Andhrapradesh: భార్యకు ప్రేమతో.. నిలువెత్తు చెక్క విగ్రహం.. వేదమంత్రాల సాక్షిగా ఇంట్లో ప్రతిష్ట

|

Feb 25, 2021 | 8:18 PM

భార్యపై ఉన్న ప్రేమతో ఆమె విగ్రహం తయారు చేయించిన సంఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. తనను విడిచి పరలోకాలకు వెళ్ళిపోయిన భార్యపై తనకున్న....

Andhrapradesh:  భార్యకు ప్రేమతో.. నిలువెత్తు చెక్క విగ్రహం.. వేదమంత్రాల సాక్షిగా ఇంట్లో ప్రతిష్ట
Follow us on

భార్యపై ఉన్న ప్రేమతో ఆమె విగ్రహం తయారు చేయించిన సంఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. తనను విడిచి పరలోకాలకు వెళ్ళిపోయిన భార్యపై తనకున్న ఎనలేని ప్రేమను చాటుకున్నాడు ఓ వ్యక్తి. ఆమె మధురస్మృతులు ఎప్పటికీ తనతోనే ఉండాలనే ఉద్దేశంతో భార్యకు ఏకంగా నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించాడు. అంతేకాదు, వేదమంత్రాల సాక్షిగా ఆమె విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించుకున్నాడు.

కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట గ్రామం రమణ రావు కాలనీలో నివాసముంటున్నారు.. మూడవ ఏపీఎస్పీ రిటైర్డ్ ఆర్ఎస్ఐ బుర్ర వీరభద్రం..ఇతని భార్య మాణిక్యాంబ..వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అయితే గతేడాదిన్నర క్రితం అంతుపట్టని రోగంతో హఠాత్తుగా భార్య మృతి చెందింది. దీంతో వీరభద్రం తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మాణిక్యమ్మ జ్ఞాపకాలు పదిలంగా దాచుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం ఆమెకు నిలువెత్తు విగ్రహం చేయించాడు.

నవర గ్రామానికి చెందిన శిల్పి సత్యలింగంను సంప్రదించి అతని భార్య ప్రతిమను టేకు చెక్క తో తయారు చేయించాడు. మూడు నెలల శ్రమ ఫలితంగా మాణిక్యమ్మ ప్రతిబింబం తయారైంది. వేద పండితుల నడుమ, పూజా కార్యక్రమాలతో ఆమె ప్రతిమను ఇంట్లో ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహించారు. వీరభద్రంకు తన భార్యపై ఉన్న ప్రేమను చూసిన స్థానికులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కర్ణాటకలో…

కాగా గతేడాది ఆగష్టులో కర్ణాటకలో ఇటువంటి ఘటన జరిగింది.  కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా భార్య కొన్నేళ్ళ క్రిందట ఓ రోడ్డు యాక్సిడెంట్‌లో మరణించారు. చావు మనిషినే కానీ.. మనసులను దూరం చేయదని ఈ దంపతుల మధ్య ప్రేమానుబంధాలు మరోసారి నిరూపించాయి. భార్య కాలం చేసిన కొన్నాళ్లకు శ్రీనివాస్ గుప్తా కొత్తింటికి గృహప్రవేశం చేశాడు. ఈ శుభ కార్యక్రమానికి తన భార్య లేని లోటు తెలియకుండా ఉండాలని అనుకున్నాడు. మనసుంటే.. మార్గం ఉంటుంది. అతనికి మదిలో ఓ ఆలోచన తట్టింది. అచ్చం తన భార్యలా ఉండే నిలువెత్తు మైనపు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించాడు. ఇంకేముంది కుటుంబసభ్యులు అందరూ కూడా దాన్ని చూసి మురిసిపోయారు. ఆ మైనపు విగ్రహంతో ఫోటోలు దిగి సంతోషించారు. జీవకళ ఉట్టిపడేలా ఉన్న ఆ మైనపు విగ్రహం.. గతంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Also Read:

డిజిటల్ మీడియా, ఓటీటీపై కేంద్రం కళ్లెం.. హద్దుమీరితే కఠిన చర్యలు.. పిల్లలు చూడకుండా నియంత్రణ.. ఫోటో స్టోరీ

Black magic: ఇంటిముందు పుర్రెతో క్షుద్రపూజల కలకలం.. భయానకం.. వైరలవుతున్న ఫోటోలు

Ex Minister Raghuveera Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను శాసించిన వ్యక్తి.. ఇప్పుడు ఇలా.. వైరలవుతున్న ఫోటోలు

Dr. Noori Parveen: సలాం డాక్టరమ్మా..! పది రూపాయలకే వైద్యం.. ‌భవిష్యత్ తరాలకు ఆదర్శం