Inter Cropping: తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండించే విధానం అంతర పంటలు.. ఈ వ్యవసాయంతో లక్షల్లో లాభాలు..

ఒకే పొలంలో వివిధ రకాల పంటలను పండించే విధానాన్ని అంతర పంట అంటారు. దీని కింద మామిడి, జామ, లిచ్చి , బెర్రీలతో సహా ఇతర పంటల మొక్కలను ఒక పొలంలో సమాన దూరంలో నాటారు. అదే సమయంలో ఈ మొక్కల మధ్య పెసలు, అరటి, మొక్కజొన్న, టమోటాలు సహా ఇతర ఆకుపచ్చ కూరగాయలను సాగు చేస్తారు. ఇలా ఒకే భూమిలో అంతర పంటలను వ్యవసాయం చేయడం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుంది.

Inter Cropping: తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండించే విధానం అంతర పంటలు.. ఈ వ్యవసాయంతో లక్షల్లో లాభాలు..
Inter Cropping

Updated on: Jun 10, 2023 | 1:51 PM

వ్యవసాయం నుంచి ఫలాలను అందుకోవాలంటే.. రైతన్న వ్యవసాయాన్ని దండగ కాదు పండగ అనిపించాలంటే.. భిన్నమైన పద్ధతులను అనుసరించాల్సిందే. తక్కువ భూమిలో మంచి లాభలను ఇచ్చే పంటలను పెంచుకోవాలి. ఈ నేపథ్యంలో హర్యానాకు చెందిన ఓ రైతు.. తనకున్న భూమిలో అంతర పంటల పద్ధతిలో వ్యవసాయం చేసి పలువురి రైతులకు ఆదర్శంగా నిలిచాడు. రైతు బిక్రమ్‌జిత్ సింగ్ ఈ విధంగా  సాంకేతికతతో వ్యవసాయం చేయడం ప్రారంభించిన వెంటనే ఆదాయం పెరిగింది. విశేషమేమిటంటే.. అంతర పంటల పద్ధతిలో ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, జర్మనీ దేశాలకు వెళ్లి వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ప్రస్తుతం 11 ఎకరాల్లో అంతర పంటలను సాగు చేస్తున్నాడు. దీంతో ఏడాదిలో లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. రానున్న కాలంలో అంతర పంటల సాగు విస్తీర్ణం పెంచుతాననని చెప్పాడు.

న్యూస్ 18 హిందీ కథనం ప్రకారం.. బిక్రమ్‌జిత్ సింగ్ యమునానగర్‌లోని భగవాన్‌ఘర్ నివాసి. 72 ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో 11 ఎకరాల్లో అంతర పంటల పద్ధతిలో సాగు చేస్తున్నాడు. తోటలో లిచ్చి, జామ,  బొప్పాయి వంటి అనేక రకాల పంటలను సాగు చేస్తున్నాడు. బిక్రంజిత్ సింగ్ తోటలో 600 జామ చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల మధ్య మొక్కజొన్న, లిచ్చి కూడా సాగు చేస్తున్నాడు. గత మూడేళ్లుగా అంతర పంటల పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు.

అంతర పంట అంటే ఏమిటంటే 

ఇవి కూడా చదవండి

ఒకే పొలంలో వివిధ రకాల పంటలను పండించే విధానాన్ని అంతర పంట అంటారు. దీని కింద మామిడి, జామ, లిచ్చి , బెర్రీలతో సహా ఇతర పంటల మొక్కలను ఒక పొలంలో సమాన దూరంలో నాటారు. అదే సమయంలో ఈ మొక్కల మధ్య పెసలు, అరటి, మొక్కజొన్న, టమోటాలు సహా ఇతర ఆకుపచ్చ కూరగాయలను సాగు చేస్తారు. ఇలా ఒకే భూమిలో అంతర పంటలను వ్యవసాయం చేయడం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో బిక్రమ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ లిచ్చి మొక్కలు నాటిన 5 ఏళ్ల తర్వాత పంట పండ్లను ఇస్తాయి. అంటే 5 సంవత్సరాల తర్వాత లిచ్చి పండ్ల అమ్మకంతో సంపాదన మొదలు అవుతుంది. ఈ లిచ్చి తోటల మధ్య మొక్కజొన్నను అంతర పంటగా పండిస్తారు.

రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలు అమలు.. 

అదే సమయంలో అంతర పంటల పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుందని ఉద్యానవన శాఖ అధికారి క్రిషన్ కుమార్ చెబుతున్నారు.  అంతేకాదు హర్యానాలో చాలా మంది రైతులు క్రమంగా అంతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఉద్యానవన శాఖ కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. దీంతో పాటు రైతులను కూడా ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, వాటి కింద బంపర్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..