Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ బైక్ భద్రమేనా..? ఇలా చెక్ చేసుకోండి.. లేదంటే లక్షల బండి దొంగలపాలే

ప్రతి ఇంట్లో రెండు మూడు బైక్ లు కనిపిస్తున్నాయి..యూత్ అయితే లక్షలు పెట్టి స్పోర్ట్స్ బైక్స్ కొంటున్నారు. గ్రామాల్లో రైతులు, పాల వ్యాపారులు, కూరగాయలు, అమ్మే వాళ్ళు కూడా బైక్ ల మీదనే వ్యాపారాలు చేస్తున్నారు. సో బైక్ ల వినియోగం అనేది పెరిగిపోయింది..తక్కువల తక్కువ 80 వేల నుండి మొదలయితే బైక్ ల ధర కోట్ల రూపాయలు విలువ చేసే బైక్ లు కూడా మార్కెట్ లో ఉన్నాయి.

మీ బైక్ భద్రమేనా..? ఇలా చెక్ చేసుకోండి.. లేదంటే లక్షల బండి దొంగలపాలే
Bike
Follow us
Sridhar Prasad

| Edited By: Rajeev Rayala

Updated on: Nov 16, 2023 | 12:49 PM

మన తాతల కాలం నుండి ఒక 15 ఏళ్ళ వరకు కూడా ఇంటి ముందు ఒక అట్లాస్ సైకిల్ ఉంటే చాలా గొప్ప విషయం.  అప్పట్లో పెళ్లిలో అత్తంటివారు సైకిల్ కానుకగా ఇస్తే బెంజ్ కార్ తో సమానంగా చూసే వారు. కానీ ఇప్పుడు సైకిల్ దాదాపు కనుమరుగు అయింది. శారీరక వ్యాయామం కోసం తప్పా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సైకిల్ కనపడకుండా పోయింది. సైకిల్ స్థానంలో ప్రతి ఇంట్లో రెండు మూడు బైక్ లు కనిపిస్తున్నాయి..యూత్ అయితే లక్షలు పెట్టి స్పోర్ట్స్ బైక్స్ కొంటున్నారు. గ్రామాల్లో రైతులు, పాల వ్యాపారులు, కూరగాయలు అమ్మేవాళ్ళు కూడా బైక్ ల మీదనే వ్యాపారాలు చేస్తున్నారు. సో బైక్ ల వినియోగం అనేది పెరిగిపోయింది.. తక్కువలో తక్కువ 80 వేల నుండి మొదలై కోట్ల రూపాయలు విలువ చేసే బైక్ లు కూడా మార్కెట్ లో ఉన్నాయి.

మరి లక్షలు కోట్లు పెట్టి కొన్న మీ బైక్ లు భద్రంగానే ఉంటున్నాయా అంటే అనుమానమే అంటున్నారు.  నిపుణులు ఎందుకు అంటే పోలీసుల తాజా లెక్కల ప్రకారం బైక్ ల దొంగతనాలు పెరిగిపోయాయి… హ్యాండిల్ లాక్ వేసి జాగ్రత్తలు పడ్డా కూడా దొంగలు అవన్నీ ఛేదించి దొంగిలిస్తున్నారు. అయితే బైక్ దొంగతనాలపై పరిశోధనలు చేసిన నిపుణులు కొత్త మార్గం కనుగొన్నారు. ఇప్పటికే మార్కెట్ లోకి కొత్తగా వస్తున్న ఎలక్ట్రికల్ బైక్ లలో జీపీఎస్ సిస్టమ్ వస్తుంది. కాబట్టి బైక్ పోయిన దొరికే ఛాన్స్ ఉంది. మరి ఓల్డ్ బైక్స్ ల మాటేంటి అనుకుంటున్నారా..బాధపడకండి.

జిపిఎస్ లేని వారు కూడా కొంచెం డబ్బు పెడితే మీరు కూడా జిపిఎస్ పెట్టుకోవచ్చు. మీ బైక్ ను దొంగల బారినుండి కాపాడుకోవచ్చు . దీనికి మూడు నుండి 5 వేల లోపే ఖర్చు ఉంటుంది అన్నది నిపుణుల మాట. అయితే మీరు ఒక పరికరం కొనాల్సి ఉంటుంది. ఫ్లీట్ ట్రాక్ అనే పరికరం మార్కెట్ లో అందుబాటులో ఉంది. దీనిలో జీపీఎస్ అమర్చి ఉంటుంది. కాబట్టి దీన్ని బైక్ తో పాటు మీ ఇతర వాహనాల్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫ్లీట్ ట్రాక్ పరికరంలో కనెక్ట్ చేసే వైర్లు ఏడాది పాటు పని చేసే సిమ్ కార్డు డేటాతో జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది. ఇది అన్ని రకాల వాహనాలకు అనుకూలంగా ఉంటుంది.. ఈ డివైస్ ఆండ్రాయిడ్ తో పాటు ఐఓఎస్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.కేవలం దీన్ని మీ బైక్ లో ఇంస్టాల్ చేసుకుంటే చాలు..దాని వెంటనే మీ మొబైల్ లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఇంకేం యాప్ యాక్టివేట్ అవ్వగానే మీ వాహనాల మూమెంట్స్ ఎప్పటికి అప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో లక్షలు పెట్టి బైక్ కొనే మీరు వెలు పెట్టి ఈ పరికరం కొంటే మీ ఇక భద్రమే కదా!!!