- Telugu News Photo Gallery Spiritual photos diwali 2024: finding these things in your home due to deepavali festival cleaning can bring money and good luck
Diwali 2024: దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తున్నారా..! ఈ సమయంలో కొన్ని వస్తువులు కనిపిస్తే శుభ్రప్రదం.. అనుకోని విధంగా డబ్బులు కలిసి వస్తాయట
మరికొన్ని రోజుల్లో దీపావళి రాబోతోంది. దీపావళి పండగ సందర్భంగా ప్రతి ఇంట్లో ఇంటిని, పరిసరాలను శుభ్రపరిచే పని జోరందుకుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం దీపావళి శుభ్రపరిచే సమయంలో కొన్ని వస్తువులు కనిపిస్తే చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీపావళికి ఇంటిని క్లీనింగ్ చేసే సమయంలో కొన్ని రకాల వస్తువులు కనిపిస్తే అది లక్ష్మీ దేవి అనుగ్రహానికి సంకేతం.
Updated on: Oct 22, 2024 | 2:31 PM

దసరా నవరాత్రులు ముగిసిన వెంటనే దీపావళి పండగ కోసం సన్నాహాలు ప్రతి ఇంట్లో ప్రారంభమవుతాయి. ప్రజలు దీపావళికి చాలా రోజుల ముందు నుంచే తమ ఇళ్లను శుభ్రం చేయడం ప్రారంభిస్తారు. కొంతమంది ఇంటికి రంగులు కూడా వేసుకుంటారు. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత అలంకరణలు చేస్తారు. దీపావళి పండగ సందర్భంగా మార్కెట్లలో సందడి నెలకొంది. దీపావళికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది దీపావళిని అక్టోబర్ 31 లేదా 1వ తేదీన జరుపుకోనున్నారు. అయితే ఈసారి దీపావళి తేదీ విషయంలో గందరగోళం నెలకొంది.

పావళి పరిశుభ్రతకు సంబంధించిన ప్రత్యేక విషయాలు వాస్తు శాస్త్రం, జ్యోతిషశాస్త్రంలో పేర్కొనబడ్డాయి. దీని ప్రకారం దీపావళికి ఇంటిని శుభ్రపరిచే సమయంలో కొన్ని ప్రత్యేక వస్తువులు కనిపిస్తే, అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ వస్తువులు కనిపించడం అంటే సంపదల అధిదేవత లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం అని అర్ధమట. అంతేకాదు లక్ష్మీ దేవి మీ పట్ల దయ చూపుతుందని , భవిష్యత్తులో చాలా డబ్బును పొందబోతున్నారని సూచిస్తుంది. దీపావళి క్లీనింగ్ సమయంలో ఏ వస్తువులు కనిపించడం శుభప్రదంగా పరిగణించబడతాయో తెలుసుకుందాం.

డబ్బులు కనిపిస్తే: చాలా సార్లు మనం డబ్బులను బట్టల్లో , పాకెట్స్ లేదా పర్సులో పెట్టి వాటి విషయం మర్చిపోతాము. దీపావళి క్లీనింగ్ సమయంలో ఇలా మరచిపోయిన డబ్బులు కనిపిస్తే అది మీపై లక్ష్మీ దేవి అనుగ్రహానికి సంకేతం. త్వరలో ఇంటిలో డబ్బు ఇబ్బందులు తీరతాయి.

శంఖం లేదా గవ్వలు: దీపావళికి ఇంటిని శుభ్రపరిచే సమయంలో మీకు శంఖం లేదా గవ్వలు కనిపిస్తే అది అద్భుతమైన శుభ సంకేతం. మీకు సమీపంలో అపారమైన ఐశ్వర్యం, ఐశ్వర్యంతోపాటు పదవి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని అర్ధమట.

నెమలి ఈక: దీపావళికి ఇంటిని శుభ్రపరిచే సమయంలో నెమలి ఈక కనిపిస్తే అది కూడా శ్రేయస్కరం. జీవితంలో ఏర్పడిన సమస్యల తొలగింపుకు సంకేతం. ఆర్థిక లాభం కూడా పొందుతారు. మీ జీవితంలో మాధుర్యం వస్తుంది.

బియ్యం లేదా అక్షతలు: బియ్యం శుక్ర గ్రహానికి సంబంధించినది. ఇది సంపద, విలాసాలకు చిహ్నం. అదే సమయంలో హిందూ మతంలో అక్షతలు లేకుండా పూజలు పూర్తి కాదు. దీపావళి కోసం ఇంటిని శుభ్రపరిచే సమయంలో పెట్టెలో బియ్యం లేదా అక్షతలు దొరకడం అదృష్టానికి చిహ్నం. సంపద రాకకు సంకేతం.

ఎరుపు రంగు వస్త్రం: సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి పూజలో ఎరుపు రంగు వస్త్రం లేదా చున్నీని ధరింపజేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఎరుపు రంగు లక్ష్మీదేవికి ప్రియమైనది. దీపావళి కోసం ఇంటిని పరిసరాలను శుభ్రపరిచే సమయంలో ఎర్రటి గుడ్డ లేదా ఎరుపు రంగు చున్నీ కంట బడితే మీకు మంచి రోజులు రాబోతున్నాయని ముందస్తు సూచన.




