AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips For Home: కుబేర దిశలో ఇవి పెడితే ఆరోగ్యం, ఐశ్వర్యం..! ఈ వాస్తు చిట్కాలు పాటించండి..

ఒక వ్యక్తి జీవితంలో సానుకూలతను కొనసాగించడానికి వాస్తు నియమాలు రూపొందించబడ్డాయి. వ్యక్తి కష్టపడి సంపాదించిన డబ్బును ఆదా చేయడానికి, సంపదను సక్రమంగా ఉపయోగించుకోవడానికి కూడా వాస్తు శాస్త్రం పరిష్కారాలను సూచిస్తుంది. ఇంట్లోని ఏ వస్తువును ఏ దిశలో ఉంచాలి...? ఇంటికి తలుపు ఏ దిశలో తెరిచి ఉండాలి. ఇంట్లో ఎప్పుడూ ఖాళీగా ఉండకూడని వస్తువులేంటో వాస్తు సూచిస్తుంది. అలాంటిదే ఇంటికి కుబేర దిశ..

Vastu Tips For Home: కుబేర దిశలో ఇవి పెడితే ఆరోగ్యం, ఐశ్వర్యం..! ఈ వాస్తు చిట్కాలు పాటించండి..
Kubera Corner Vastu
Jyothi Gadda
|

Updated on: Aug 04, 2025 | 8:21 PM

Share

ప్రతి ఇంటికి కుబేర దిశ..ఇది అత్యంత ముఖ్యమైనది. కుబేర దిశ అంటే ఏమిటి..? ఇంటి ఈశాన్యం లేదా ఉత్తర వైపునే కుబేర దిశ అని అంటారు. ఇది కుబేరుడికి అనుకూలమైన దిక్కు. ఈ దిశలో కొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని జ్యోతిష్య పండిత, వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజూ ఉదయం పూట ఇంట్లో కుబేర దిశలో దీపం లేదా ధూపాన్ని వేయాలని సూచిస్తున్నారు. ఇది ఇంటికి సుఖ సంతోషాలు, లాభాలను అందిస్తుంది. కుబేరుడి అనుగ్రహం కలగాలంటే ఉత్తర దిశలో కుబేరుని విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణలు సూచిస్తున్నారు. ఇది లక్ష్మీదేవి కటాక్షాన్ని అందిస్తుందని చెబుతున్నారు.

అలాగే, ఈ దిశలో లక్ష్మీదేవి ఫోటోను కూడా పెట్టుకోవచ్చునని చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఆ ఇంట శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. కుబేర మూల ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. చెత్తాచెదారం లేకుండా ఉంటే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. కుబేర యంత్రాన్ని కానీ వాస్తు యంత్రాన్ని కానీ కుబేర దిశలో పెడితే సంపద ప్రవాహం పెరుగుతుంది. ఆర్థికంగా లాభపడతారని నిపుణులు సూచిస్తున్నారు.

నీటి సంబంధంనీటి సంబంధమైన వస్తువులు కుబేర దిశలో పెడితే చాలా మంచిది. అక్వేరియం లేదా ఫౌంటేన్ ఈ దిశలో ఉంటే సంపద సిద్ధిస్తుందని చెబుతున్నారు. కుబేరుని అనుగ్రహం కలగాలంటే ప్రతి రోజు కనకధార స్తోత్రాన్ని చదవండి. ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. కుబేర దిశలో తేలికైన రంగులు వేయాలి. లైట్ గ్రీన్, లైట్ బ్లూ లేదా వైట్ కలర్ వేస్తే చాలా మంచిది. ఇది మీకు శుభ ఫలితాలను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

Note : ఈ వార్తలో చెప్పిన సమాచారం కేవలం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..