులకే ముసలం తెస్తున్నాయి.. నాలుగు గోడలకే పరమితమైన చదువులు ఒక అడుగు ముందు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది.

Online Studies: చదువుకుంటే ఉన్న మతి పోయిందంటారు?.. అసలుకే ముసలం తెస్తున్న  ఆన్ లైన్ చదువులు!
Online Classes
Balaraju Goud
|

Updated on: Aug 30, 2021 | 1:48 PM

Share

Online Education: కరోనా కారణంగా విద్యార్థుల జీవితాలే మారిపోయాయి. ఆన్ లైన్ క్లాసులు అసలులకే ముసలం తెస్తున్నాయి.. ఇంటి నాలుగు గోడలకే పరమితమైన చదువులు ఒక అడుగు ముందు రెండు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతున్నాయి. ఇంట్లో ఉండి చదువుకుంటున్నా.. వారి మానసికస్థితుల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిల్లల చదువులు.. అంతంత మాత్రంగా సాగుతున్నాయి. భావిభారత పౌరుల భాషా పరిజ్ఞానం 92 శాతం చతికిల పడిందా? గణితశాస్త్రం 82 శాతం లెక్క తప్పుతోందా? అవుననే అంటున్నాయి ప్రఖ్యాత అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ పరిశోధనలు. ఇంతకీ ఎందుకు చదువులు స్టాండెడ్స్ కోల్పోతున్నాయి. ఎలాంటి ప్రమాదకర పరిస్థితులకు దారితీయబోతున్నాయి. జీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ CEO అనురాగ్ బెహర్ సారధ్యంలో సాగిన రీసెర్చ్ తేల్చిపడేసింది.

కరోనా కారణంగా విద్యా ప్రమాణాలకు కష్టకాలమే వచ్చింది. ఆన్ లైన్ లో వింటున్నారు. అద్భుతంగా చదివేస్తున్నారు. పాసైపోతున్నారని సంబరపడిపోతున్నారా? అయితే, మీరు భ్రమల్లో ఉన్నట్టే. ఎందుకంటే, ప్రస్తుత చదువుల సంగతి పక్కనబెట్టండి, అసలు ఇప్పటివరకు నేర్చుకున్నది కూడా మర్చిపోయారనే నిజం మీకు తెలుసా? కనీసం రెండు ప్లస్ రెండు ఎంతో చెప్పమంటే నోరెళ్లబెడుతున్నారనే నిజం తెలుసా? అమ్మ, ఆవు, ఇల్లు లాంటి బొమ్మలను చూపించినా అవేంటో గుర్తించలేని స్థితిలోకి పిల్లలు వెళ్లిపోయారనే వాస్తవం మీకు తెలుసా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం, కావాలంటే, మీ పిల్లలకు ఒకసారి చెక్ చేయండి. గతంలో నేర్చుకున్న బేసిక్స్ గురించి అడగండి. నోరెళ్ల బెట్టకపోతే చూడండి.

ఏడాదిన్నరగా కరోనా చేసిన నష్టం అంతాఇంతా కాదు. ముఖ్యంగా పిల్లల చదువులపై తీవ్ర ప్రభావం చూపెట్టింది. అభ్యాసం, పర్యవేక్షణ లేకపోవడంతో ఇప్పటివరకు నేర్చుకున్నది సైతం మర్చిపోయారు. ఈ మాట మేం చెబుతున్నది కాదు. దేశవ్యాప్తంగా పలు ప్రాథమిక పాఠశాలల్లో 16వేల మంది విద్యార్ధులపై అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ జరిపిన సర్వేలో తేలింది. లాంగ్వేజ్ స్కిల్స్, మ్యాథ్స్ లో ఆందోళనకరమైన పరిస్థితులు బయటపడ్డాయి. ఇవి, ఏ స్థాయిలో పడిపోయాయో తెలిస్తే, ప్రతి ఒక్కరూ నోరెళ్ల బెడతారు. 10 లేదా 20శాతం కాదు. భాషా పరిజ్ఞానంలో 92 శాతం, గణిత శాస్త్రంలో 82శాతం తగ్గుదల కనిపించింది. రాకెట్ సైన్స్ కాదు… అతి చిన్న విషయాలపై ప్రశ్నలు అడిగినా చెప్పలేకపోతున్నారు. ఐదో తరగతి పిల్లోడు… అంతకు ముందు నేర్చుకున్న వాచకాలు, లెక్కలను కనీసం చెప్పలేకపోతున్నాడు.

ఆరో తరగతి చదువుతున్న ఓ అబ్బాయి.. ఉదయం నుంచి క్లాసులే క్లాసులు. కానీ, అంతా అయోమయం. అర్ధమైనట్టే ఉంటుంది, కానీ ఏమీరాదు. తనలాంటి పరిస్థితే అందరికీ ఉందంటున్నాడు ఈ మణిదీప్. విద్యార్ధుల్లో స్టాండర్డ్స్ పడిపోతున్నాయని, దీనికి ప్రధాన కారణం ప్రత్యక్ష తరగతులు లేకపోవడమేనని అంటున్నారు తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు. పసలేని చదువులను ఏ తల్లిదండ్రులూ కోరుకోరని, కానీ, కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులు తప్పలేదని పేరెంట్స్ అంటున్నారు. నాసిరకం చదువులతో పొందే సర్టిఫికెట్లతో విద్యార్ధులకే కాదు, ప్రగతి కూడా ఎలాంటి ప్రయోజనం ఇవ్వవు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి, పిల్లల్లో పడిపోయిన స్టాండర్డ్స్ ను తిరిగి పెంపొందించడానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.

Read Also….  Bajrang Dal: కామసూత్ర పుస్తకాలను దగ్దం చేసిన బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు.. హిందూ దేవతలను అవమానించేలా చిత్రాలు ఉన్నాయంటూ.