మీ ఇంట్లో ఇలాంటి పెయింటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారా..? అయితే, ఈ తప్పులు చేయకండి..

|

Oct 22, 2024 | 12:15 PM

అయితే ఈ ఏడు తెల్ల గుర్రాల చిత్రం సరైన దిశలో ఉంచుకోవడం చాలా అవసరం. అప్పుడే అది శుభఫలితాలను అందిస్తుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇది మీ ఇంట్లోని ప్రతికూల శక్తులని నిరోధించడంలో ఏడు గుర్రాల చిత్రం సహాయపడుతుంది. ఆర్థిక సమస్యల్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తెల్లని ఏడు గుర్రాల ఫోటోను ఇంట్లో ఈ దిశగా ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు.

మీ ఇంట్లో ఇలాంటి పెయింటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారా..? అయితే, ఈ తప్పులు చేయకండి..
Seven Horse Painting
Follow us on

చాలా మంది ఇళ్లలో అందమైన వాల్‌పోస్టర్లు, ఆకట్టుకునే సీనరిలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే, అలాంటి సీనరీలలో తెల్లటి గుర్రాల ఫోటోలు ఉండటం మీరేప్పుడైనా గమనించారా..? తెల్లటి ఏడు గర్రాల ఫోటో ఇంట్లో పెట్టుకోవటం వెనుక వాస్తుకు సంబంధించిన ప్రత్యేక ప్రముఖ్యత ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..వాస్తు శాస్త్రంలో ఈ ఫోటోకు ఉన్న ప్రముఖ్యత, జ్యోతిశాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

జ్యోతిశాస్త్రం ప్రకారం.. ఏడు తెల్లని గుర్రాలు పరిగెడుతున్న మీ ఇంటికి శుభసూచకంగా పరిగణిస్తున్నారు. ఈ దృశ్యం వేగం, ధైర్యం, విజయం, పురోగతికి చిహ్నంగా చెబుతున్నారు. ఇంట్లో సరైన దిశలో ఈ చిత్రాన్ని ఉంచడం వల్ల జీవితంలో అన్ని విజయాలేనని నమ్ముతారు. ఏడు గుర్రాల చిత్రం ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లో సంపద పెరుగుతుందని, వారికి అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. ఈ చిత్రం మీ ఇంట్లో ఉంటే జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయని నమ్ముతారు.

జ్యోతిశాస్త్రం ప్రకారం ఏడు అదృష్ట సంఖ్యగా భావిస్తారు. అందుకే పెళ్లిలో సప్తపది అంటే ఏడు అడుగులు వేయిస్తారు.. ఇంద్రధనుస్సులో కనిపించేవి రంగులు ఏడు, ఈ భూమిపై ఉన్న మహా సముద్రాలు కూడా ఏడే. సప్త రుషులు, సూర్యుడి రథానికి ఉండే గుర్రాలు కూడా ఏడు. ఇలా హిందూ మతంలో ఏడు సంఖ్య సానుకులమైనదిగా భావిస్తారు. అందుకే ఏడు గుర్రాల పెయింటింగ్ శుభాన్ని సూచిస్తుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ ఏడు తెల్ల గుర్రాల చిత్రం సరైన దిశలో ఉంచుకోవడం చాలా అవసరం. అప్పుడే అది శుభఫలితాలను అందిస్తుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇది మీ ఇంట్లోని ప్రతికూల శక్తులని నిరోధించడంలో ఏడు గుర్రాల చిత్రం సహాయపడుతుంది. ఆర్థిక సమస్యల్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తెల్లని ఏడు గుర్రాల ఫోటోను ఇంట్లో దక్షిణ దిశగా ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు.

ఏడు తెల్లని గుర్రాల బొమ్మను దక్షిణ దిశలో ఉంచడం వల్ల జీవితంలో విజయం సాధిస్తారు. కెరీర్‌లో పురోగతి కనిపిస్తుందని చెబుతారు. ఈ దిశ విజయం, కీర్తితో ముడిపడి ఉండటం వల్ల దక్షిణం వైపుగా ఏడు గుర్రాల చిత్రాన్ని పెడితే మీరు అన్నింటా విజయం సాధిస్తారని నమ్ముతారు.

వాస్తు శాస్త్రం ప్రకారం..ఈ పెయింటింగ్ వేలాడదీసేటప్పుడు గుర్రాల ముఖాలు తలుపుకు ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి. అది మీ జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తూర్పు దిక్కున కూడా పెట్టుకుంటే శుభప్రదంగా పరిగణిస్తారు. ఇందులో తెలుపు రంగు గుర్రాలు శాంతి, విజయం, శ్రేయస్సుని సూచిస్తుంది. అందుకే ఇంట్లో, ఆఫీసులో ఈ రంగు గుర్రాల పెయింటింగ్ పెట్టుకోవచ్చు. కానీ, బెడ్ రూమ్, పూజ గది, స్టడీ రూమ్, వాష్ రూమ్ దగ్గర మాత్రం ఈ గుర్రాల పెయింటింగ్ పెట్టుకోకూడదు.

ఇకపోతే, ఇలాంటి ఏడు గుర్రాల ఫోటో ఇంటికి తెచ్చుకునే ముందు వాటి రంగు కూడా అతి ముఖ్యం. పొరపాటున కూడా నల్లటి రంగులో ఉన్న గుర్రాల చిత్రాన్ని తీసుకోరాదు.. ఇది శని గ్రహాని సూచకంగా చెబుతున్నారు.. బూడిద రంగు గుర్రాలు రాహు గ్రహాన్ని సూచిస్తాయి. బంగారు రంగు గుర్రాలు సూర్యుడికి ప్రతీకగా చెబుతారు. అలాగే ఫోటోలో గుర్రాలన్నీ ఒకవైపు పరిగెడుతున్నటు వంటి పెయింటింగ్ కొనుగోలు చేయాలి.

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..