International Women’s Day 2021: ‘మహిళా దినోత్సవం’ ప్రత్యేకమైన సందేశాలు మీకోసం…

Women's Day 2021: మహిళా.. ఒక అమ్మగా జన్మనిస్తుంది.. భార్యగా బాధ్యతలను మోస్తూ.. ఓ అక్కగా కష్టాల్లో తోడు నిలుస్తుంది... చెల్లిగా స్నేహాన్ని.. చిలిపి అల్లర్లను

  • Rajitha Chanti
  • Publish Date - 8:37 am, Mon, 8 March 21
International Women's Day 2021: 'మహిళా దినోత్సవం' ప్రత్యేకమైన సందేశాలు మీకోసం...

Women’s Day 2021: మహిళా.. ఒక అమ్మగా జన్మనిస్తుంది.. భార్యగా బాధ్యతలను మోస్తూ.. ఓ అక్కగా కష్టాల్లో తోడు నిలుస్తుంది… చెల్లిగా స్నేహాన్ని.. చిలిపి అల్లర్లను పరిచయం చేస్తుంది.. కుతురిగా ప్రేమను పంచుతుంది.. ఇలా ఎన్నో రకాలుగా మహిళలు ఏదో ఒకచోట తమ కార్తవ్యన్ని నిర్వర్తిస్తూనే ఉంటారు. పుట్టినప్పట్టి నుంచి ప్రాణం పోయే వరకు తానంటేనే సేవ.. అనేలా ప్రతి ఒక్క విషయంలో పురుషులకు తోడు నిలుస్తుంటారు స్త్రీలు. వీటికి ప్రతిఫలంగా తనకంటూ కాస్తంత ప్రేమ… ఓదార్పు.. తోడు మాత్రమే కోరుకుంటుంది. కొంచెం ప్రేమను చూపిస్తే చాలు లెక్కలేనంత సంతోషంతో మునిగిపోతుంది. అలాంటి మహిళలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ఆమెకు కొన్ని బహుమతులతోపాటు చక్కని సందేశాలతో శుభకాంక్షాలు చెప్పండి. మీ కోసం కొన్ని రకాల సందేశాలు..

✤ కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి… పాదాభివందనం!! అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

✤ తల్లిగా లాలిస్తావు… భార్యగా బాగోగులు చూస్తావు.. దాసిలా సేవ చేస్తావు.. అక్కగా అప్యాయతను పంచుతావు.. చెల్లిగా అల్లరిని పరిచయం చేస్తావు.. కుటుంబ భారాన్ని మోస్తూ.. బాధలను భరిస్తావు.. నీకంటూ ఏం లేకుండా సర్వం త్యాగం చేస్తావు.. నీ సేవలకు ఏం ఇవ్వలేము.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

✤ పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ. ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ.. మహిళగా నీ త్యాగం ఎప్పటికీ మరవలేమమ్మా’’ – హ్యాపీ ఉమెన్స్ డే.

✤ అమ్మ, సోదరి, భార్య, అమ్మమ్మగా.. ఇంకా ఎన్నో రూపాల్లో ప్రేమను పంచుతుంది మహిళను గౌరవిద్దాం. ఆమెకు ఏ కష్టం రాకుండా కాపాడుకుందాం’’ – అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

✤ ఆమె శక్తి అపారం.. ఆమె యుక్తి అమూల్యం
ప్రేరణ ఆమే.. లాలనా ఆమే..
తల్లిగా.. చెల్లిగా.. తోడుగా.. నీడగా.. ఆమె పాత్ర అనితరసాధ్యం..
ఆమె లేకుంటే అంతా శూన్యం..
అందుకే ఆమెకు శతకోటి వందనాలు..

✤ జననం నీవే.. గమనం నీవే..
సృష్టివి నీవే.. కర్తవు నీవే..
కర్మవు నీవే.. ఈ జగమంతా నీవే..
అందుకే భగవంతుడు అన్ని చోట్లా ఉండలేక ప్రతి ఇంటిలో నిన్ను సృష్టించాడు.
ఓ మహిళా నీకిదే మా వందనం..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షాలు..

✤ కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి… పాదాభివందనం!!
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

✤ అంతంలేని అవనిలో ఆదిశక్తి అవతారం…
అద్భుతమైన అఖండంలో అసలైన ఆయుధం..
మకుటంలో మరువలేని మణిరూపం మహిళ..
కొట్లలో కొందరికే కానుక నీ కడుపు కథ..
జగతిలో జన్మలకి ఆధారం నీ జన్మ..
పుట్టుకతో పులకించేను ఈ పవిత్ర ధరణి..
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

✤ తరలిపో తరలిపో.. చీకటి నుంచి వెలుగుకు తరలిపో.. కుందేలువి కావు.. పులిలా మారిపో.. వెంటాడే ఒడిదుడుకుల మృగాలతో యుద్ధానికి తరలిపో…’’ ఓ మహిళా మీకివే మా వందనాలు. హ్యాపీ ఉమెన్స్ డే.

✤ స్త్రీ…. తానొక ఒంటరి అక్షరం అనుకుంటారు అందరూ..
శిరస్సు వంచితే అది తన సహనం..
తను ఆగ్రహిస్తే… వదలని గ్రహణం..
ఆమె ప్రేమ పొందడం వరం..
స్త్రీని భాదిస్తే.. వీడదు జన్మజన్మలకు తన శాపం..
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

Also Read:

International Women’s Day 2021: మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన గూగుల్..యానిమేటెడ్ వీడియోతో డూడుల్..