Biryani: నాణ్యతలో రాజీ లేదు.. రుచిలో సాటి రాదు.. రూ.10 కే బిర్యానీ.. ఇంట్రెస్టింగ్ స్టోరీ మీ కోసం..

|

Jan 22, 2023 | 4:27 PM

భారతదేశం వైవిధ్యాలకు నిలయం. ప్రతి ప్రాంతానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని అంటారు. ఇక ఆహారపు అలవాట్లు విషయానికి వస్తే.. ప్రాంతాన్ని బట్టి తీసుకునే...

Biryani: నాణ్యతలో రాజీ లేదు.. రుచిలో సాటి రాదు.. రూ.10 కే బిర్యానీ.. ఇంట్రెస్టింగ్ స్టోరీ మీ కోసం..
Biryani
Follow us on

భారతదేశం వైవిధ్యాలకు నిలయం. ప్రతి ప్రాంతానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని అంటారు. ఇక ఆహారపు అలవాట్లు విషయానికి వస్తే.. ప్రాంతాన్ని బట్టి తీసుకునే ఆహారం విధానంలో మార్పులు ఉంటాయి. దేశంలోని ప్రతి మూలలో వివిధ రుచికరమైన ఆహారాలు రారమ్మని ఊరిస్తుంటాయి. అయితే.. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వంటకాల గురించి చెప్పుకోవాలి. ఈ రాష్ట్రం పేరు చెబితే ముందుగా మనకు గుర్తొచ్చేది రసగుల్లా.. అయితే దానితో పాటు బిర్యానీ కూడా అక్కడ దొరుకుతుంది. హబ్రాలో రూ. 10కి బిర్యానీని ఆస్వాదించవచ్చు. మొదట్లో ప్రయోగాత్మకంగా రూ.10కి బిర్యానీని ప్రారంభించారు. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో మరింత ఎక్కువ మందికి తక్కువ ధరకే బిర్యానీ అందించాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు.

డైమండ్ హార్బర్‌లోని మాధవపూర్‌లోని అన్నపూర్ణ రెస్టారెంట్‌లో రూ.50, రూ.10 కి ప్రత్యేక బిర్యానీలు విక్రయిస్తున్నారు. రూ.50 కే చికెన్ బిర్యానీని అందిస్తున్న ఈ రెస్టారెంట్ కస్టమర్లకు రకరకాల బిర్యానీలను అందిస్తోంది. అన్నం, చికెన్ ముక్కలతో చేసే ఈ బిర్యానీ రుచి చూసేందుకు జనాలు బారులు తీరుతున్నారు. కాగా.. రూ.10 బిర్యానీకి ఎక్కువ మంది కస్టమర్లు స్థానిక పాఠశాల విద్యార్థులు, వస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. కేవలం మధ్యాహ్నం పూట మాత్రమే దొరికే బిర్యానీ కోసం ముందుగానే బారులు తీరుతున్నారు బిర్యానీ ప్రియులు.

అయితే.. నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా, రుచిని అలాగే ఉంచుతూ రూ.10 కే బిర్యానీ అందించడం తమకెంతో ఆనందంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు, స్థానికులు ఇక్కడకు వస్తున్నారు. కావాలంటే మీరూ.. ఓ సారి పశ్చిమబెంగాల్ వెళ్తే.. తప్పకుండా ఈ బిర్యానీని ఓ పట్టు పట్టేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..