LIC New Children Money Back Policy : ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటారు. అందుకోసం విద్య, ఇతర అవసరాలకు మొదటి నుంచి పొదుపు చేయడం ప్రారంభిస్తారు. మీరు మీ పిల్లవాడిని ఉద్యోగం రాకముందే లక్షాధికారిని చేయొచ్చు. ఎల్‌ఐసి న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇందులో బలమైన రాబడి ఉంటుంది. దీనివల్ల పిల్లవాడు పెద్దయ్యాక లక్షాధికారి అవుతాడు. కనుక పాలసీ ప్రత్యేకత ఏమిటి ఎలా పెట్టుబడి పెట్టాలి అనేది తెలుసుకుందాం.
పాలసీ ముఖ్యాంశాలు
1.ఎల్ఐసి న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ పాలసీని 25 సంవత్సరాలకు కొనుగోలు చేస్తారు.
2. పిల్లవాడు 18 ఏళ్లు నిండినప్పుడు మొదటి విడత ఇస్తారు. రెండవది 20 సంవత్సరాల వయస్సులో, మూడవసారి 22 సంవత్సరాల వయస్సులో చెల్లిస్తారు.
3. పిల్లలకి 25 సంవత్సరాలు నిండినప్పుడు అతను పూర్తి మొత్తాన్ని తిరిగి పొందుతాడు.
4. పాలసీ తీసుకోవటానికి పిల్లల వయస్సు సున్నా నుంచి 12 సంవత్సరాల వరకు ఉండాలి.
5. ఈ పథకం కింద 60 శాతం మొత్తం వాయిదాలలో, 40 శాతం మెచ్యూరిటీ సమయంలో బోనస్‌తో లభిస్తుంది.
6. ఈ పథకం కింద పెట్టుబడి కోసం కనీసం 1,00,000 రూపాయలు కలిగి ఉండటం అవసరం.
14 లక్షలు ఎలా పొందాలి
ఈ పాలసీలో మీరు రోజూ 150 రూపాయలు ఆదా చేయాలి అంటే వార్షిక ప్రీమియం 55000 రూపాయలు చెల్లించాలి. మీరు దీన్ని 25 సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది. మీరు మొత్తం రూ.14 లక్షలు జమ చేయాలి. అదే సమయంలో మెచ్యూరిటీపై మీకు మొత్తం 19 లక్షల రూపాయలు లభిస్తాయి. ఈ కాలంలో బీమా చేసిన వ్యక్తి మరణించకపోతే మాత్రమే ఈ నియమం వర్తిస్తుందని గుర్తుంచుకోండి.
పాలసీ ఎలా తీసుకోవాలి
పాలసీలో పెట్టుబడి కోసం పిల్లల తల్లిదండ్రుల ఆధార్ కార్డు, పిల్లలకి ఆధార్ కూడా ఉంటే దాని కాపీ, తల్లిదండ్రుల పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ అవసరం. పాలసీ హోల్డర్ తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉండాలి. పాలసీని తీసుకోవటానికి LIC బ్రాంచ్‌లో ఫారమ్ నింపాలి లేదా మీరు ఏజెంట్‌ను సంప్రదించవచ్చు.