Indian Railways: ఈ రైల్వే స్టేషన్‌లో ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరొక ప్లాట్‌ఫామ్‌కు వెళ్లాలంటే ట్యాక్సీ ఎక్కాల్సిందే.
Railway Platform: ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లో ఇండియాది నాలుగో స్థానం. మన దేశంలో రైల్వేకు ఉన్న ప్రాముఖ్యతే వేరు చాలా మంది రైలు ప్రయాణానికే ప్రాముఖ్యతనిస్తారు. రైలు ప్రయాణం చేయని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కారణం.. ట్రైన్ జర్నీ చాలా ఉల్లాసభరితంగా ఉంటుంది. అంతేకాదు.. సుదూర గమ్యాలను సైతం త్వరగా చేర్చగలదు. అందుకే.. చాలా మంది ట్రైన్ జర్నీని ఇష్టపడుతారు. ఎవరైనా ప్రయాణికులు రైలు జర్నీ చేయాలనుకుంటే.. వారు ముందుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిందే.

Railway Platform: ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లో ఇండియాది నాలుగో స్థానం. మన దేశంలో రైల్వేకు ఉన్న ప్రాముఖ్యతే వేరు చాలా మంది రైలు ప్రయాణానికే ప్రాముఖ్యతనిస్తారు. రైలు ప్రయాణం చేయని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కారణం.. ట్రైన్ జర్నీ చాలా ఉల్లాసభరితంగా ఉంటుంది. అంతేకాదు.. సుదూర గమ్యాలను సైతం త్వరగా చేర్చగలదు. అందుకే.. చాలా మంది ట్రైన్ జర్నీని ఇష్టపడుతారు. ఎవరైనా ప్రయాణికులు రైలు జర్నీ చేయాలనుకుంటే.. వారు ముందుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిందే. స్టేషన్‌లో సంబంధిత రైళ్లు.. ఆయా ప్లాట్‌ఫారమ్‌ల పైకి వస్తుంటాయి. ప్రయాణికులు.. ఒక ప్లాట్‌ఫారమ్ నుంచి మరో ప్లాట్‌ఫారమ్ మీదకు వెళ్లాలంటే.. మెట్ల మార్గం గానీ.. ట్రాక్ దాటడం గానీ చేస్తుంటారు. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్‌ల గురించి తెలిస్తే అవాక్కవుతారు. ఇది ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ మాదిరిగా.. ఒక ప్లాట్‌ఫారమ్ నుంచి మరొక ప్లాట్‌ఫారమ్‌కు టాక్సీని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అది ఏ రైల్వే స్టేషన్? అది ఎక్కడ ఉంది? కీలక వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ స్టేషన్ ఎక్కడ ఉంది?
ఈ రైల్వే స్టేషన్ బీహార్ రాష్ట్రంలో ఉన్న బరౌని రైల్వే స్టేషన్. ఇక్కడ రెండు ప్లాట్‌ఫారమ్‌ల మధ్య దూరం 2 కిలోమీటర్లు ఉంటుంది. ఒక ప్లాట్‌ఫారమ్ నుంచి మరో ప్లాట్‌ఫారమ్‌కి వెళ్లాలంటే టాక్సీ ఎక్కాల్సిందే. దీనిని బ్రిటీష్ కాలంలో నిర్మించారు. భవిష్యత్తులో మరిన్ని ప్లాట్‌ఫారమ్‌లను సృష్టించాల్సిన అవసరం ఉందని ఆ సమయంలో ప్రజలకు తెలియదు. అందుకోసం స్థలంలోనే అక్కడ ప్లాట్ ఫాం నిర్మించారు. అయితే, ఆ తర్వాత కొత్త ప్లాట్‌ఫారమ్‌ల నిర్మాణం చేపట్టాలని భావించగా.. అక్కడ స్థలం సరిపోవడం లేదని తేలింది. దాంతో అధికారులు కొత్త ప్లాన్ వేశారు.
ఈ కారణంగా ప్లాట్‌ఫారమ్‌ను దూరంగా నిర్మించారు..
ప్లేస్ సరిపోని కారణంగా 2కిలోమీటర్ల దూరంలో కొత్త ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించాల్సి వచ్చింది. కొత్త ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించినప్పుడు, ప్రయాణికుల సౌకర్యార్థం, రైల్వే అధికారులు గూడ్స్ రైళ్లకు మాత్రమే ప్లాట్‌ఫారమ్‌ను రిజర్వ్ చేశారు. ప్రస్తుతం పాత ప్లాట్‌ఫారమ్‌లో గూడ్స్ రైళ్లు మాత్రమే ఆగుతున్నాయి. ఈ జంక్షన్ పేరు తర్వాతి కాలంలో న్యూ బరౌని జంక్షన్‌గా మార్చారు.
ఇలాంటి వింతలు మన దేశంలో చాలానే ఉన్నాయి..
ఇండియన్ రైల్వేస్‌కు సంబంధించిన మన దేశంలో అరుదైన అంశాలు చాలానే ఉన్నాయి. దేశ సరిహద్దుల్లో గల రైల్వే స్టేషన్‌లు, ఓ భాగం మనదేశంలో.. మరో భాగం పొరుగు దేశంలో ఉన్న రైల్వే స్టేషన్స్ కూడా ఉన్నాయి. ఇక పేరు రైల్వే స్టేషన్ వంటి వింతైన స్టేషన్స్ మన దేశంలో చాలానే ఉన్నాయి.
మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
