Vastu Tips For Plants : శ్రావణ శనివారం వేళ ఈ మొక్కను నాటండి.. మీ ఇంట్లోకి అదృష్ట లక్ష్మీ నడిచిరావటం గ్యారెంటీ..!

|

Jul 22, 2024 | 3:41 PM

ది మీ ఇంటి ఆవరణలో శనివారం నాడు నాటినట్టయితే ఆ శనిదేవుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఏడేళ్ల శని వెంటాడుతున్న వారు ఈ మొక్కను నాటినట్టయితే వారికి ఉపశమనం లభిస్తుంది. శని దోశం ఉన్నవారికి ఇది విశేష ప్రయోజనాలను ఇస్తుంది. రెండున్నరేళ్ల శని దోశానికి ఈ మొక్కను రోజూ పూజించాలి. ఇది శనిగ్రహ దోషాల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Vastu Tips For Plants : శ్రావణ శనివారం వేళ ఈ మొక్కను నాటండి.. మీ ఇంట్లోకి అదృష్ట లక్ష్మీ నడిచిరావటం గ్యారెంటీ..!
Shami Plant
Follow us on

ఇంట్లో లేదా ఇంటి ముందు మొక్కలు పెంచటం వల్ల తాజాదనాన్ని, సానుకూలతను కలిగిస్తుంది. అలాగే కొన్ని మొక్కలు జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును కలిగిస్తాయి. వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలు ఇంటికి చాలా శుభప్రదమైనవిగా చెబుతారు. ఈ మొక్కలను ఇంట్లోకి తీసుకురావడం వలన సంపద పెరుగుతూనే ఉంటుంది. మీ పురోగతి మార్గం తెరుచుకుంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే, కొన్ని మొక్కలు మీ జాతకంలో ఉన్న గ్రహా దోషాలను తొలగిస్తాయి. ఈ మొక్కలు ఇంట్లో నాటితే, అపారమైన ఆర్థిక లాభాలు ఉంటాయని చెబుతున్నారు. ఇంటి ఐశ్వర్యం పెరగాలంటే..శ్రావణ శనివారం మీ ఇంటి ఆవరణలో ఇలాంటి మొక్కను నాటాలని నిపుణులు చెబుతున్నారు. అది మీ ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుందని అంటున్నారు.

సాధారణంగా మనీ ప్లాంట్ గురించి అందరికీ తెలుసు. మనీ ప్లాంట్ కాకుండా, డబ్బును ఆకర్షించడానికి ఏ మొక్కలు నాటాలో వాస్తు శాస్త్రంలో పేర్కొనబడింది. వాస్తులో పేర్కొన్న ముఖ్యమైన మొక్క శమీ మొక్క. ఇది మీ ఇంటి ఆవరణలో శనివారం నాడు నాటినట్టయితే ఆ శనిదేవుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతున్నారు. అలాగే శని సడేశాతి అంటే ఏడున్నర సంవత్సరాల శని దోశం ఉన్నవారికి ఇది విశేష ప్రయోజనాలను ఇస్తుంది. రెండున్నరేళ్ల శని దోశానికి ఈ మొక్కను రోజూ పూజించాలి. ఇది శనిగ్రహ దోషాల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

మీ ఆవరణలో ఈ శమీ మొక్కను నాటితే, ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది. శ్రావణ మాసంలో శమీ మొక్కను నాటాలి. శ్రావణ శనివారం ఇంట్లో ఈ మొక్కను నాటాలి. అలాగే ప్రతిరోజు ఉదయం శమీ మొక్కకు నీళ్లు పోయాలి. సాయంత్రం ఆవనూనె దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..