Train: రైలు నడుపుతున్న డ్రైవర్ పొరబాటున నిద్రలోకి జారుకుంటే ఏమవుతుంది..?
మీరు రైలులో చాలా సార్లు ప్రయాణించి ఉండవచ్చు, కానీ డ్రైవర్ గాఢ నిద్రలోకి వెళితే రైలుకు ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ??

బస్సు గానీ.. కార్లు గానీ ఇతర వాహనాలు నడుపుతున్న డ్రైవర్స్ నిద్రలోకి జారుకోవడం వలన పెను ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. అలానే ట్రైన్‌ను డ్రైవర్ అనుకోకుండా నిద్రలోకి జారుకుంటే ఏం జరుగుతుంది అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా రైలులో ఇద్దరు లోకో పైలట్లు ఉంటారు. వారిలో ఒకరు సీనియర్ లోకో పైలట్ కాగా మరొకరు అసిస్టెంట్ లోకో పైలట్. లోకో పైలట్ అనుకోకుండా నిద్రలోకి జారుకున్నట్లయితే, అసిస్టెంట్ లోకో పైలట్ లోకో పైలట్‌ను అప్రమత్తం చేస్తాడు. ఒకవేళ ఇద్దరూ నిద్రలోకి జారుకుంటే, లోకోపైలట్ అలర్ట్ కోసం విజిలెన్స్ కంట్రోల్ డివైస్ (VCD) అనేది మైక్రోకంట్రోలర్ ఆధారిత భద్రతా పరికరం ఉంటుంది.
ఇది డ్రైవర్ అసమర్థమైన సందర్భంలో స్వయంచాలకంగా ట్రైన్ బ్రేక్స్‌ని అప్లై చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ప్రతి 60 సెకండ్స్ లోపు లోకో పైలట్ ఎదో ఒక ఆపరేషన్ చెయ్యాలి. అంటే.. హార్న్ ఇవ్వడం లేదా ట్రైన్ స్పీడ్ పెంచడం లేదా తగ్గించడం వంటివి. ఒక వేళ పైలట్ అలా చెయ్యనిచో 60 సెకండ్స్ తర్వాత ఇంజన్‌లోని ఓ లైట్ 8 సెకన్ల పాటు బ్లింక్ అవుతుంది. అప్పుడు పైలట్ అప్రమత్తమైతే ఓకే. లేదంటే ఈ సారి మరో 8 సెకన్ల పాటు బజర్ సౌండ్ వస్తుంది. ఇలా 16 సెకన్లపాటు ఆడియో విజువల్ ఇండికేషన్ వస్తుంది. అయినప్పటికీ పైలట్ కానీ అసిస్టెంట్ పైలట్ కానీ రియాక్ట్ అవ్వకపోతే.. లోకోమోటివ్ పవర్ డౌన్ అయ్యి.. బ్రేక్స్ ఆటోమాటిక్ గా అప్లై అయిపోయి ట్రైన్ ఆగిపోతుంది.
( ఈ సమాచారం సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్న శంకర్ నాగ్ అనే ట్రైన్ లోకో పైలట్ నుంచి సేకరించబడింది)
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..