June 21 Special Day: ఈ ఏడాదిలోనే అద్భుతం నేడు.. మళ్లీ 2203లోనే వచ్చే ఛాన్స్‌..!

సాధారణంగా ఒక రోజులో పగటి సమయం ఎంత? ఎనిమిది నుంచి 12 గంటలు అనుకుందాం. కానీ, ఇవాళ మాత్రం.. పగటి పూట రికార్డు స్థాయిలో ఉండబోతోందట. అదేంటో? ఆ విశేషమేంటో మీకు తెలుసా? ఈ ఏడాది ఇదో వండర్‌. ఎందుకంటే.. ఇవాళ పగలు సమయం కాస్త ఎక్కువగా ఉండబోతోంది.

June 21 Special Day: ఈ ఏడాదిలోనే అద్భుతం నేడు.. మళ్లీ 2203లోనే వచ్చే ఛాన్స్‌..!
Long Day In The Year

Updated on: Jun 21, 2023 | 8:17 AM

సాధారణంగా ఒక రోజులో పగటి సమయం ఎంత? ఎనిమిది నుంచి 12 గంటలు అనుకుందాం. కానీ, ఇవాళ మాత్రం.. పగటి పూట రికార్డు స్థాయిలో ఉండబోతోందట. అదేంటో? ఆ విశేషమేంటో మీకు తెలుసా? ఈ ఏడాది ఇదో వండర్‌. ఎందుకంటే.. ఇవాళ పగలు సమయం కాస్త ఎక్కువగా ఉండబోతోంది. కాస్తంటే.. ఏ అరగంటో.. గంటో ఎక్కువ కాదు.. ఏకంగా ఐదు గంటల పాటు ఎక్కవగా పగటి సమయం ఉంటుందట. వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ.. జీవ పరిణామక్రమంలో ఇది నిజమేనంటున్నారు నిపుణులు.

సాధారణంగా మనం ప్రతిరోజూ పగటివేళని.. 8 నుంచి 12 గంటల పాటు ఆస్వాదిస్తుంటాం. ఇవాళ మాత్రం 13 గంటల 7 నిమిషాలు సుదీర్ఘమైన పగటి సమయం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ సమయం కలిగిన పగటివేళను.. ఇవాళ జీవకోటి అనుభవించబోతోంది. అయితే, దీనికి కారణం లేకపోలేదు. భూమి చిన్నగా ఉండి.. దీర్ఘకాలం భూభ్రమణంలో వేగం తగ్గుతుందనీ.. ఈ పరిణామ క్రమంలోనే కొన్నిసార్లు పగటి సమయం ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

అంటే, ఇవాళ జూన్ 21న ఉదయం 5:34 గంటలకు సూర్యోదయం జరిగితే.. సాయంత్రం 6:41 గంటలకు సూర్యుడు అస్తమిస్తాడు. ఏటా జూన్‌ 20 లేదా 21న.. లేదంటే డిసెంబర్‌లో ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. దక్షణాది అర్థగోళంలో ఉండే యూకే, యూఎస్, రష్యా, కెనడా, భారత్, చైనాలో వేసవి కాలం ముగిస్తే.. అదే సమయంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ, న్యూజిలాండ్‌లో శీతాకాలం ప్రారంభమవుతుండటం ఖగోళ పరిణామక్రమంలో మరో విశేషంగా చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

అయితే ఇవాళ జరిగే ఈ వింతలో భాగంగా.. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో తొలి సూర్యోదయం జరుగనుండగా.. ఏపీలోని గుడివాడలో తొలిపొద్దు కనింపించనుంది. కొన్ని ప్రాంతాల్లో సెకన్ల తేడాతో సూర్యాస్తమయం జరుగుతుంది. ఇలాంటి పరిణామం 1975లో ఏర్పడిందనీ.. మళ్లీ 2203లోనే వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..