Indian Railway: ట్రైన్ జర్నీ.. మిడిల్ బెర్త్‌లో ఎప్పుడు పడితే అప్పుడు పడుకోలేరు.. ఎందుకంటే..?

| Edited By: Team Veegam

Mar 12, 2021 | 6:42 PM

Middle Berth - Train Journey: రైలులో ప్రయాణం చేసేటప్పుడు చాలా విషయాలపై గొడవలు, వాదనలు జరుగుతుంటాయి. సాధారణంగా చాలా మంది సీట్ల గురించి గొడవ పెట్టకుంటుంటారు. ఇలాంటి..

Indian Railway: ట్రైన్ జర్నీ.. మిడిల్ బెర్త్‌లో ఎప్పుడు పడితే అప్పుడు పడుకోలేరు.. ఎందుకంటే..?
Middle Berth Train Journey
Follow us on

Middle Berth – Train Journey: రైలులో ప్రయాణం చేసేటప్పుడు చాలా విషయాలపై గొడవలు, వాదనలు జరుగుతుంటాయి. సాధారణంగా చాలా మంది సీట్ల గురించి గొడవ పెట్టకుంటుంటారు. ఇలాంటి సందర్భంలో వాదనలు పిక్స్‌కు వెళ్లిపోతుంటాయి. ఈ గొడవలన్నీ కూడా ఒక మద్య బెర్త్ వల్లే వస్తుంటాయి. ఎందుకంటే.. ప్రయాణికులకు మిడిల్ బెర్త్ కన్ఫామ్ అయితే.. వారు త్వరగా పడుకునేందుకు ఇష్టపడుతుంటారు. వారి వల్ల లోయర్ బెర్త్‌లో కూర్చున్నవారికి అసౌకర్యం కలుగుతుంది. చాలా మంది ట్రైన్ జర్నీలో కూర్చొని వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. ఇలాంటి సందర్భంగా మిడిల్ బెర్త్ వారి వల్ల రైలు ప్రయాణం ఇబ్బందికరంగా మారిందంటూ చాలాసార్లు ఫిర్యాదులు సైతం అందాయి. ముఖ్యంగా ప్రయాణికుల్లో సమన్వయం లేకపోవడంతోనే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు భారత రైల్వే శాఖ చర్యలు ప్రారంభించింది. కావున ప్రయాణికులు రైల్వే నిబంధనలపై దృష్టి సారించడం మంచిది.. లేకపోతే జరిమానాతోపాటు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.

దీనికోసం రైల్వే శాఖ నియమాలను జారీ చేసింది. అయితే మిడిల్ బెర్త్ కేటాయించిన వ్యక్తి ఎప్పుడు పడితే అప్పుడు పడుకోలేరు. ఎందుకంటే లోయర్ బెర్త్‌లో ఉన్నవారికి అసౌకర్యం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నారు. లోయర్ బెర్త్‌లో ఉన్న వ్యక్తి కూర్చొని ఉంటే మిడిల్ బెర్త్‌ను 24గంటలపాటు ఉపయోగించలేరు.
రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు మాత్రమే..
రైల్వే నిబంధనల ప్రకారం.. మధ్య బెర్త్ ప్రయాణీకులు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు తన బెర్త్‌పై హాయిగా నిద్రించవచ్చు. ఉదయం 6నుంచి.. రాత్రి 10 గంటల వరకూ మిడిల్ బెర్త్‌ను తెరవకుండా ఆపాలనుకుంటే లోయర్ బెర్త్ వ్యక్తి ఆపవచ్చు. ఎందుకంటే.. అప్పర్, లోయర్ బెర్త్‌లల్లో ఉన్నవారు కూర్చునేందుకు వీలుగా ఈ నియమాలను జారీ చేశారు. అయితే అప్పటికీ మిడిల్ బెర్త్ వారు వినకపోతే.. ట్రైన్‌లో ఉన్న టీసీ లేదా గార్డులకు ఫిర్యాదు చేయవచ్చు.

రైలులో ప్రయాణించేటప్పుడు కొన్ని నియమాలను ప్రత్యేకంగా తెలుసుకోవాలి. రైల్వే చట్టంలోని సెక్షన్ 156 ప్రకారం.. రైలుపైన లేదా.. గేటు దగ్గర ప్రయాణించడం కూడా చట్టపరమైన నేరం. ఇలా చేస్తే ప్రయాణికుడికి 500 రూపాయల జరిమానాతోపాటు 3 నెలల జైలు శిక్ష విధించే అవకాశముంది. దీంతోపాటు రైలులో అసౌకర్యానికి గురిచేసినా.. న్యూసెన్స్ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Also Read: AmritMahotsav : 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ 75 వారాలపాటు దేశవ్యాప్తంగా 75 కార్యక్రమాలు.. నేటి నుంచే కౌంట్ డౌన్

Kamal Hassan: ప్రబల శక్తిగా కమల్ హాసన్.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుతో ప్రధాన కూటములకు సవాల్ విసురుతున్న నటుడు

PM Kisan: రైతుల ఖాతాల్లోకి ఏప్రిల్ నెలలో రూ.2 వేలు.. ఈ వివరాలు సబ్మిట్ చేశారో లేదో చూసుకోండి..