Miss World Pageant: భారత్‌లోనే మిస్‌ వరల్డ్‌ పోటీలు.. 28 ఏళ్ల తర్వాత.. ఏ నగరంలోనంటే..

|

Feb 10, 2024 | 7:50 AM

భారతదేశం చివరిగా 1996లో మిస్ వరల్డ్ పోటీకి ఆతిథ్యం ఇచ్చిన మూడు దశబ్దాల తర్వాత ఈ పోటీని భారతదేశంలో నిర్వహిస్తున్నారు. ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఐటీడీసీ) ఆధ్వర్యంలో ఈ నెల 20న ఢిల్లీలో ది ఓపెనింగ్‌ సెర్మనీ, ఇండియా వెల్‌కమ్స్‌ ది వరల్డ్‌ గాలా కార్యక్రమాలతో ఈ ప్రదర్శన మొదలవనుంది.

Miss World Pageant: భారత్‌లోనే మిస్‌ వరల్డ్‌ పోటీలు.. 28 ఏళ్ల తర్వాత.. ఏ నగరంలోనంటే..
Miss World
Follow us on

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రపంచ సుందరి పోటీలు ఈ సారి భారత్‌ వేదికగా జరగనున్నాయి. అంతర్జాతీయ అందాల పోటీల 71వ ఎడిషన్‌ను ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు భారతదేశంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భారతదేశం చివరిగా 1996లో మిస్ వరల్డ్ పోటీకి ఆతిథ్యం ఇచ్చిన మూడు దశబ్దాల తర్వాత ఈ పోటీని భారతదేశంలో నిర్వహిస్తున్నారు. ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఐటీడీసీ) ఆధ్వర్యంలో ఈ నెల 20న ఢిల్లీలో ది ఓపెనింగ్‌ సెర్మనీ, ఇండియా వెల్‌కమ్స్‌ ది వరల్డ్‌ గాలా కార్యక్రమాలతో ఈ ప్రదర్శన మొదలవనుంది.

మార్చి 9న ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఫైనల్స్‌ జరగనున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి 120 మంది సుందరీమణులు ఈ పోటీలో పాల్గొన్నున్నారు. ప్రస్తుత ప్రపంచ సుందరి పోలెండ్‌కు చెందిన కరోలినా బిలాస్కాతో పాటు మాజీ విజేతలు ఆన్‌సింగ్‌(జమైంకా), వనెస్సా పోన్సీ డీ లియోన్‌(మెక్సికో), మానుషీ చిల్లర్‌(భారత్‌), స్టీఫెనీ డెట్‌ వాలీ (ఫ్యూర్టో రికో)లు హాజరైన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు.

ఇవి కూడా చదవండి

1951లో స్థాపించబడిన, మిస్ వరల్డ్ పోటీ సంప్రదాయ అందాల పోటీలను అధిగమించి, తెలివితేటలు, మానవతా సేవ ద్వారా సానుకూల మార్పును సృష్టించగల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.. రాబోయే ఈవెంట్‌లో, పోలాండ్‌కు చెందిన కరోలినా బిలావ్స్కా, ప్రస్తుత ప్రపంచ సుందరి, ఈ గౌరవప్రదమైన పోటీల చరిత్రలో మరో అధ్యాయాన్ని గుర్తుచేస్తూ కిరీటాన్ని అందజేయనున్నారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..